– బనకచర్ల కుట్రను బయట పెట్టిందే బీఆర్ఎస్
– మోదీ, బాబు, రేవంత్‌రెడ్డితో తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు
– రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కు కూడా సోయి లేదు
– రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా ఆ సమావేశానికి ఎట్ల వెళ్తాడు?
– రేవంత్ సంతకం పెట్టితే కేసీఆర్ ఊరుకోడు, రైతులు ఊరుకోరు
– అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారు
– కానీ రేవంత్‌రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడు
– మల్లాపూర్ లో బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సు
– కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్ట్‌లపై మాజీమంత్రి హరీష్‌రావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడు. రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకుంటున్నాడు.
కేసీఆర్ పేరు లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడలేడు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేశారు. రాజీనామా చేయకుండా పారిపోయింది బీజేపీ కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరే. రేవంత్‌రెడ్డి రాజీనామాను జిరాక్స్ పేపర్ మీద ఇచ్చాడు.
తెలంగాణ తల్లిని మార్చారు, తెలంగాణ లోగోలో కాకతీయ తోరణం తీసేస్తానంటాడు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయడు. కేసీఆర్ నాయకత్వంలోని మలి దశ ఉద్యమానికి ఊతం ఇచ్చింది. యూనివర్సిటీల్లోని విద్యార్థులే. గతంలో అన్ని పథకాల్లో స్కాంలు జరగాయని కేసీఆర్‌కు అధికారులు చెప్పారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. కాంగ్రెస్ నేతలపై పగబట్టుడు, లోపల వేయడం నా పని కాదని చెప్పారు
తెలంగాణ అభివృద్ధే నా ధ్యేయమని కేసీఆర్ చెప్పారు
నియామకాల్లో లోకల్ రిజర్వేజన్లను కేసీఆర్ తెచ్చారు. కేసీఆర్ రెండేళ్లు పోరాడి ప్రధాని, రాష్ట్రపతిని ఒప్పించి.. 95 శాతం నియామకాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించేలా చేశారు.
రేవంత్ పాలనలో నిధులు ఢిల్లీకి.. నిధులు ఏపీకి వెళ్తున్నాయి.
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను బద్దలు కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రాంతేతరుడు చంద్రబాబు.. ప్రాంతంవాడు రేవంత్‌రెడ్డి. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలి.
గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం.
గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో అవగాహన కల్పించారు.
పోతిరెడ్డిపాడు వెనక క్రాస్ రెగ్యులేటరే బనకచర్ల
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలిస్తారు. పోలవరం నుంచి 2 టీఎంసీల నీటిని తరలించేందుకే బనకచర్ల
గోదావరి నది ఏడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల ఆధారంగా ట్రిబ్యునల్ నీళ్ల పంపిణీ. ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు అవసరమో ట్రిబ్యునల్ కేటాయిస్తుంది. ట్రిబ్యునల్ ఒక్కసారి నీటి కేటాయింపులు చేస్తే..
సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు.
తెలంగాణ గోదావరిలో 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేశారు.
నికర జలాల మీద ఆధారపడే ప్రాజెక్ట్‌లు కడతారు. తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంతో తేలినంకనే ఏపీ ప్రాజెక్టులు కట్టాలి. కానీ కేంద్ర తన చేతుల్లో ఉందని బుల్డోజ్ చేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు కుట్ర.
200 గోదావరి జలాలను రాయలసీమకు తరలించేదే బనకచర్ల వరద జలాలతోనే బనకచర్ల కడుతున్నామని చంద్రబాబు అంటున్నాడు
నికర జలాలే ఇంకా లెక్క తేలలేదు, వరద జలాలు ఎక్కడివి?
2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు నిలిపివేయాలని బాబు లేఖ రాసిండు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నాడు.
పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను కూడా ఆపాలని బాబు లేఖ రాసిండు. ఇప్పుడేమో ఏపీ, తెలంగాణ రెండు కండ్లు అంటున్నాడు.
నేను ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టు అడ్డుకోలేదని చెబుతున్నాడు.
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఊరుకోలేదు.
గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌కు జీఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతిలో ఉందని రాత్రికి రాత్రి డీపీఆర్ పంపి ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు. 200 టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర ఉంది.
ఇప్పటికే ప్రాజెక్ట్ కట్టినం, ప్రజలు వాడుకుంటున్నారు, ప్రజాధనం వృథా అని.. రైపేరియం రైట్స్ ద్వారా మాకు హక్కు కల్పించాలని కోరుతారు.
అందుకే పథకం ప్రకారం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అందుకే బనకచర్లను అడ్డుకోవాల్సిన అవసర ఉంది
తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను వెనక్కి తీసుకోవాలి. వరద జలాలు అంటున్నాడు, లెక్క తేలకుండా ఎట్ల తీసుకెళ్తావు? నీళ్లు నిండుగా ఉంటే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించావు. ఉమ్మడి ఏపీలోనే కేటాయించిన నీళ్లనే అడ్డుకుంటున్నాడు. కచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు చెప్పేది 200 టీఎంసీలు, కానీ 400 టీఎంసీలకు కుట్ర చేస్తున్నారు తెలంగాణ లెక్క తేలకుండా ఎట్ల కడుతావని రేవంత్ అడగాలిగా? రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నా తెలంగాణ సమాజం ఊరుకుంటదా? నీళ్ల కోసం మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది.
మరోసారి యూనివర్సిటీలు ఉద్యమ వేదికలు అవుతాయి.
రేవంత్‌రెడ్డి సంతకం పెట్టితే కేసీఆర్ ఊరుకోడు, రైతులు ఊరుకోరు.
157 టీఎంసీలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఎందుకు అడుగడు? భవిష్యత్‌లో రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే కుట్ర చేస్తున్నారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లోనే చెప్పారు. బనకచర్ల కుట్రను బయట పెట్టిందే బీఆర్ఎస్.
రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కు కూడా సోయి లేదు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?
పోలవరం బనకచర్లపై సమావేశంలో చర్చించామని.. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పాడు. కానీ రేవంత్‌రెడ్డేమో బనకచర్లపై చర్చే జరగలేదని చెప్పాడు. ఎజెండా నెంబర్ వన్‌లో బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అని ఉంది. ఆలిండియా రేడియోలో కూడా.. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కమిటీ వేశారని చెప్పారు
జీఆర్ఎంబీ, సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ..
మినిస్ట్రి ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఒప్పుకోలేదు
కేంద్ర ప్రభుత్వ సంస్థలే బనకచర్లను వ్యతిరేకించాయి. రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా ఆ సమావేశానికి ఎట్ల వెళ్తాడు? కేంద్రం ఎట్ల బనకచర్లపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది? ఇది చంద్రబాబు కుట్ర, రేవంత్‌రెడ్డి పావుగా మారిండు.
నీళ్లు లేవు, కేటాయింపులు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఒప్పుకోలేదు.బనకచర్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పినం ఢిల్లీకి అఖిలపక్షానికి తీసుకెళ్తే మోదీకి చెప్తామని అడిగినం. మన మీద ఉద్యమ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డిపై సూట్‌కేసుల కేసు ఉన్నది.