Suryaa.co.in

Telangana

నువ్వేం చేస్తున్నావో అన్నీ మా దగ్గర చిట్టా ఉంది

  • నువ్వేం శుద్ధపూస అనుకోకు.. డ్రామాలు ఆపితే మంచిది
  • రుణమాఫీ..బక్వాస్, బోగస్
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం
  • నిజం కాదు.. ఇది కాంగ్రెస్ విషప్రచారం
  • బీజేపీలో అలాంటి చర్చ ప్రస్తావన లేదు
  • హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామా ఆపాలి
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్: రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం బక్వాస్, బోగస్. బుకాయిస్తున్నారు. ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కాలేదని దమ్ముంటే ఒప్పుకోవాలి. బ్యాంకర్ల లెక్కల ప్రకారం 72 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిఉండగా.. ఎన్నికల ముందు రేవంత్ 63 వేల కోట్లు అని హామీ ఇచ్చారు.

విధివిధానాల పేరుతో 34 వేల కోట్లకు కుదించారు. ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రుణమాఫీ చేసి పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు. ఒక్క ఘట్కేసర్ సొసైటీ లోనే 1200 మంది రైతులకు 9 కోట్ల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. కానీ వందలకోట్లు ప్రజాధనంతో కేసీఆర్ లెక్కనే ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామా ఆపాలి. ఎఫ్.టి.ఎల్ లో ఉన్న పట్టా భూముల్లో నిర్మాణాలు కూల్చొద్దు. నీళ్ళు రాకుండా ఏర్పాటు చేయాలి. చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాలు జరగకుండా చూడాలి. అక్రమకట్టడాల పట్ల స్ట్రిక్ట్ గా ఉన్న అని చెప్పుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావో అన్నీ మా దగ్గర చిట్టా ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు చేస్తున్నారు. నువ్వేం శుద్ధపూస అనుకోకు. డ్రామాలు ఆపితే మంచిది.

LEAVE A RESPONSE