Suryaa.co.in

Andhra Pradesh

వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం

-వరద నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశించా
-సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం
-ఏ సీజన్‌లో నష్టం అదే సీజన్‌లో సాయం అందిస్తాం
-ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని అధికారులను ఆదేశించాం
-ఆర్‌అండ్‌ఆర్‌కే కేవలం రూ.20 వేల కోట్లు అవసరం అవుతోంది
-కేంద్రం తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది
-తిరుమలాపురం గ్రామస్తులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి

వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎవరికీ నష్టం జరగకుండా యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందన్నారు. ఇళ్లు నష్టపోయిన బాధితులకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. రెండు నెలల్లో ప్రతి ఇంటికి నష్టపరిహారం అందిస్తామని మాటిచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌కే కేవలం రూ.20 వేల కోట్లు అవసరం అవుతోందన్నారు. రూ. 20 వేల కోట్లు అయ్యేసరికి ఏమీ చేయలేకపోతున్నానని చెప్పారు. తక్కువ మొత్తం అయితే కేంద్రం ఇవ్వకున్నా మేమే ఇచ్చేవాళ్లమని తెలిపారు. తిరుమలాపురం గ్రామంలో వరద బాధితులతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..
ఇక్కడున్న రెండు మండలాలు కూడా 41, 45 లో ఉన్నాయి. ఈ స్థాయిలో వరద వచ్చినప్పుడు ఇంత పారదర్శకంగా వ్యవహరించాం..ఈ స్థాయిలో ఇక్కడికి కలెక్టర్లు వచ్చి కాపురం పెట్టడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు గోదావరి జిల్లాల్లో ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఏకంగా ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జాయింట్‌ కలెక్టర్లు, గ్రామానికి ఒక సచివాలయం, 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉన్నారు. అందరూ కూడా పూర్తిగా మోహరించి ఏ ఒక్కరికి కూడా మిస్‌ కాకూడదు అన్న తపన, తాపత్రయంతో పని చేశారు. వీరికి తోడు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కష్టపడి ఏ ఒక్క ఇళ్లు కూడా మిస్‌ కాకుండా..ఏ ఒక్కరిని అడిగినా కూడా మాకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు వచ్చాయని చెబుతున్నారు. ప్రతి కుటుంబానికి కూడా రూ.2 వేలు అందిందని సగర్వంగా చెప్పే పరిస్థితిలో వచ్చిందంటే ఒక వ్యవస్థ ఇంత పకడ్బందీగా పని చేయడమే కారణం. ఇంతగా బాధితులను పట్టించుకొని ఈ స్థాయిలో ఎవరికీ కూడా నష్టం జరగకూడదు. ఎవరూ మిస్‌ కాకూడదని తపనతో అడుగులు వేశాం. ఇంత పారదర్శంగా జరిగినట్లు ఎప్పుడు జరగలేదు. ఈ రోజు జరుగుతోంది.

ఈ రోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేశారు. ఇకపై ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించమని ఆదేశించాను. ఏ ఒక్కరూ కూడా ఇల్లు, పంట నష్టపోయినా కూడా గుర్తించమని చెబుతున్నాను. గుడిసెలు దెబ్బతిన్న బాధితులకు పరిహారం రూ. 4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇవ్వమని ఆదేశించాను.
ఏ ఒక్కరికీ కూడా ఫలాని పంట నష్టం, ఇంటి నష్టం జరిగిందని బాధపడే పరిస్థితి రాకుండా వచ్చే 14 రోజుల పాటు ఎన్యుమరేషన్‌ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశా. ప్రతి ఒక్కరికి సంతోషం కల్పించే విధంగా అంచనాలు వేయాలి. ఇది అయిన తరువాత సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో 14 రోజుల పాటు జాబితాను అందుబాటులో ఉంచుతాం.

ఆ తరువాత కూడా ఎవరికైనా పొరపాటున మిస్‌ అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత 14 రోజుల్లో మళ్లీ వెరిఫికేషన్‌ కూడా చేసి ఫైనల్‌ లిస్ట్‌ పెడతారు. అన్ని కలిపి ఆరు వారాలు అవుతుంది. మరో రెండు వారాలు నాకు టైం ఇవ్వండి..అంటే రెండు నెలల పాటు సమయం ఇస్తే జరిగిన నష్టానికి పూర్తిగా మేలు జరిగేలా డబ్బులు ఇస్తాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇస్తాం. మనకు ఉన్న ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే..త్వరగా ముంపు గ్రామాలను వెకెట్‌ చేయించడం. మీ చేతుల్లో డబ్బులు పెడితే మేలు జరుగుతుందన్నది ప్రధాన సమస్య.

మొత్తంగా 45.7 దాకా చేయాలంటే కేవలం ఆర్‌అండ్‌ఆర్‌కే దాదాపు మరో రూ.20 వేల కోట్లు అవసరం. రూ.500, రూ.2000 కోట్లు అయితే మనమే ఇచ్చేవాళ్లం. దాదాపు రూ.20 వేల కోట్లు అనేసరికి జగన్‌ కూడా సరిపోవడం లేదు. రూ.20 వేల కోట్లు అనేసరికి కేంద్రం ఇవ్వాల్సిందే. కేంద్రం సహకారం అందించాలి. ఒక్కటైతే చెబుతున్నాను. ఈ సెప్టెంబర్‌ కల్లా 41.15 వరకు మాత్రం పూర్తిగా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ కూడా ..కేంద్రం ఇచ్చేది ఆలస్యమైనా కూడా..ఇప్పటికే కేంద్రం మనకు 2,900 కోట్లు రావాలి. ఇది రివర్స్‌..మాములుగా కేంద్రం మనకు డబ్బులు ఇస్తే మనం పనులు చేయించాలి. కానీ ఇక్కడ మనమే రూ.2,900 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాం. ఆ డబ్బులు ఇప్పించుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంది. ఇప్పటికే నేను మూడు సార్లు ప్రధానిని కలిశాను. మన మంత్రులు అదే పనిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూ.2,900 కోట్లు రావడం ఆలస్యమైనా కూడా 41.15 కు సంబంధించి అన్ని కుటుంబాలకు మనమేఇచ్చి షిప్ట్‌ చేస్తాం. నేను మాటిచ్చాను..అప్పట్లో నాన్న సమయంలో రూ.1.10 లక్షలు ఇచ్చారు. వారికి రూ.5 లక్షలు ఇచ్చి తోడుగా ఉంటాను. షిప్ట్‌ అయ్యే సమయానికి ఆ డబ్బులు కూడా వారి చేతుల్లో పెడతాం.

ఎటొచ్చి 41.15 ఆ తరువాత ఉన్న వారికి 45.27 దాకా పోయే కార్యక్రమానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. దాని కోసం గట్టిగా కృషి చేస్తాం. కేంద్రం కూడా ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వాల్సిందే.దాన్ని ఆపే ప్రసక్తే లేదు. అదేదో ఈ రోజు ఇస్తే బాధితులకు మేలు జరుగుతుంది. దీన్ని ఆలస్యం చేసే కొద్ది అమౌంట్‌ ‡ఇంకా పెరుగుతూ పోతుంది. 2013 చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ పిరియడ్‌ మూడేళ్లు మాత్రమే. కేంద్రం ఆలస్యం చేస్తే వాళ్లకు కూడా నష్టం జరుగుతోంది.వాళ్ల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.

డ్యామ్‌ను నింపే కార్యక్రమంలో మీ అందరికీ ఒక మాట చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామ్‌లో మనకు పరిహారం ఏ మేరకు ఇస్తారో ఆ మేరకు మాత్రమే నింపుతాం. ఆ తరువాత ఎక్కువ నింపే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఇదైతే ఖచ్చితంగా చెబుతున్నాను.

మనమంతా గమనించాల్సింది కేంద్రానికి చాలా ఇంపార్టెంట్‌ పాత్ర. కేంద్రాన్ని గట్టిగా అడిగి వీలైనంత త్వరగా మేలు చేసే కార్యక్రమం చేస్తాం. మనం కూడా చెప్పాల్సిన వాళ్లకు చెప్పాలి. చిత్తశుద్ధితో ఎలా పని చేస్తున్నామో మీ అందరికీ అర్థమవుతోంది. కేంద్రం నుంచి సహాయం రావాలి. మీరు కూడా చెప్పే పద్ధతిలో చెప్పాలి. ఏ పొదై్దనా న్యాయం జరగకపోదు. కచ్చితంగా న్యాయం జరుగుతుంది. వీలైనంత త్వరగా జరిగించే విధంగా అడుగులు ముందుకు వేస్తా. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరాను. ఇది కూడా చెబుతాను. నేను వెళ్లి చూసి వచ్చాను. అందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారని ప్రధానికే చెబుతా. ఈ విషయాలను కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పి ఒప్పిస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం బాధితులకు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE