– టిడిపి పాలిట్బ్యూరో సభ్యులు కె.యి.కృష్ణమూర్తి వెల్లడి
రాష్ట్ర మాజి ముఖ్యమంత్రిగా వై.యస్. జగన్మోహన్రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో బటన్ నొక్కి మెక్కేసిన ప్రజల సోమ్మును కక్కిస్తామనీ తెలుగుదేశంపార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.యి. కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ రోజు వారు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావుయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, మరియు పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించరు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని దోచేసిన ప్రజాదనాన్ని తిరిగి రప్పించి, పేదలకు, బీదలకు సద్వినియోగపర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంకణబద్దులై ఆదిశగా ముందుకు వెల్తున్నారనీ తెలిపారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేలాది ఎకరాల ప్రజల భూములను తన బినామీల పేర్లతో ఆక్రమించుకొన్నటువంటి భూముల చరిత్ర చూస్తే ఈ రాష్ట్రాన్ని ఎంతగా దోచుకున్నారో అర్థమౌతుందనీ, తన బండారం భయటపడుతుందనీ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ను తన అనుచరులతో తగులబెట్టించడమేకాక లెక్కకు మించినన్ని ఫైల్లు తన పి.ఎ. ద్వారా హైదరాబాద్కు తరళించారనీ, ట్రంకుపెట్టెలలో వాటిని దాచారనీ ఇది పోలీసులు సోదాలలో బయటపడిందనీ తెలియజేశారు.
చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే వర్షాలు రావన్న జగన్కు ఇటీవల వర్షాలు కనువిప్పు కలిగించాయి, రాష్ట్ర ప్రజలేకాక ఆ వరుణదేవుడు కూడా చంద్రబాబుని కరుణించి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, వాగులు, వంకలు పొంగిపోర్లడమేకాక నదులన్ని నిండుకుండలను తలపిస్తున్నాయనీ తెలిపారు.
కర్నూలు జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి పత్తికొండ నియోజకవర్గంలోని చెరువులను నింపుకునేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుండి నీటిని వాడుకునేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి రైతాంగానికి మేలుచేకూర్చేందుకు కృషిచేస్తామనీ తెలియజేశారు.
ఇప్పటికే సూపర్ సిక్స్ పధకాలను అమలు చేస్తున్న చంద్రబాబునాయుడు సామాజిక పెన్షన్లను పెంచారు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దుచేసేందుకు సంభందించిన అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, డి.యస్.సి. ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇలా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైతున్న చంద్రబాబు , తాను ప్రతినిత్యం ప్రజలకోసం పాటుపడతారనీ తెలియజేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేంద్రకుమార్, సోమిశెట్టి నవీన్, యస్.కె. బషీర్, ఆకెపోగు వెంకటస్వామి, సత్రం రామక్రిష్ణుడు, జేమ్స్, మొదలగు వారు పాల్గొన్నారు.