– మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరిక
నెల్లూరు: బీసీ మహిళ మీద అరాచకం జరిగితే మహానటి అంటున్నారు… డబ్బున్న ప్రశాంతమ్మ అరాచకం చేస్తే అమాయకురాలు అంటున్నారు… దాడి జరిగి ఇన్ని రోజులు అయిన తర్వాత ఆదివారం ఎవరి పేర్లు లేకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చిన్న కేసు కట్టారు. వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నా వారి మీద కేసు కట్టలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పలు మార్లు మాట్లాడుతూ దాడికి తామే పాల్పడినట్టు తెలిపే విధంగా అర్తంవచ్చేట్టు స్పష్టంగా మీడియాకు చెప్పారు. జిల్లా రాజకీయాల్లో ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సీనియర్ రాజకీయ నాయకుడి గా వైసీపీ కుటుంబ సభ్యుడిగా ఉన్న ప్రసన్నకు తోడుగా ఉంటే అనిల్ కు ఏమి సంబంధం అనడం ప్రశాంతి రెడ్డి అహంకారానికి నిదర్శనం. కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ బీసీ మహిళను కారు ఆపి రెండు గంటలకు పైగా వేధించి, దాడి చేసి అరాచకం చేస్తే హారికను నటి అంటున్నారు.. కాని ప్రశాంతి రెడ్డి పారిశ్రామిక వేత్త కాబట్టి ఆమె ఏమి చేసినా కరెక్టా? శ్రీకాళహస్తి నియోజక వర్గంలో జనసేన వీర మహిళ ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా చంపేసింది. ఆడవాళ్ళు లో ఒక శాతం నేర పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిపై దాడి ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ప్రసన్న అన్నపై తొందర్లో మట్టి ఎత్తారని, లేదా ఇంకో దొంగ కేసులు పెడతారు.
గతంలో వీపీఆర్ను పొగిడింది నిజమే, అప్పుడు వీపీఆర్ జగన్మోహన్ రెడ్డి ని పొగిడారు కదా.. రాజకీయాల్లో పార్టీలో ఉన్నప్పుడు వారి తప్పులు కప్పి పుచ్చుతూ మాట్లాడతాం.. పోలీసులు సరైన కేసులు కట్టక పోతే అధికారులు బాధ్యత వహిస్తారు. చట్ట ప్రకారం ముందుకు వెళతాం, ఎన్ని రోజులు తర్వాత ఆయన వదిలి పెట్టం.