– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఫారిన్ కంట్రి బ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) రెన్యువల్ ను సాధించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నాలుగో రోజు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణితో కలిసి మంత్రి సవిత మంగళవారం మాట్లాడారు.
రాయలసీమ అభివృద్ధిలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి సవిత తెలిపారు. వందేళ్ల నుంచి రాయలసీమ సహా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్డీటీ సంస్థ ఎంతో కృషి చేస్తోందన్నారు. ఆ సంస్థ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) రెన్యువల్ పునరుద్ధరణకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు.
ఇదే విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులను కలిశామన్నారు. ఆర్డీటీ ఫారిన్ కంట్రి బ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) రెన్యువల్ ను పునరుద్ధరించాలని కోరామన్నారు. అసెంబ్లీ సమావేశంలో సందర్భంగా మంగళవారం కూడా మంత్రి లోకేశ్ ను కలిశామనన్నారు. ప్రధాని నరేంద్రమోడితో మాట్లాడి ఆర్టీడీ ఫారిన్ కంట్రి బ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) రెన్యూవల్ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు.
ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సానా సతీశ్ కు అప్పగించినట్లు లోకేశ్ తెలిపారన్నారు. ఎట్టి పరిస్థితులోనైనా ఆర్టీసీ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ సాధించి తీరుతామని స్పష్టంచేశారు. ఆరు నెలల నుంచి ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరణకు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేస్తున్నారన్నారు. ఆర్డీటీపై వైసీపీ హడావుడి సృష్టి చేస్తోందని మంత్రి సవిత విమర్శించారు.
లోకేశ్ తో ఉమ్మడి అనంతపురం ఎమ్మెల్యేల భేటీ
అంతకుముందు మంత్రి నారా లోకేశ్ ను అసెంబ్లీ హాల్ లో మంత్రి సవిత ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి భేటీ అయ్యారు. ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ను కోరారు. దీనిపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. రాయలసీమ అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కీలకమని, ఆ సంస్థ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరణ గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు