Suryaa.co.in

Andhra Pradesh

పదికి పది స్థానాలు గెలిచి సీఎంకు గిఫ్ట్‌గా ఇస్తాం

-పార్టీ బ్యానర్, ఇంటి పేరు వదిలితే చంద్రశేఖర్‌రెడ్డి పరిస్థితి అర్థం అవుతుంది
-వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బ్యానర్, ఇంటి పేరు వదిలితే చంద్రశేఖర్‌రెడ్డి పరిస్థితి ఏంటో తెలుస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. వీధి కుక్కల ప్రచారాలను తాను పట్టించుకోనని, పార్టీ లైన్‌ దాటితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం వైయస్‌ జగన్‌తోనే ఉంటుందని, ఆయనతోనే ప్రయాణం సాగిస్తుందన్నారు. ప్ర‌తిప‌క్షాలు, కొన్ని మీడియా సంస్థ‌లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక మీడియాను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదన్నారు. ప్రజల గుండెల్లో సీఎం వైయస్‌ జగన్‌ పదిలంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలిచి సీఎం వైయస్‌ జగన్‌కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE