Suryaa.co.in

Andhra Pradesh

వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తాం

మంత్రి జోగి రమేష్‌

తాడేపల్లి: వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. వికేంద్రీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్ముందు ఉద్యమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో సీఎం వైయస్‌ జగన్‌ వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందు చూపుతో వ్యవహరించారని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని, వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తామన్నారు.

రాజధాని రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో హైకోర్టు కొంత పక్కదారి పట్టించిందన్న విషయాన్ని అత్యున్నత న్యాయ స్థానం తీర్పుతో స్పష్టమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వం పని చేస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారని తెలిపారు.

కేబినెట్‌ నిర్ణయానికి సుప్రీం కోర్టు తీర్పు ద్వారా హర్షం వ్యక్తమైనట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఒక ప్రాంత అభివృద్ధికే కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే ఈ రోజు రాష్ట్రానికి కష్టాలు వచ్చాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, అమరావతిని నిర్మించలేక చంద్రబాబు చతికిలపడ్డారు. ఈ రోజు ఒక మంచి ఆలోచనతో అడుగులు పడుతుంటే చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

LEAVE A RESPONSE