ఏవైనా లోపాలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సరిచేస్తాం

Spread the love

-నియోజకవర్గ పరిశీలకుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ఒకప్పుడు నియోజకవర్గ పరిశీలకులంటే సుప్రీంలు. గతంలో మొత్తం రాజకీయమంతా వారి చుట్టూ తిరిగేది.కరోనా రావడం, పరిశీలకులు ప్రజల్లోకి వెళ్లలేకపోవడం వంటి అనేక కారణాలతో సరిగా ఫోకస్ కాలేకపోయారు. ఇప్పుడు మనం ఏర్పరుచుకున్నఈ సమావేశం మన కుటుంబ సమావేశం.నిర్మొహమాటాలు లేకుండా అందరం కలివిడిగా కలిసి మాట్లాడుకుందాం. ఏవైనా లోపాలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సరిచేస్తాం.మా వల్ల కాకుంటే అధ్యక్షులవారి దృష్టికి తీసుకెళ్లి, సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇస్తున్నా.

ఈరోజు మీరు చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రం అన్నివిధాలా అధోగతి పాలైంది. ప్రజలు తీవ్రమైన నిరాశానిస్పృహలతో ఉన్నారు.మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి సమానంగా అందించాము. అన్నివర్గాలవారికి న్యాయం చేశాము. ముఖ్యంగా చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదుకున్నాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిధులిచ్చి సహాయపడ్డాము.

అంతచేసిన ఓడిపోవడంతో తీవ్రమైన నిరాశానిస్పృహల్లో కూరుకుపోయాం.తెలుగుదేశంపార్టీ పుట్టి 40ఏళ్లు అయింది. 40ఏళ్లు అధికారంలో లేము. ప్రతిపక్షంలోఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజలపక్షానే నిలుస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలుచేస్తాం. అధికారం కోల్పోతే, ప్రతిపక్షస్థానంలో ఉండి ప్రజలకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిపరిష్కారానికి కృషిచేస్తాం. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయపార్టీ విధానమైనా ఇలానే ఉంటుంది.

నిన్ననే మనపార్టీ యువనాయకుడు ఒక మాటన్నారు. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డే అని. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.నాలుగేళ్ల తనపాలనలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలమనసు చూరగొని బలపడవచ్చు. కానీ తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకొని, ఆ పార్టీనేతలు, కార్యకర్తలపై తప్పుడుకేసులు పెట్టి, రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీనే ఉండకూడదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో గానీ, ఎన్ని సంక్షోభాలు వచ్చినా, సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి తెలుగుదేశం బలపడింది తప్ప, ఎప్పుడూ బలహీనపడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం ఉండకూడదు…నాయకుల్ని ఇబ్బందిపెట్టాలి.. ఆపార్టీని అందరూ వదిలేసి తనపార్టీలోకి రావాలని చేయాల్సిన దారుణాలన్నీ చేస్తున్నాడు.అయినాకూడా అధ్యక్షులవారి తెగింపు, ఆయన నిరంతరం చూపే పోరాటపటిమ, ఆయన మనకిచ్చిన మనోధైర్యం ఈనాడు పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది.

Leave a Reply