– బీసీ రిజర్వేషన్లు అమలుచేయకపోతే జరిగేది అదే
– రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కేసుల గురించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు
– బీసీలకు 42శాతం రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు లీగల్ ఒపీనియన్ తీసుకోలేదు?
– కులగణన రిపోర్టును తీసుకువెళ్లి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇచ్చారు
– రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక రేవంత్ రెడ్డి నియంతృత్వం నడుస్తోందా?
– బిఆర్ఎస్ ఎమ్మెల్సీ. దాసోజు శ్రవణ్ హెచ్చరిక
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు అమలుకాకపోతే ప్రభుత్వానికి శిరోముండనం చేస్తాము. జీఓ 33 ద్వారా నీట్ లో నాన్ లోకల్ వాళ్ళు కేసులు వేసి, తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నారు. జీఓ 33 ద్వారా తెలంగాణ విద్యార్థులు తమ మెడికల్ సీట్లను కోల్పోతున్నారు. ఫ్యూడల్ మనస్తత్వంతో బీసీలను ప్రభుత్వం మోసంచేస్తోంది
ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం,సామాజిక న్యాయం అంటున్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రాగానే రాజ్యాంగ.,సామాజిక న్యాయాన్ని మర్చిపోతున్నారు కాంగ్రెస్ ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ధర్నాలో రాహూల్ గాంధీ పాల్గొనలేదు. దీక్ష పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను
దగా చేస్తున్నారు. నాలుగు నెలలపాటు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్షం ఎంపీల మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఎందుకు పెట్టలేదు? బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారు. అఖిలపక్షం ని రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదు? రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కేసుల గురించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు లీగల్ ఒపీనియన్ తీసుకోలేదు?
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను నమ్మి బీసీలు ఓట్లువేశారు. బీసీ బిల్లులు రేవంత్ రెడ్డి జాగీరు కాదు. రేవంత్ రెడ్డికి ఏజీ లీగల్ గా ఎలాంటి సలహాలు ఇస్తున్నారో అర్థం కావడంలేదు. కులగణన రిపోర్టును రేవంత్ రెడ్డి ఎందుకు బయటపెట్టడంలేదు?
కులగణన రిపోర్టును తీసుకువెళ్లి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక రేవంత్ రెడ్డి నియంతృత్వం నడుస్తోందా? ముస్లిమేతర బీసీలు గత ప్రభుత్వంలో 52 శాతం ఉంటే
నువ్వు 42 శాతానికి తీసుకువచ్చావు. రేవంత్ రెడ్డి.. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు బీసీ బిల్లుల విషయంలో క్యాబినెట్ మంత్రులకు అయినా తెలుసా లేదా అనే అనుమానం కలుగుతోంది.
బీసీలకు విద్య,ఉద్యోగాల్లో కేటగిరీలు లేకుండా 42శాతం అని రాశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి అభిషేక్ మను సింగ్వి సలహాలు తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోతే రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు. మేము ఢిల్లీకి పోతున్నాం. ఎవరు వస్తారో రండి అని ఎవరైనా చెప్తారా? ఢిల్లీకి వెళ్లాలంటే అఖిలపక్షం పెట్టు.