మేము ఏ పార్టీకి ఏ టీమ్ బీ టీం కాదు
ఇక్కడ గెలిచిన తర్వాత కచ్చితంగా మహారాష్ట్ర లో కాలు పెడతాం
భారతదేశంలో ఈ ఇద్దరే ఉండాలా?
మిగితా వాళ్ళు ఉండకూడదా?
నిరుద్యోగం తారాస్థాయి కి చేరింది అనటం అవాస్తవం
ఎడిటర్లతో కేటీఆర్
పాట్ని నుంచి కొంపల్లి దాకా, జేబీఎస్ నుంచి తూం కుంట వరకు స్కై వే ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. కానీ కేంద్ర మంత్రులను కలిసిన రక్షణ శాఖ భూములు ఇవ్వలేదు. వచ్చే ప్రభుత్వం లో ఈ స్కై వే నిర్మిస్తాం. గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెరిగాయి. కేంద్రం ఇష్టం వచ్చినట్లు పెంచి 1200 చేసింది. పెంచిన 800 సిలిండర్ ధర మేము భరించి , 400 కే సిలిండర్ అందిస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయి కి చేరింది అనటం అవాస్తవం.
కాంగ్రెస్, బీజేపీ లు పేపర్ లీకేజి పై ఎక్కడ లేని రాద్దాంతం చేస్తున్నాయి. లక్ష 63వెల ఉద్యోగాలు భర్తీ చేసింది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. కచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. మా తప్పును ఒప్పుకున్నాం. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల లో మేము నిబద్దత తో పని చేశాం. కాబట్టే రాష్ట్ర సంపద పెరిగింది.
45 ఏళ్ల కేసిఆర్ రాజకీయ జీవితం లో కానీ, బీ ఆర్ ఎస్ 22 ఏళ్లలో ఏనాడూ కూడా బీజేపీ తో పొత్తు పొత్తు పెట్టుకోలేదు. ఏ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మేము బీజేపీ తో కలిసి వెళ్ళలేదు. కాంగ్రెస్ బీజేపీ కొన్ని చోట్ల కలిశాయి. కొన్ని కేసుల్లో అరెస్ట్ చేయలేదు అంటే మేము బెయిల్ తెచ్చుకున్నాం కాబట్టే ఆగింది. మేము బీజేపీ తో కలిసి నట్టు కాదు. మేము ఏ పార్టీకి ఏ టీమ్ బీ టీం కాదు.
దేశంలో మార్పు రావాలి. మార్చి మార్చి కేంద్రం లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము ఇక్కడ గెలిచిన తర్వాత కచ్చితంగా మహారాష్ట్ర లో కాలు పెడతాం. కచ్చితంగా మహారాష్ట్ర లో 10,15 సీట్లు గెలుస్తాం. భారతదేశంలో ఈ ఇద్దరే ఉండాలా? మిగితా వాళ్ళు ఉండకూడదా? మేము ఎవరితో కలిసి లేము.