– ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ: నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పడు, ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వారికి అండగా ఉండి వారి ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, క్రీయాశీలక సభ్యుడు తుమ్మల సత్య క్యాన్సర్ కు గురై ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం శాసనసభ్యులు గద్దె రామమోహన్ సొంత నిధుల నుంచి లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని మంగళవారం ఉదయం మొగల్రాజపురంలోని తుమ్మల సత్య ఇంటికి వెళ్ళి అందజేశారు.