– ఎమ్మెల్యే సత్యానందరావు
కష్ట కాలంలో పార్టీ అండగా ఉండి కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఆత్రేయపురంలో గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన మండల స్థాయి నేత సమావేశంలో సత్యానందరావు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసి, పార్టీని బలోపేతం చేసి నా విజయానికి కారణమైన కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.
జనసేన, బీజేపీలతో పొత్తులో ఉన్న భాగంగా వారితో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని వాటిని విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, మద్దూరి సుబ్బారావు, తోటకూర సుబ్బారాజు, అయినం నాగరాజు, చిటికెన సత్యనారాయణ, కరుటూరి వరప్రసాద్, పాలంగి రవిచంద్ర, జనా ఆంజనేయులు, మెర్ల శ్రీ రామ చంద్రమూర్తి, జుజ్జవరపు హరిబాబు, దుగ్గిరాల సుబ్బలక్ష్మి, జల్లి కామేశ్వరరావు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.