– కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసెంబరు 7వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో జరగబోయే నిరసన దీక్ష
– మీడియాతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ కి రిప్రజెంటేషన్ సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో వివరించాం. ప్రత్యేకంగా, జీవో నెంబర్ 27ను వ్యతిరేకిస్తున్నామని, దాన్ని వెంటనే విత్డ్రా చేయాలని గవర్నర్ ని కోరుతూ ఈ మెమొరాండం సమర్పించాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అవినీతి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. దాదాపు రెండు సంవత్సరాలు పాలన పూర్తిచేసుకున్నా ఈ ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేకపోయింది. హిల్ట్ పాలసీ, జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ తీసుకొచ్చిన జీవో, ఇలా అనేక కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసెంబరు 7వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో జరగబోయే నిరసన దీక్షలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి, అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తుంది.