Suryaa.co.in

Andhra Pradesh

మూడు రాజధానులపై మాకు ఎటువంటి కన్ఫ్యూజన్‌ లేదు

– కన్ఫ్యూజన్‌ సృష్టిస్తున్నది ఎల్లో మీడియానే…
– మూడు రాజధానులకే మేం కట్టుబడి ఉన్నాం
– మంత్రి బుగ్గన చెప్పింది కూడా అదే..
– బుగ్గన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించింది
– వికేంద్రీకరణకు ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉంది
– రాజధాని పేరుతో రాజకీయం చేస్తుంది టీడీపీ, ఎల్లో మీడియానే
– విశాఖలో పరిపాలనా రాజధాని, పరిశ్రమలు వస్తే వీళ్ళకు కడుపుమంట ఎందుకు?
– సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌
-: ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి

వికేంద్రీకరణకే మేం కట్టుబడి ఉన్నాం
– ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిని ఒకే చోట కేంద్రీకృతం చేశారు
– విభజన తర్వాత కూడా చంద్రబాబు పరిపాలనలో కూడా శాసన, న్యాయ, పరిపాలన రాజధానులన్నీ ఒకే చోట పెట్టి దానికి అమరావతి అని నామకరణం చేశారు
– జగన్మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకున్నారు.
– మారుతున్న కాలానికి అనుగుణంగా వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరం అని గుర్తించాం. వికేంద్రీకరణకే మేం కట్టుబడి ఉన్నాం.
– పరిపాలనను వికేంద్రీకరణ చేయడంలో భాగంగా ప్రధాన విభాగాలు మూడింటిని మూడు ప్రాంతాలో పెట్టాలని బిల్లు తీసుకొచ్చాం.
– అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. మేము మా వాదనలు వినిపిస్తున్నాం.

కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నది ఎల్లో మీడియానే..:
– నిన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పింది కూడా వికేంద్రీకరణ గురించే .
– ఎల్లో మీడియా ఆయన మాటలను వక్రీకరించి, ఈరోజు ఆ పత్రికల్లో వచ్చిన బ్యానర్ వార్తలు చూస్తే.. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేశారు.
– పరిపాల వికేంద్రీకరణలో భాగంగా.. మంత్రి వర్గం, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో ఉంటుంది.
– అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుంది..హైకోర్టు, న్యాయ సముదాయాలు కర్నూలులో ఉంటాయి
– వాటిని క్యాపిటల్‌ అనేది మేమిచ్చుకున్న నిర్వచనం…ఇందులో వైరుధ్యం ఏమీ లేదు
– సుప్రీంలో మేం వాదించేది కూడా అదే. ఇంకా అందరి సూచనలు తీసుకుంటాం
– వికేంద్రీకరణకు చట్టరూపం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మా విధానంలో మార్పు ఉండదు
– అందులో భాగంగా ప్రధాన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెట్టడానికి మేం కట్టుబడి ఉన్నాం
– కింది స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి గారు ప్రజలు గడప వద్దకే తీసుకెళ్లారు
– పాలన వికేంద్రీకరణలో భాగంగానే 13 జిల్లాలు… 26 జిల్లాలు అయ్యాయి.

బుగ్గన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించింది:
– ఉన్నతమైన చట్టసభ ఇక్కడే ఉంటుంది… దానిని మేం రాజధాని అంటున్నాం. అది శాసన రాజధాని
– ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అత్యున్నతమైనది శాసన వ్యవస్థ.. అంటే, అసెంబ్లీ, మండలి ఇక్కడే ఉంటాయి
– దానిని మీరు శాసన రాజధాని అని పిలిస్తే ఓకే..పిలిచినా పిలవకపోయినా అసెంబ్లీ, మండలి ఇక్కడే ఉంటాయి
– దాని వల్ల కీలకమైన శాసన వ్యవస్థ ఇక్కడ పెట్టడం వల్ల, మా ఆకాంక్షను గౌరవించారనే సంతృప్తి ఇక్కడ వారికి ఉంటుంది
– బుగ్గన రాజేంద్రనాథ్‌ పోలికలో బెంచ్‌ అన్నారు.. కర్నాటకలో హైకోర్టు ఒక చోట ఉంటే బెంచ్‌ మరొక చోట ఉంటుంది కదా అని అన్నారు
– బుగ్గన ప్రసంగం మొత్తంలో ఎటువంటి వివాదాస్పదం లేదు.. ఆయన మాట్లాడినదానిని ఎల్లో మీడియా వక్రీకరించి పైశాచిక ఆనందం పొందాలనే తపనతో రాసిన రాతలే అవి.
– ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలనే భావనతో అలా రాసి ఉంటారు
– బుగ్గన చెప్పిన దాంట్లో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేదు..
– ముఖ్యమంత్రి గారు ఒక చోట ఉంటే.. మిగతావి వేరే చోట ఉంటాయనే చెప్పారు
– కానీ హైకోర్టు కర్నూలులో వస్తుంది… బెంచ్‌ మరో చోట వస్తుంది
– “మిగిలిన ప్రాంతాలకు రాజధాని ఇవ్వడం లేదు… వైజాగ్‌ కు రాజధాని వెళ్లిపోతుంది” అని చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తుంది.
– “మా అమరావతిలోనే అన్నీ ఉంటాయి.. రాజధాని ఎక్కడకూ వెళ్లదు” అని చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది
– ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు
– ఎవరైతే అమరావతిలోనే రాజధాని ఉండాలి.. ఇక్కడి మా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళే ఇలాంటి వాదనలు చేస్తున్నారు

అస్పష్టతకు అవకాశం లేనేలేదు.. మా విధానం వికేంద్రీకరణే:
– వికేంద్రీకరణ విషయంలో ఎటువంటి అస్పష్టతకు అసలు అవకాశమే లేదు…దానికి ఏ పేరు పెట్టినా వికేంద్రీకరణ మాత్రం తథ్యం
– ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన ప్రసంగంలో కానీ, మేం పెట్టిన బిల్లు కానీ వికేంద్రీకరణే మా ధ్యేయం అని చెప్పాం
– ఈ ప్రభుత్వం చేసిన చట్టంలోగానీ..మేం ఇస్తున్న హామీల్లో కానీ ఇదే స్పష్టంగా కన్పిస్తుంది
– అన్నిటి కంటే ముఖ్యంగా సుప్రీం కోర్టులో మా వాదన కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్తున్న విషయాల్లో కానీ వికేంద్రీకరణే ప్రధానం అవుతుంది
– మేం ప్రజలకు చెప్పేది మాత్రం ఒకటే.. ఎల్లో మీడియా, టీడీపీ కలిసి చేసే గందరగోళాన్ని నమ్మొద్దు…
– పరిపాలన రాజధాని విశాఖలో ఉంటుంది…శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది..న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది..ఇదే వాస్తవం
– గతంలోనూ ఎల్లో మీడియాలో… ఎ క్యాపిటలా…ది క్యాపిటలా.. అని చర్చ చేసినట్లు, ఆ చట్టంలో ఏముందంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు.. ఇవన్నీ వీళ్లు క్రియేట్‌ చేసే అపోహలే తప్ప, వాస్తవాలు కావు
– వాటిని గురించి ఎవరూ అస్పష్టతకు గురికావద్దు..అపోహలకు గురికావద్దు
– ఎల్లో మీడియా ఈ రోజు అనవసర రాద్దాంతం చేయాలనే ప్రయత్నం చేసింది

కోర్టులకు వెళ్ళి అడ్డుకోకుండా ఉంటే.. వికేంద్రీకరణ ఎప్పుడో జరిగేది:
– ఎన్నికలకు వెళ్లడం కోసం మూడు రాజధానుల అంశాన్ని మేము తెరమీదకు తీసుకురాలేదు.. మొదటి నుంచీ మా విధానం వికేంద్రీకరణ. అందులో భాగంగానే, మేము అధికారంలోకి వచ్చాక, ఆ విధానాన్ని అసెంబ్లీలో పెట్టాం. వీళ్లే కోర్టులకు వెళ్లి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, వికేంద్రీకరణను అడ్డుకుంటూ ఆలస్యం చేశారు
– లేదంటూ ఈ పాటికి వికేంద్రీకరణ జరిగి ఉండేది…
– ఖచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వికేంద్రీకరణ నినాదంతో ఎన్నికలకు వెళ్తుంది..దానికి ప్రజల ఆదరణ కూడా ఉంది
– వికేంద్రీకరణకు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టే.. అమరావతి రైతుల పేరుతో చేసిన పాదయాత్రకు కోర్టు అనుమతించినా, వారు మధ్యలోనే ఆపేశారు..వెనక్కి వచ్చారు
– ఇదొక్క నినాదంతోనే ఎన్నికలకు వెళ్లం… జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన పనులు చాలా ఉన్నాయి.. అందులో వికేంద్రీకరణ కూడా ఒక భాగం
– జనసేన మోస్తున్న చంద్రబాబులా.. ఎన్నికల కోసం ఒక నినాదం.. తర్వాత మరోక నినాదాన్ని జగన్మోహన్‌రెడ్డి గారు నమ్ముకుని లేరు.

అమరావతే ఏకైక రాజధాని అనడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం:
– అమరావతి రాజధాని పేరుతో రాజకీయం చేస్తున్నది వాళ్లే…కచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఈ కుట్ర రాజకీయాలకు తగిన బుద్ధి చెప్తారు
– ఎన్నిసార్లు తిరగేసి చెప్పినా చంద్రబాబునాయుడు చేసిన ఘోర తప్పిదం అమరావతి అనే ఒకే ఒక్క రాజధానిని ఎంపిక చేయడం
– మారుతున్న కాలానికి తగినట్లు, శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పినట్లు అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకరణ చేయవద్దని చెప్పినా చంద్రబాబు వినలేదు
– హైదరాబాద్‌ లాంటి ఏకైక రాజధాని విషయం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆ కమిటీ స్పష్టంగా చెప్పింది
– వికేంద్రీకరణ చేయండి…ఎక్కువ పంటలు పండే ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని కూడా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది
– ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందనే సలహా కూడా వాళ్లు ఇచ్చారు
– అత్యంత సంకుచితమైన వారి ప్రయోజనాల కోసం, రాజధాని పేరుతో లక్ష కోట్లు ఎలా సంపాదించుకోవాలనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా చంద్రబాబు ఆలోచించాడు.
– ఆయనకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల తీర్పును దుర్వినియోగం చేశాడు..
– దాన్ని సరిచేయడం కోసం జగన్మోహన్‌రెడ్డి గారు ఒక నిర్మాణాత్మక ప్రయత్నం చేస్తున్నారు

జగన్మోహన్‌రెడ్డి మాటే…మా మాట:
– మాది ఒకే రాజధాని అని ఎవరైనా అంటే అప్పుడు ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది.
– జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన ప్రతిపాదనలనే పై నుంచి కిందిస్థాయి వరకూ అందరూ చెప్తున్నారు
– ఈ మూడు వ్యవస్థలు ఒకే చోట ఉండటానికి, అవి మూడు ప్రాంతాల్లో ఉండటానికి తేడా లేదంటే ఎలా..?
– మూడు ప్రాంతాలను గౌరవించినప్పుడు అది వికేంద్రీకరణలో భాగం కాకుండా ఎలా ఉంటుంది..?
– ఇవన్నీ ఒకే చోట ఉంటాయని ఎవరైనా అంటే ఆలోచించవచ్చు..మా వాళ్లు ఎవరూ అలా అనడం లేదు కదా
– శాసన వ్యవస్థకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఇక్కడే ఉంటాయి అన్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరగక వేరే చోట ఎలా జరుగుతాయి..?
– శాసన సభ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి అన్న తర్వాత దాంట్లో సందిగ్ధతకు తావు లేదు
– ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా సందిగ్ధత లేని చోట సందిగ్ధత క్రియేట్‌ చేయాలని చూస్తోంది..అది తప్పు

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
సుప్రీం కోర్టు తీర్పును అనుసరించే విశాఖకు వెళ్తాం:
– విశాఖకు వెళ్ళేది సిఎం గారి క్యాంపు కార్యాలయమా..? మొత్తం వ్యవస్థా.. అన్నది కోర్టు తీర్పుకు లోబడే ఉంటుంది
– ఎవర్నో మోసం చేసి అడ్డంగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు
– రాజ్యాంగంప్రకారం చూసినా రాజధాని ఎక్కడ ఉండాలనేది, పరిపాలన ఎక్కడ్నుంచి చేయాలి అనేది కచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టే ఆనాడు చంద్రబాబు అమరావతి అన్నాడు
– పదేళ్లు హైదరాబాద్‌లో అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసు వల్ల హడావుడిగా అర్ధరాత్రి అమరావతికి వచ్చాడు
– అమరావతిపై.. పది రోజుల కమిటీ అయిన నారాయణ కమిటీ వేసి, దాని నుంచి నివేదిక తీసుకున్నాడు
– వికేంద్రీకరణ దిశగా కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను లెక్కచేయకుండా పక్కకు తోసేశారు
– ఎవరితో చర్చించకుండా తనంతట తానుగా ఏకపక్షంగా అమరావతిని డిక్లేర్‌ చేసుకున్నాడు
– ఆ రోజు జగన్మోహన్‌రెడ్డి గారు ఎక్కడ రాజధాని పెట్టినా 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు
– అది రాష్ట్రప్రభుత్వ నిర్ణయం కాబట్టే మేం సలహా మాత్రమే ఇవ్వగలిగాం
– అదే ఇప్పటికీ వర్తిస్తుంది…చంద్రబాబు రాజధాని అంతా పూర్తి చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో తెలియదు
– రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలు చూస్తే రెండు మూడు బడ్జెట్లు కూడా సరిపోవు. దాని నిర్మాణానికి కనీసం ఇరవై ఏళ్లకు పైగా సమయం పట్టేది.
– మౌలిక వసతులు కల్పించకపోతే అక్కడ రాజధాని అనేది ఊహకు కూడా అందని విషయం
– అమరావతి రాజధాని నిర్మాణ వ్యయమే లక్ష కోట్లు అని ఆయనే లెక్కవేసిన నేపథ్యంలో…దాన్ని భరించే పరిస్థితి రాష్ట్రానికి లేనప్పుడు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం
– ఆ రాజధానికి పెట్టాల్సిన ఖర్చు వడ్డీతో కలిపితే 5 లక్షలు కోట్లు అవుతుంది
– అక్కడ కుంభకోణాలన్నీ కళ్లముందు కన్పిస్తున్నప్పుడు.. మరో వైపు ప్రజల చిరకాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి గారు వికేంద్రీకరణ కోసం సరైన నిర్ణయం తీసుకున్నారు
– అందుకే వికేంద్రీకరణపై ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది..దీనిలో మేము పంతానికి వెళ్లి చేస్తున్నది ఏమీ లేదు

విశాఖపై టీడీపీకి ఎందుకు కడుపు మంట..?
– మేం పదే పదే రాజధానుల గురించి మాట్లాడటం లేదు…వాళ్లే రోజూ మాట్లాడుతున్నారు
– మొన్న కిషన్‌ రెడ్డి వద్దకు వెళ్లారు..పాదయాత్ర అంటూ కారేసుకుని ఒకాయన, దేవాలయ యాత్రకు వెళ్ళాడు.
– అమరావతే మా రాజధాని అంటూ రాష్ట్రమంతా అదే కోరుకుంటుందని టీడీపీ, ఎల్లో మీడియా చెప్పే ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకే మేం మాట్లాడుతున్నాం
– విశాఖకు ఉన్న పొటెన్షియల్‌ ఎలాగూ ఉంది..రాజధాని అయితే అదనపు అవకాశం అవుతుంది
– ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుందని సీఎం గారు చెప్పారు.
– విశాఖ అనేది ఏమైనా ఒడిశాలో ఉందా..?. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే… టీడీపీకి బాధేంటో నాకర్ధం కావడం లేదు
– పరిశ్రమలన్నీ విశాఖకు వస్తే వీళ్లకు ఎందుకంత కడుపుమంట..రావద్దనుకుంటున్నారా..?
– అక్కడ పోర్ట్‌ ఉంది… కోస్టల్‌ లైన్‌ ఉంది…క్యాపిటల్‌ ఉంది..పవర్‌ సెంటర్‌ అక్కడ ఉంటే పారిశ్రామిక వేత్తలకు వెసులుబాటు ఉంటుంది
– ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్‌ చేయడానికి ఉన్న అవకాశాలన్నిటినీ మేం వాడుకుంటాం
– అందులో తప్పేముంది..టీడీపీకి బాధేంటి.? పరిశ్రమలు రాకూడదనా…?
– వాళ్ల కడుపు మంటను బయటపెట్టుకోవడం తప్ప.. వాళ్ళకు రాష్ట్రం మీద ప్రేమ మాత్రం కన్పించడం లేదు
– కేంద్రం కూడా రాజధాని ఎంపిక నిర్ణయం అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అన్న మాటను మాత్రం టీడీపీ- ఎల్లో మీడియా చెప్పడం లేదు
– రేపు కోర్టులో కూడా అదే ఉంటుందని మేం ఆశిస్తున్నాం
– రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూర్చోవాలి అనేది రాష్ట్రం నిర్ణయించుకుంటుంది కానీ కేంద్రం కాదు కదా..
– ఒక వేళ కేంద్రమే చేయాల్సి వస్తే.. దానికి కావాల్సిన లక్ష కోట్లు వాళ్లిస్తారా..?
– రాజ్యాంగ పరంగా కూడా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే…సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది.

LEAVE A RESPONSE