Suryaa.co.in

Andhra Pradesh

గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రిని 300 పడకలకు పెంచుతాం…

* రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స  
* రాష్ట్రంలోని ఆస్పత్రులకు పూర్వ వైభవం తీసుకొస్తా…
* గత ఐదేళ్ళలో వైసీపీ నిర్వీర్యం చేసింది
* వైఎస్సార్‌ బీమా పేరుతో సొంత ఇన్సూరెన్స్ కంపెనీతో అవినీతి
* కేంద్రం నిధులన్నీ గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది…
* విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం…
* వచ్చే ఐదేళ్ళ సభ్యత్వం సంఖ్య 25 లక్షలకు పెంచుతాం…
* రాష్ట్ర కార్మిక, కర్మగారాలు, బాయిలర్స్‌ అండ్‌ ఐఎంఎస్‌ శాఖ మంత్రి  వాసంశెట్టి సుభాష్‌

విజయవాడ: గుణదల ఇఎస్‌ఐ ఆసుపత్రిని 300 పడకుల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్దం చేశామని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్స్‌ అండ్‌ ఐఎమ్‌ఎస్‌ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గుణదలలోని ఇఎస్‌ఐ ఆసుపత్రి నూతన ప్రాంగణాన్ని సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1968లో ప్రారంభించి, లక్షలాది కార్మిక కుటుంబాలకు వైద్య సేవలందిస్తూ ప్రస్తుతం 110 పడకలున్న ఈ ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని ఇఎస్‌ఐ ఆసుపత్రిలన్నింటిని దశలవారీగా అభివృద్ధి చేయనున్నామన్నారు.  కార్మిక కుటుంబాలకు సత్వర వైద్య సేవలందే విధంగా ఇఎస్‌ఐ ఆస్పత్రిల్లోని అన్ని రోగాలకు  వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

గత 5 ఏళ్ళగా ఇఎస్‌ఐ ఆస్పత్రులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సరైన పరికరాలు లేకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయికుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ బీమా పేరుతో సొంత ఇన్యూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడిరదని వీటిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామని మంత్రి చెప్పారు. కేంద్రం నుండి వచ్చిన నిధులన్నింటి గత ప్రభుత్వం పక్కదారి పట్టించి, కార్మిక శాఖను భ్రష్టు పట్టించిందని మంత్రి విమర్శించారు. 10 మంది కార్మికులున్న ప్రతి సంస్థను ఇఎస్‌ఐ పరిధిలోకి తెస్తామని ఇఎస్‌ఐ సభ్యత్వాలను పెంచుతామని వచ్చే ఐదేళ్ళలో 25 లక్షల సభ్యత్వం పెంచే  లక్ష్యంలో పనిచేస్తున్నామని మంత్రి వాసం శెట్టి సుభాష్‌ తెలిపారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మెహన్‌రావు మాట్లాడుతూ వ్యవసాయం తరువాత ప్రాధాన్యతగల కార్మిక రంగాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాయన్నారు. గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రిని కార్మిక కుటుంబానికి ఆరోగ్య భరోసా అందించే విధంగా తీర్చిదిద్దుతామని  రామ్మెహన్‌రావు అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక, కర్మగారాలు, బాయిలర్స్‌ అండ్‌ ఐఎమ్‌ఎస్‌ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్‌, ఎంఎల్‌సి పి. ఆశోక్‌ బాబు, కార్మిక రాజ్య బీమా వైద్య సేవల డైరెక్టర్‌ వి.ఆంజనేయులు, ఇఎస్‌ఐసి ప్రాంతీయ సంచాలకుడు ఎ. వేణుగోపాల్‌,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE