Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం

  • గంజాయి వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్నగత వైసీపీ ప్రభుత్వం
  • గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం లో అవినీతి తప్ప అభివృద్ధి లేదు
  • వైసిపి పార్టీ ఉనికి కోసమే శవ రాజకీయాలు చేస్తోంది
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అన్ని పాఠశాల, కాలేజీలలో చదువుతున్నవిద్యార్ధినీ విద్యార్ధులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ ,విద్యార్థులతో మాదకద్రవ్యాలు వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని…, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని , వాటిని వినియోగించే వారిని గుర్తించి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తెలియజేసారు .

అనంతరం విద్యార్థులుతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ,వాడమని ప్రతిజ్ఞ చేపించారు . గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ,ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే వైసీపీ పార్టీ శవరాజకీయలు చేస్తోందని  ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE