-పులివెందుల రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే ముఖ్యమంత్రిని నిలదీస్తాం
-పోలీసులచే బలప్రయోగం చేయించినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం
-ఎందుకు మాకు అన్యాయం చేశారని ముఖ్యమంత్రిని ప్రతిఘటిస్తాం
-అర్హులైనవారందరికి ఇన్సూరెన్స్ రావాలనే డిమాండ్ తో ముఖ్యమంత్రిని నిలదీస్తాం
-టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి)
పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టంగా ఉంది. ఈ క్రాపింగ్ అయి ఈకేవైసీ అయిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అర్హులుగా ఉండి పంటల బీమా అందనివారిని కూడగడతాం. 7, 8 తేదీలలో పులివెందుకలు రానున్న సీఎం.. ఎందుకు మాకు అన్యాయం చేశావని ముఖ్యమంత్రిని నిలదీస్తాం. ఇక్కడి రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. పోలీసులచే బలప్రయోగం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అర్హులైనవారందరికి ఇన్సూరెన్స్ రావాలనే డిమాండ్ తో ముఖ్యమంత్రిని నిలదీస్తాం.
పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టంగా ఉంది. అర్హులైన రైతులను పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలకు అక్రమంగా పంటల బీమాను దోచిపెడుతున్నారు. ఇన్సూరెన్స్ రానివిధంగా, కేవలం వైసీపీ మద్దతుదారులు లబ్ది పొందేటట్లుగా ఇన్సూరెన్స్ విధానం ఉంది. గతంలో ప్రధానమంత్రి ఫసల్ ఆవాస్ యోజన పథకం ఉండేది. దాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి రైతులకు ఇన్సూరెన్స్ నేనే కడతాను, ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంటు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని జనాన్ని మోసం చేశారు. రైతుల ఆశాలను నీరుగార్చారు. తన తండ్రి పేరుతో వైఎస్ ఆర్ పంటల బీమాను తెచ్చి పాత విధానానికి స్వస్తి పలికి జగనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడు.. దానికి అర్హత, ఆథరైజేషన్ లేదు, వ్యాలిడిటీ అసలే లేదు.
దానికి వ్యాలిడిటీ వచ్చేంతవరకు వ్యవసాయ అధికారులే పర్యవేక్షిస్తారని జీవోలో ఇచ్చారు. స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఫార్మర్ ముగ్గురు కలిసి ఒక ప్రీమియం అమౌంటు కట్టి దానికి జవాబుదారీతనం ఉండాలి. జగన్ సృష్టించిన ఇన్సూరెన్స్ కంపెనీ అసలే లేదు. జగన్ ఎవరికి ప్రీమియం అమౌంటు కడుతున్నాడో తెలియదు. జగన్ రైతులకు పంటల బీమా ప్రీమియం ఎంత కట్టారో వివరంగా ప్రజలకు తెలపాలి. పంటల బీమా పథకానికి 3వేల కోట్లు వేశానని ఆర్భాటంగా బటన్ నొక్కారు. పంటల బీమా పథకంతో రైతులు నష్టపోయారు. పార్టీ నాయకులు, మద్దతుదారులు లాభపడుతున్నారు.
లేని ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి రైతులను దగా చేస్తున్నారు. అధికంగా పంటలు వేసిన ప్రాంతానికి పంటల బీమా చెల్లించకపోవడం దారుణం. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన పంటలకు తక్కువ బీమా ఇవ్వడం మరీ అన్యాయం. ప్రజాధనాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని తన మద్దతుదారులకు పంటల బీమా రూపంలో దోచిపెడుతున్నారు. గతంలో ఉన్న ధరల స్థిరీకరణ పథకానికి రెక్కలొచ్చాయి. జగన్ రైతుల పక్షపాతి కాదు.. రైతుల కక్షపాతి. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ గురించి జగన్ కు అవగాహన లేదు. పులివెందుల తాలూకాలో వ్యయ ప్రజయాసలకోర్చి జగన్ ను గెలిపిస్తే అక్కడి ప్రజలనే మోసం చేశారు.
ఆ తాలూకాలో ఉన్న చీనీ రైతులందరికి లక్ష రూపాయల సస్పెన్షన్ అకౌంట్ పెట్టి ఇంతవరకు ఇవ్వలేదు. అమ్మఒడి పథకానికి లేనిపోని నిబంధనలు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నారు. అమ్మఒడి లిస్టుల్లో నుంచి పేర్లు తొలగించి అన్యాయం చేశారు. పూరి గుడిశె ఉండి, ఆ గుడిశెలోని వ్యక్తి రోజు ఒక క్వాటర్ బాటిల్ మద్యం తాగితేనే అమ్మ ఒడి వర్తిస్తుందనే నిబంధన పెట్టినా ఆశ్చర్యపోనవసరంలేదు. అమ్మఒడి లిస్టులో నుంచి పేర్లు తొలగించి అన్యాయం చేశారు. పూరి గుడిశె ఉండాలి, ఆ గుడిశెలోని వ్యక్తి రోజు ఒక క్వాటర్ బాటిల్ మద్యం తాగాలనే నిబంధన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇచ్చే 14 వేలకు సంవత్సరానికి 54 వేలు మీకే బాకీ పడతారు. అమ్మఒడి, దుల్హన్ పథకంలో అబద్ధాలు చెబుతున్నారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకొని లబ్ది పొందుతున్నారు. రైతులపైన కక్షకట్టడం మానాలి. జూలై 7,8 వ తేదీల్లో సీఎం పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ అర్హత ఉండి రాని రైతులను సమీకరించి సీఎం ను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం ప్రాతినిథ్యం వహించే పులివెందులలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరగడం బాధాకరం. ఒక పంటకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. మిగతా రెండు పంటలకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. డ్రిప్ ఇరిగేషన్ అదో ఇస్తాం, ఇదో ఇస్తామని మూడు సంవత్సరాలు దాటవేశారు. ఈ క్రాపింగ్ చేసి వారికి పరిహారం పోయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్కువ మందికి పరిహారం రాలేదు.
మళ్ళీ ఈ క్రాపింగ్ చేసి మళ్లీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్లీసనరీ సమావేశంలో చెప్పారు. కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. మభ్య పెట్టారు. ఇటీవల వ్యవసాయ శాఖ జేడీని సంప్రదించాము. ఈ క్రాపింగ్ అయి ఈకేవైసీ అయిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందిగానీ రానివారికి ఏమీ చేయలేమని అన్నారు. అలాంటివారిని కూడగట్టుకొని , 7, 8 తేదీలలో ఎందుకు మాకు అన్యాయం చేశావని ముఖ్యమంత్రిని నిలదీస్తాం. ఇక్కడి రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. పోలీసులచే బలప్రయోగం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.