– నాంపల్లి కోర్టు వద్ద జగన్ వీరాభిమానుల వీరంగం
– రోడ్లపై జగన్ ఫెక్లీతో అభిమానుల ఊరేగింపు
– రోడ్లపై రఫా రఫా అంటూ భారీ ఫ్లెక్సీలు
వాడెవడు వీడెవడు జగనన్నకి అడ్డు ఎవడు? చంపేస్తాం, నరికేస్తాం అంటూ రెచ్చగొడుతూ స్లొగన్స్ ఇస్తున్న ‘రప్పా రప్పా’ అల్లరి మూకలు! 2029 లో తెలంగాణలో కూడా నరికేస్తాం అన్నట్లుగా.. హైదరాబాద్లో ‘రప్పా రప్పా’ పోస్టర్లను ప్రదర్శించిన అల్లరి మూకలు! ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుల్లో దోషి తాను నేరస్తుడిని కాదని నిరూపించుకోవాలి. అవినీతి సొమ్ములతో అక్రమాస్తులను దాయలేక, దశాబ్దం అయినా ఎలా నిరూపించుకోవాలో దిక్కు తెలియని జగన్ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చాడు.
ఇన్ని వాయిదాలు దేశంలో ఒక రికార్డు. కోర్టు ముందు కేసులు తేల్చుకోవాలి. వీళ్ళు మాత్రం ‘రప్పా రప్పా’ షోలతో తేల్చుకుంటున్నారు. జగనన్నకు జై కొడితే కేసులు పోతాయా? లేక కోర్టు వారు కూడా ‘రప్పా రప్పా’ మూకకు భయపడాలా?హైదరాబాద్ రోడ్లపై వీళ్ళు చేసిన అల్లరి చూసి, ట్రాఫిక్ పోలీస్ కూడా ‘సైకోగాళ్లు’ అని తిట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ.. ‘వాడెవడు వీడెవడు, జగనన్నకు అడ్డు ఎవడు?’ అని వీరు కేకలు వేస్తున్న తీరు చూస్తే, వీరు కేవలం అభిమానులు మాత్రమే కాదు, వారి నాయకుడికి ఎలాంటి అడ్డంకులైనా తొలిగించేందుకు సిద్ధంగా ఉన్న సైకోల లెక్కన కనిపిస్తున్నారు.
తెలంగాణ రాజధాని నడిబొడ్డున ఈ తరహా ప్రదర్శన, తమ ఉనికిని గట్టిగా చాటుకోవాలనే వారి ఉన్మాద ప్రకోపాన్ని ప్రతిబింబిస్తోంది! “కోర్టులో కాదు, రోడ్డుపై పవర్ ఏంటో చూపిస్తాం!” అని దేశంలోని న్యాయవ్యవస్థకు, తెలంగాణ రాజధాని పోలీసులకు గట్టి సందేశం ఇస్తున్నట్టుగా ఉంది. చేతుల్లో పట్టుకున్న పోస్టర్లు కూడా మరీ హైలై ట్! వీరు ఏపీలో కాదు, తెలంగాణలో ఉన్నారు. పోస్టర్లలో ఉన్న 420కి, అక్కడ ఈ ప్రదర్శన వల్ల అక్కడి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్న విషయం వీరికి ఇంకా ఎక్కలేదనుకుంటా. బహుశా 2029లో తెలంగాణను కూడా ‘నరికేస్తాం’ (అంటే… అధికారంలోకి వస్తాం!) అనే సింబాలిక్ మెసేజ్ ఇస్తున్నారేమో! పులివెందుల మండలంలో డిపాజిట్ కోల్పోయిన తరువాత ఉన్మాదం మరీ తారాస్థాయికి వెళుతోంది. హైదరాబాద్ డంపుల్లో పోగేసిన ఐదేళ్ల బూం బూం లిక్కర్ స్కాము డబ్బులను ఖర్చు చేసి తెల్ల చొక్కాలు, కాస్ట్యూంస్ కొనిచ్చి, పెయిడ్ ఆర్టిస్తులతో ఇలా అక్కడి వీధుల్లో “వాడెవడు వీడెవడు” అని బలుపు చూపించడం చూసి.. 11 ఇచ్చినా మీ జగన్ రెడ్డికి అడ్డెవడు అంటున్నారా.. రండి ఈ సారి అని జనం ఈసడించుకుంటున్నారు. – చాకిరేవు


