Suryaa.co.in

National

ఐసియులో పెళ్లిళ్లు

వినడానికి.. చదవడానికి ఇది విచిత్రంగా-విభిన్నంగా ఉన్నప్పటికీ ఇది నిఝంగా నిజం. పెళ్లికి ఫలానా ప్రదేశమే అవసరం లేదు. అవసరాలు- పరిస్థితుల మేరకు ఎక్కడైనా చేసుకోవచ్చని.. అందుకు ఆసుపత్రిలోని ఐసియు గది కూడా మినహాయింపు కాదని ఈ ఘటన చూస్తే అర్ధమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే..

తండ్రి కొన ఊపిరితో ఐసియు లో ఉండగా.. ఆయన కూతుళ్లు లక్నో లోని ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్నారు. జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉండగా తండ్రి సూఫీ సయ్యద్ ఛాతీ ఇన్ఫెక్షన్ తో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తండ్రి పరిస్థితిని తెలుసుకున్న కూతుళ్లు డా. దర్శా, తాంజిలా ఆస్పత్రిలో పెళ్లి చేసుకునేందుకు ఐసియు లో ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

LEAVE A RESPONSE