Suryaa.co.in

Andhra Pradesh

మేము సైతం…వరద బాధితులకు సాయం కోసం

– సీఎం చంద్రబాబును కలిసి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన పలువురు దాతలు
– వరద బాధితుల కోసం తోచిన సాయంతో ముందుకు రావాలన్న సీఎం పిలుపునకు భారీ స్పందన

అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు.

వరద బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. దాతలకు సీఎం అభినందనలు తెలిపారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తిరిగి సాధారణ స్థితికి చేర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్న వారికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

జీఎంఆర్, ఏఐజీ హాస్పిటల్స్ విరాళాలు

సీఎంను కలిసి విరాళాలు అందించిన వారిలో…విశాఖపట్నానికి చెందిన జీఎమ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చల్లా ప్రసన్న, సీఈఓ మనోమేరాయ్ రూ.2.5 కోట్లు, AIG హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి రూ.1 కోటి(ఆన్ లైన్ ట్రాన్సాక్షన్), వెల్ జాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత వెలమాటి జనార్థన్ రావు రూ.1 కోటి చెక్కులను సీఎంకు అందించారు.

మెప్మా తరపున ఐఏఎస్ తేజ్ భరత్ రూ.1 కోటి, ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ రూ.50 లక్షలు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్ ప్రవాస తెలుగువారు రూ.17 లక్షల 50 వేలు, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వవిద్యార్థి డాక్టర్ అమ్మన్న రూ.15 లక్షలు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షలు, ఎన్ఆర్ఐలు సురేష్ మానుకొండ, ఉప్పు వినోద్ బాబు, వరదా అమర్ రూ.10 లక్షలు అందించారు.

ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నుండి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్ కుమార్ రూ.6 లక్షలు, బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ యాజమాన్యం సూర్యదేవరబాబు-వెంకట రమా ప్రసాద్ రూ.5 లక్షలు, వల్లూరి రవీంద్రనాథ్, తేజ్, రూ.5 లక్షలు, మండపేట నియోజవకర్గం నుండి రైస్ మిల్లర్స్ తరపున రూ.5 లక్షలు, ఛాంబరాఫ్ కామర్స్ తరపున రూ.1.5 లక్షలు, రోటరీ క్లబ్ తరపున రూ.75 వేలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అందించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రూ.5 లక్షలు, బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ సంస్థ రూ.5 లక్షలు, ది అలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున రూ.5 లక్షలు సీఎంకు అందజేశారు.

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రూ.4 లక్షలు, టి.సతీష్ రూ.3 లక్షలు, పాలడుగు పార్వతిదేవి రూ.3 లక్షలు, ప్రసాద్ నాయుడు రూ.2 లక్షల 116, గాంధీ-వసుమతి రూ.2 లక్షల 16లు, కొత్తపల్లి గాంధీ రూ.1 లక్ష, కెవిఎస్వీ ప్రసాద్ రూ.1 లక్ష, యలమంచిలి విమలాబాయ్ రూ.1 లక్ష, తోటకూర రాజారత్నం బాబు రూ.1 లక్ష, టి.కిషోర్ కుమార్ రూ.1,11,116లు అందించారు. గారపాటి శ్రీలక్ష్మీ రూ.1 లక్ష, పులి వెంకటేశ్వర్లు రూ.1 లక్ష, కె. ప్రభాకర్ రావు రూ.75 వేలు, కరణం పద్మజ బంగారపు ఉంగరం, దివ్యాంగుడు వి.బాబూరావు కెఆర్ జడ్పీహైస్కూల్ ఓల్డ్ స్కూడెంట్ రూ.50 వేలు, కరుసల శైలజా రూ.50 వేలు, ఏ.బాలాజీ ప్రసాద్ రూ.50 వేలు, జీఎన్.బీ.వీ.ప్రసాద్ రావు రూ.50 వేలు, చలసాని సుబ్బారావు రూ.40 వేలు, చలసాని భార్గవి రూ.32 వేలు, జి.సాంబశివరావు రూ.10 వేలు, ఆర్.రాధాకృష్ణ రూ.10 వేలు అందించారు.

LEAVE A RESPONSE