Suryaa.co.in

Telangana

నిరుద్యోగుల తరుపున నిలదీస్తాం

-అసెంబ్లీని స్తంభింప చేస్తాం
-ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి
-ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి
-ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది
-నిరుద్యోగ యువతీ యువకులకు బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది
-మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలి.. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత
-కోదండరాం పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలి.. అమలు చేసే విధంగా ముందుకు రావాలి
-గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

హైద‌రాబాద్‌: మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరం.మోతిలాల్ దీక్ష విరమించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కలిసి కోరాం. ఇది నా ఒక్కడి పోరాటం కాదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న అన్నడు. ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించను అని చెప్పిండు.

పదేపదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం, అందరం కలిసి పోరాటం చేద్దాం, మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివి అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం.

కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపెట్టి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టారు. ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓడదాటే దాకా ఓడ మలన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది.
ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం గారు, రియాజ్ గారు, బాల్మ్యురి వెంకట్, మురళి గారు, రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లు చుట్ట తిరిగారు. బస్సు యాత్రలు చేశారు.

రాహుల్ గాంధీని అశోక్ నగర్కు తీసుకువచ్చి ప్రామిస్లు చేయించారు. మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగులకు రాలేదు.ఎందుకు మీ గొంతులు మూగబోయాయి?రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఏడు నెలలు పూర్తయింది ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు.రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు కనపడడం లేదా వినపడడం లేదా? నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోరాటాలు చేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు.

రేవంత్ రెడ్డికి చెప్పాలని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేస్తూ నిరసన తెలియజేస్తే పట్టించుకోరు. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాహుల్ గాంధీ గారు చొరవ చూపాలి రేవంత్ రెడ్డి కి డైరెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.

నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, గ్రామాల్లోకి వెళ్లి ఓట్లు వేయాలని అడిగారు. చిటికెలో చేస్తా అన్నారు. 7 నెలలు గడిచినా చేయడం లేదు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు ఏమయ్యాయి? అసెంబ్లీలో భట్టి విక్రమార్క 1:100 ఎలిజిబిలిటీ గ్రూప్ వన్ మెయిన్స్కి ఇవ్వాలన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. ఉమ్మడి ఏపీలో, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పెంచడం సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదు రేవంత్ రెడ్డి కోదండరామిరెడ్డి సమాధానం చెప్పాలి.ప్రజా పాలనలో నిరుద్యోగులు దరఖాస్తులు ఇస్తూ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు.

నిరుద్యోగులు యువకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇదేనా ప్రజాపాలన. విద్యార్థులు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

1. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా గ్రూప్ వన్ మెయిన్స్ ఎల్జిబిలిటీ 1:50 నుంచి 1:100 పెంచాలి.
ఒక్కో పోస్టుకు మెయిన్స్ కి వంద మంది పోటీ పడే అవకాశం కల్పించాలి.

2. గ్రూప్-2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్-3కి మూడు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలి. పరీక్షకు పరీక్షకు మధ్య 2నెలల గ్యాప్ ఉండేలా చూడాలి.

3. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన హామిని నిలబెట్టుకోవాలి. ఆరునెలలు గడించింది, మరో ఆరు నెలల సమయమే ఉందన్న విషయం గుర్తించి ఆ దిశగా చర్యలు ప్రారంభించాలి.

4. ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను గుర్తించి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామిని నిలబెట్టుకోవాలి.

5. అధికారం లోకి వచ్చాక మొదటి క్యాబినెట్ లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్న హామి నిలబెట్టుకోవాలి. 11వేల పోస్టులు కాదు, 25వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.

6. గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్ లాగ్ కాకుండా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి.

7, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జి.వో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చాక వారికి నట్టేట ముంచి జి.వో 46 ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వం వెంటనే జి.వో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

8, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకు 4000 చొప్పున నిరుద్యోగపు తీస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పడ్డ బకాయి మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెల నెలా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే నిరుద్యోగుల తరఫున మరో పోరాటానికి బిఆర్ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE