– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ: నల్గొండ గడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డ… కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలం.. మీరే నా లీడర్లు..మీరే నా క్యాడర్..మీరే నా బలం, బలగమని నల్గొండ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే… ఏ సమయంలోనైనా తోడుగా నా వెన్నంటే ఉంటూ 30 ఏళ్లుగా నన్ను అక్కున చేరుకున్నారు..ఏమిచ్చినా మీ రుణం తీర్చలేనిది.
అభివృద్ధిలో నల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతా… ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత మీదే.. గ్రామీణ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారుస్తా.. విద్యా, వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తా… రోడ్లు, కాలువలు, కాలేజీలు, హాస్పిటల్స్, ప్రాజెక్టులు ఏది చూసినా నల్లగొండ మోడల్ అనేలా చేస్తానని మాటిస్తున్నా… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 100శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి.
బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయింది.. అది మునిగిపోయే నావా..నేను ఎప్పుడో చెప్పాను.. ఈ జిల్లాలో ఓ లిల్లీపుట్ ఉన్నాడు..ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే..ఇక మళ్ళీ గెలవడు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ది సాధ్యం.