Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజల ఆలోచనలు అమలు చేస్తాం

-ఏపీ ఆలోచనలు కాదు
-12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష మేమే నిర్వహించాం
-ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదు
-గుర్రాలతో ఆశా వర్కర్స్ ను తొక్కించారు
-త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం
-పెద్దపల్లి ఘటనపై విచారణ
– హరీష్ రావు, కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ : మేము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం..మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నాం. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే అంటే.. హరీష్ రావు పరిస్థితి అర్థం అవుతుంది.తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం. ఏపీ ఆలోచనలు కాదు.

12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష మేమే నిర్వహించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మూడు నెలలు పరిపాలన చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాం. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదు.. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశా వర్కర్స్ ను తొక్కించారు.

పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతుంది. ఘటన జరగడం దురదృష్టకరం.శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మత ఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నాం. వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదంతో అణిచి వేస్తాం.

LEAVE A RESPONSE