Suryaa.co.in

Telangana

ప్రభుత్వ బిల్డింగ్ లను కబ్జా చేస్తాం

-కేసీఆర్ ప్రభుత్వం బిసి వ్యతిరేకి
-ప్రతి బిసికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి
-లేదంటే ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వం
-ధరణి వచ్చాక భూములన్నీ కబ్జా
-ఎంపీ, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

కేసీఅర్ ప్రభుత్వం బిసి వ్యతిరేకి.9 ఏళ్ళ కాలంలో ఒక్క లోన్ ఇవ్వలేదు. . ప్రతి బిసికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి.లేదంటే ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వం.పెంచిన ఫీజుల జీవోను వెంటనే విడుదల చేయాలి.. ప్రొఫెషనల్ కోర్సులో బీసీలకు మొత్తం ఫీజు ప్రభుత్వం చెల్లించాలి.

కేంద్ర విద్యాసంస్థల్లో ఐఐటీలో ఐఐఎం లో బీసీ విద్యార్థులకు ఫీజు ప్రభుత్వం చెల్లించాలి.పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీ విద్యార్థులకు ఏ విధంగా పూర్తి ఫీజులు చెల్లిస్తుందో, తెలంగాణలో కూడా అలా చెల్లించాలి.బీసీలంతా ఉద్యమానికి సిద్ధం కావాలి.

బిసి కాలేజి, హాస్టళ్లు అన్ని అద్దె బిల్డింగ్ లే.గురుకులాలు, హాస్టళ్లు వెంటనే నిర్మించాలి. లేదంటే ప్రభుత్వ బిల్డింగ్ లను కబ్జా చేస్తాం.ధరణి వచ్చాక భూములన్నీ కబ్జాకు గురైతున్నాయి. 111 జోవో రద్దు పేరుతో గండిపేట్, హిమాయత్ సాగర్ లను కనుమరుగు చేసే కుట్ర.కెసిఆర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..

LEAVE A RESPONSE