-ఉద్యోగినుల సమస్యల పరిష్కారానికి “సభల” ప్రాంతీయ సదస్సులు
– ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు
-లైంగిక వేధింపుల నిరోధానికి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్
– ఏలూరులో నిర్వహించిన “సభల” ప్రాంతీయ సదస్సులో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
ఏలూరు:రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ,స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా “సబల “ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్ పేరుతో తూర్పు, పశ్చిమ గోదావరి ,కృష్ణా జిల్లాల పరిధిలోని ఉద్యోగినులకు ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.ఈ సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లోని మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు .ఇందులో భాగంగా ఈనెల 16న గుంటూరు జిల్లాలో, 23న ఏలూరులో నిర్వ నిర్వహించగా ఈ నెల 30న రాయలసీమ జిల్లాలోను, ఏప్రిల్ 6న ఉత్తరాంధ్ర జిల్లాలోను సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందుకోసం పని ప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధానికి పటిష్ట చర్యలు కోసం ఫిర్యాదులకు అందుబాటులోకి సబల వాట్సాప్ నెంబర్ 6302666 254 ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ వాట్సాప్ నెంబర్ ఆవిష్కరించిన వారం రోజుల్లోనే 200 పైగా పిర్యాదులు అందాయన్నారు .వీటిపై తొలిదశలో శాఖాపరమైన విచారణను నిర్వహిస్తారని అక్కడ న్యాయం జరగని పక్షంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎల్ సిసి కమిటీ లో ఫిర్యాదులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సబల వాట్సాప్ నంబర్ తో తెలిపే పోస్టర్లను ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగం (ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ) ఏర్పాటు చేయాలని అన్నారు.మహిళల భద్రత కోసం రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్ మహిళల రక్షణకు బ్రహ్మాస్త్రంగా నిలుస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా మంచి ఫలితాలు అందుతున్నాయని అన్నారు. మహిళా ఉద్యోగినుల కోసం అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక టాయిలెట్ సౌకర్యం, రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలన్నారు.
ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ మహిళల రక్షణకు కల్పించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) పి.పద్మావతి మాట్లాడుతూ మహిళలు వేధింపులకు గురయ్యే పరిస్థితులను నిర్భయంగా ఫిర్యాదు చేసి తగు రక్షణ పొందాలన్నారు.
సిఐడి అడిషనల్ ఎస్ పి కె.వి. జి.సరిత మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పకుండా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు .పది మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నచోట నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గా మహిళా ఉద్యోగిని, మహిళల సంక్షేమం కోసం పాటు పడే ఒక ఎన్జీవో ,మరో ఇద్దరు సభ్యులు ఈ కమిటీలో ఉండాలన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు( ఉద్యోగుల సంక్షేమం)ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి ,మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవో (మహిళ) చైర్మన్ వి నిర్మలా కుమారి, మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ ,వివిధ సంఘాల నాయకులు ఎం. రాజ్యలక్ష్మి, నిర్మల జ్యోతి తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయకుమారి,ఏపీ ఎన్జీవో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శివారెడ్డి , ఏపీజిఇఎ రాష్ట్ర అధ్యక్షులు కె రామ సూర్యనారాయణ, ఏపీ జేఏసీ అమరావతి చైర్ పర్సన్ బి సుశీల ,రాష్ట్ర కన్వీనర్ మెహరాజ్ సుల్తానా, పశ్చిమ గోదావరి జిల్లా జెఎసి అధ్యక్షులు ఆర్ఎస్ హరనాథ్, ఎన్జీవో సంఘం కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, పలువురు మహిళ ఎన్జీఓ జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.