-మైనార్టీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు
-మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
-మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు.
-జగన్ పాలనలో మైనార్టీల పై దాడులు
-పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం వద్ద ముస్లీం ప్రతినిధులతో -నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్
జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు.
వైసిపి నేతలు వక్ఫ్ ఆస్తులు కబ్జా చేస్తున్నారు. కాపాడుకోవడానికి వక్ఫ్ బోర్డు కి జ్యుడిషియల్ పవర్ కల్పించాలి.
ముస్లిం లు అన్ని విధాలా అభివృద్ది చెందేలా రిజర్వేషన్లు కల్పించాలి.
రుణాలు అండదం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేశారు.
దుల్హన్ సవాలక్ష నిభందనలు పెట్టారు.
గల్ఫ్ బాధితులకు వైసిపి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు.
లోకేష్ మాట్లాడుతూ…
బీజేపీ తో పొత్తులో ఉన్నప్పుడు కూడా టిడిపి ప్రభుత్వం లో ఏనాడూ మైనార్టీ సోదరుల పై దాడులు జరగలేదు. మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదు.
మైనార్టీల్లో పేదరికం ఉండకూడదు అనే లక్ష్యంతో టిడిపి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు.
ముస్లింలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేసింది టిడిపి.
మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు కేటాయించింది టిడిపి.
షాది ఖానా లు ఏర్పాటు చేసింది టిడిపి.
ఖబర్ స్తాన్ లు అభివృద్ది చేసి మౌలిక వసతులు కల్పించింది టిడిపి.
ఇమామ్ లు, మౌజామ్లకు గౌరవ వేతనం ఇచ్చింది టిడిపి.
ఉర్దూ యునివర్సిటీ ఏర్పాటు చేసింది టిడిపి.
హజ్ హౌస్ లు నిర్మాణం చేసింది టిడిపి. హజ్ యాత్ర కు ప్రభుత్వం నుండి సహాయం అందించింది టిడిపి.
జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మోసం చేసారు.ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా గారు ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదు.
జగన్ రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేశారు.
మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
ఖబర్ స్తాన్ ల అభివృద్ది కి, మౌలిక వసతుల కల్పన కు నిధులు కేటాయించడం లేదు.
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు.
జగన్ పాలనలో మైనార్టీల పై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
అబ్దుల్ సలాం ని వేధించి కుటుంబం తో కలిసి ఆత్మహత్య చేసుకునే లా చేశారు.
మసీదు ఆస్తులు కాపాడుకోవడానికి పోరాడిన ఇబ్రహీం ని నడి రోడ్డు మీద చంపేశారు.
హజీరా అనే ముస్లిం యువతిని అత్యాచారం చేసి చంపేశారు. ఏళ్ళు గడుస్తున్నా ఆమె కుటుంబానికి న్యాయం జరగలేదు.
పలమనేరు కి చెందిన మిస్బా అనే అమ్మాయి స్కూల్ ఫస్ట్ వస్తుంది వైసిపి నేత వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
డాక్టర్ అవ్వాలని కోరుకున్న మిస్బా ని వైసిపి నేతలు అన్యాయంగా చంపేశారు.
ఇన్ని ఘటనలు జరిగితే మైనార్టీ కమిషన్ చైర్మన్ ఈక్బాల్ అహ్మద్ ఖాన్ ఏమి చేశారు? ఒక్క ఘటన పైన కూడా స్పందించలేదు.
దూదేకుల కులానికి చెందిన వారికి బీసీ సిర్టిఫికట్ ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది.
వక్ఫ్ బోర్డు ని బలోపేతం చేస్తాం. వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం.
ముస్లిం రిజర్వేషన్లు కోసం వైసిపి పోరాడటం లేదు. ప్రతిపక్షం లో ఉన్నా ముస్లీం రిజర్వేషన్లు కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతుంది టిడిపి.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే దూదేకుల కులం వారికి బీసీ సర్టిఫికేట్ అందేలా చేస్తాం.
ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ముస్లిం లకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తాం. ముస్లిం లను పారిశ్రామికవేత్తలు గా తీర్చిదిద్దుతాం.
పీలేరు లో ముస్లింలకి ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం షాపులు కేటాయిస్తామని.
ఈద్గా అభివృద్ది చేస్తాం. ఖబర్ స్తాన్ వద్ద మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తాం.
పీలేరు నుండి ఎంతో మంది గల్ఫ్ వెళ్లి ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్ బాధితులకు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సహాయం అందిస్తుంది. అక్కడ ఏ సమస్య వచ్చినా ఆదుకునేలా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం.
పీలేరు లో ఉన్న ఏపిఐఐసి భూముల్లో పరిశ్రమలు తీసుకొచ్చి మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.