-ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు
-నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
-హుస్సేన్ సాహెబ్ కుటుంబానికి పరామర్శ
-పాల్గొన్న జి.వి.ఆంజనేయులు, మక్కెన
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ప్రభుత్వం…ప్రజల ఆస్తులను కూడా వదలటం లేదని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన పార్టీ అభిమాని షేక్ హుస్సేన్‌సాహెబ్ కుటుంబ సభ్యులను శుక్రవారం ఆమె పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ పత్రం అందజే శారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాల న నడుస్తుందని విమర్శించారు. గంజాయికి కేంద్రంగా మార్చి యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జ న్యాలతో అలజడులు సృష్టించారని దుయ్యబట్టారు. మూడు రాజధానులంటూ ఉన్న రాజధానిని కష్టాల్లోకి నెట్టి భూములిచ్చిన రైతులను కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. హైకోర్టు తప్ప అన్ని ఆస్తులను తాకట్టుపెట్టి దోచుకున్న ఈ ప్రభుత్వం ప్రజల సొంత ఆస్తులను లాక్కునే పరిస్థితి ఉందని ఆరోపించారు.
ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలని కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, బొల్లాపల్లి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా మహిళలు పాల్గొన్నారు.