Suryaa.co.in

Andhra Pradesh

తప్పుచేసిన అధికారుల్ని కోర్టు బోనులో నిలబెట్టేవరకు వదిలిపెట్టం

– పంచాయతీ ఉపఎన్నికల్లో వైసీపీ అక్రమాలు.. అరాచకాలపై, నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు.. అధికారులపై ఆధారాలతో ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేస్తాం
• అధికారపార్టీ ఎమ్మెల్యేని ఓటర్లమధ్య తిరగనిచ్చి, వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి ప్రలోభాలను సమర్థించిన అధికారుల్ని వదిలేదిలేదు
• స్థానిక సంస్థల ఉపఎన్నికల పోలింగ్ సరళి చూశాక వైసీపీ దుర్మార్గాల్ని ప్రజలు ఖాతరుచేయలేదని స్పష్టమైంది.
• వాలంటీర్లు ప్రలోభపెట్టినా, అధికారపార్టీనేతలు భయపెట్టినా పల్లెఓటర్లు పతనమయ్యే ప్రభుత్వాన్ని ఖాతరు చేయకుండా నిర్భయంగా టీడీపీ అభ్యర్థులకే ఓటేశారు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

స్థానిక సంస్థల ఉపఎన్నికల సరళి చూస్తే గాంధీమహాత్ముడు కలలుగన్నగ్రామ స్వరాజ్యానికి తూట్లుపొడిచేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని, అధికారపార్టీ నేడు పంచాయతీ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అరాచకత్వం, దాడులు, కేసులు, బైండోవర్లపైనే ఆధారపడిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ 98శాతం హామీలు అమలుచేశామని, సంక్షేమపథకాలతో ప్రజల మనసులు చూరగొన్నామని చెప్పుకుంటున్న వైసీపీప్రభుత్వం సాదాసీదా పంచాయతీ ఉపఎన్నిక ల్లో అరాచకాన్ని, పోలీసుల్ని, వాలంటీర్లను నమ్ముకోవడం విడ్డూరంగా ఉంది. నేడు ఉదయం నుంచి జరిగిన పంచాయతీ ఉపఎన్నికల పోలింగ్ సరళి చూస్తే, గెలుపుకోసం వైసీపీ ఎంతగా దిగజారిందో స్పష్టమవుతోంది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనరా దని, ఎన్నికలక్రతువులో వారు ఎక్కడా ఏవిధంగా భాగస్వాములు కారాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది.

అయినా కూడా నేటి ఉపఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర, ప్రమేయం ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేసినట్టు సుస్పష్టమవుతోం ది. పంచాయతీ ఉపఎన్నికల్లో పరిధిదాటి వ్యవహరించిన వాలంటీర్లపై కచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. వాలంటీర్లను కట్టడిచేయకుండా అధికారపార్టీ ఆదేశాలకు తలొగ్గిన కలెక్టర్లు కూడా ఎన్నికలసంఘం ముందు నిలబడి సమాధానం చెప్పేలా చేస్తాం.

అధికారపార్టీ ఎమ్మెల్యేని ఓటర్లమధ్య తిరగనిచ్చి, వైసీపీ ఎమ్మెల్యే కుమారుడిని ఓటర్లను ప్రలోభపెట్టనిచ్చిన అధికారుల్ని వదిలేదిలేదు
కొండెపి టీడీపీ శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామిని ఎన్నిక జరిగే గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకుండా గృహనిర్బంధం చేసిన పోలీసులు, దెందులూరు వైసీపీ ఎమ్మె ల్యే అబ్బయ్యచౌదరిని స్వయంగా తీసుకెళ్లి పోలింగ్ కేంద్రంలో కూర్చోబెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా? అధికారపార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన అతన్ని ఎన్నికలు జరిగే ప్రాంతంలోకి అనుమతిస్తారా? స్వేచ్ఛగా ఓటర్లమధ్య తిరగనిస్తారా?

అధికారమదంతో ప్రభుత్వం ఎంతగా అరాచకాలకు పాల్పడినా, వాలంటీర్లతో ఓటర్లను భయపెట్టే ప్రయత్నంచేసినా ప్రజలు లెక్కచేయలేదు. అనేక ప్రాంతాల్లో ప్రజలు నిర్భ యంగా వాలంటీర్లను ఎదిరించి, వైసీపీప్రభుత్వ దుర్మార్గాలపై తిరగబడ్డారు. పథకాలు ఆపేస్తామని బెదిరించిన వాలంటీర్లను ప్రజలు ఎక్కడా లెక్కచేయకుండా కొన్నినెలల్లో పోయే ప్రభుత్వానికి మేం భయపడమని తెగేసి చెప్పారు.

నియోజకవర్గాల వారీగా వైసీపీ అరాచకాలు… అధికారుల తప్పులు
గోపాలపురం నియోజకవర్గంలోని ఒక వార్డు (12వవార్డ్) ఎన్నికకోసం ఓటుకి రూ.5 వేలు పంపిణీ చేసేస్థాయికి వైసీపీ వెళ్లింది. (డబ్బుపంచుతున్న ఫోటోలను రామానా యుడు విలేకరులకు చూపించారు) హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీలో వైసీపీ ఎంపీపీ పోలింగ్ బూత్ వద్దే ఓటర్లకు డబ్బులు పంచాడు. అక్కడే వాలంటీర్లు ఓటర్లకు స్లిప్పులు అందిస్తూ, డబ్బులు ఇవ్వచూపుతూ, ప్రలోభాలకు గురి చేశారు. (ఆయా ఘటనలకు సంబంధించిన చిత్రాలను కూడా రామానాయుడు విలేకరుల ఎదుట ప్రదర్శించారు)

కొండెపి నియోజకవర్గంలో పంచాయతీఎన్నికల్లో టీడీపీ తరుపు పనిచేసే క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లను బైండోవర్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం వైసీపీ భయానికి నిదర్శనం. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవ ర్గంలో రామకృష్ణ, నాగేంద్ర అనే వాలంటీర్లు వైసీపీఅభ్యర్థికి ఓటేయకుంటే, పథకాలు నిలిపేస్తామని బహిరంగంగానే ఓటర్లను బెదిరించారు. అరకు పార్లమెంట్ పాడేరు, సాలూరు నియోజకవర్గాల్లోని వార్డు ఎన్నికలకోసం వైసీపీ దారుణంగా బరితెగించింది.

రేవళ్ల పంచాయతీలో 5వ వార్డుకి ఎన్నిక జరుగుతుంటే, 6, 7వ వార్డుల ఓటర్లను 5వ వార్డులో చూపించి, 5వ వార్డులోని టీడీపీ ఓటర్లను ఇతరవార్డుల్లో చూపిస్తూ ఓటర్ జాబితా సిద్ధంచేశారు. సాలూరు నియోజకవర్గంలోని పణుకువలస పంచాయతీలోని 7వవార్డుకి ఎన్నిక జరుగుతుంటే, ఆవార్డులోని 72 టీడీపీ ఓట్లను ఇతర వార్డుల్లోకి మార్చారు. 5, 6 వార్డుల్లోని వైసీపీ ఓటర్లను 7వ వార్డులో చూపించి, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. తెనాలి నియోజకవర్గంలోని హాంఫేట 7వ వార్డులో వైసీపీ నేతలు మద్యం పంచుతుంటే, దాన్ని అడ్డుకున్న టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం వనదర్రు పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే కుమారుడు దూలం వినయ్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి, ఓటర్లను ప్రభావితం చేయడంతోపాటు, రిగ్గింగ్ కు పాల్పడేలా అధికారపార్టీ వాళ్లను ప్రోత్సహించా డు. ఎమ్మెల్యే కుమారుడు అంత నిర్భయంగా పోలింగ్ బూత్ లోకి చొరబడినా స్థానిక పోలీసులు అతన్ని అడ్డుకోలేదు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీ స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించాం.

వైసీపీ అక్రమాలు, వాలంటీర్ల వ్యవహారశైలిపై ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేస్తాం…
నేడు జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో జరిగిన ఘటనలపై ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేస్తాం. తప్పు చేస్తున్నవారిని కట్టడిచేయాల్సిన వారు తమకేమీ పట్టనట్టు వ్యవహరించినందుకు భవిష్యత్ లో కోర్టుబోనులో నిలబడక తప్పదని హెచ్చరిస్తున్నాం. ఎన్నికల తంతులో జోక్యంచేసుకున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోని కలెక్టర్లు కూడా ఎన్నకలసంఘానికి జవాబు చెప్పాల్సిందే.

స్థానిక సంస్థల ఉపఎన్నికల పోలింగ్ సరళి చూశాక, గతంలో వైసీపీ గెలిచిన పంచాయతీలు, వార్డుల్ని టీడీపీ గెలవబోతోందని స్పష్టమైంది. వాలంటీర్లు, స్థానిక వైసీపీనేతలపై ప్రజలు తిరగబడి, నిలదీసిన తీరే అందుకు నిదర్శనం. 4, 5నెలల్లో మునిగిపోయే వైసీపీప్రభుత్వానికి గ్రామ ఓటర్లు భయపడలేదు” అని రామానాయుడు స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE