భవిష్యత్తుకు గ్యారెంటీ కల్పించడమే లక్ష్యంగా మహానాడులే మినీ మేనిఫెస్టో
భక్తిభావం కలిగిన తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నాడు
శరత్ చంద్రారెడ్డిపై సీబీఐ కేసు కనిపించలేదా?
యువగళం పాదయాత్ర ఒక ప్రభంజనం
ప్రతీ 5 వేలు జనాభా ఒక యూనిట్‌గా ఒక సమావేశం
టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ‘బాబు ష్యురిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ సభ కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ 42 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేశాం. 42 సంవత్సరాల ప్రయాణం ఒకెత్తు.. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన ఒకెత్తు. దుర్మార్గుడు, మూర్ఖుడు, సైకో, మతి స్థిమితం లేని వ్యక్తికి అధికారం ఇస్తే పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం.
రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నాడు. వింత పోకడలతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడు. జగన్ రెడ్డి పన్నే ప్రతి కుట్రనూ ఛేదించాం.. నిలదొక్కుకున్నాం. అధికార పార్టీని కొంత మంది ప్రజలు వ్యతిరేకించడం సాధారణమే. కానీ జగన్ రెడ్డిని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలూ జగన్ ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూస్తున్నారు.
రోడ్డెక్కితే కేసు పెట్టే పరిస్థితుల్లో చంద్రబాబు రోడ్డెక్కి ప్రజల్లో చైతన్యం నింపారు.ఇదేం ఖర్మ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రజలందరినీ ఎదురించే ధైర్యం కల్పించాం. టీడీపీ అధికాంరలోకి వస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తారంటూ చీప్ పాలిటిక్స్ కు దిగాడు. ఆ పిల్ల బచ్చాకి చెబుతున్నా సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుండి అని.
తెలుగుదేశం పార్టీ వస్తే సంక్షేమం ఎలా ఉంటుందో.. అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం.భవిష్యత్తుకు గ్యారెంటీ కల్పించడమే లక్ష్యంగా మహానాడులే మినీ మేనిఫెస్టో ప్రకటించాం. ప్రజాస్వామ్య దేశంలో ఈ స్థాయిలో అప్పులు చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. నాలుగున్నర సంవత్సరాల్లో రూ.60వేల కోట్ల భారం మోపారు. వర్షాకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 10-12 గంటలు కోత పెడుతున్నాడు.
పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు ప్రకటించి వ్యవస్థల్ని నాశనం చేశాడు. నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ సహా అన్ని ధరలూ పెంచి ప్రజలపై బాదుడుకు సిద్ధమయ్యాడు.ప్రపంచ నలుమూలా భక్తిభావం కలిగిన తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. టీటీడీ ఛైర్మన్‌గా అన్యమతస్తుడిని నియమించడాన్ని మించిన దుర్మార్గం ఏముంటుంది? పదవులిచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీ హైందవ ధర్మాన్ని మంటగలపడాన్ని ప్రశ్నిస్తున్నాం.
టీటీడీ సభ్యుల్లో చాలా మందిపై తీవ్రమైన కేసులున్నాయి.టీటీడీ సభ్యుడిగా నియమించిన శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తిపై సీబీఐ కేసు కనిపించలేదా?నాలుగేళ్లలో ఇసుకలో రూ.40 వేల కోట్లు దోచేశాడు. మూడు రోజుల పాటు ఇసుక సత్యాగ్రహం చేపట్టబోతున్నాం. యువగళం పాదయాత్ర ఒక ప్రభంజనం. నడవగలడా.. నడవ నిస్తామా.. తడాఖా చూస్తామని ఎంతో మంది బెదిరించారు.
కానీ నేడు పాదయాత్రను చూసి వైసీపీ నేతలు ఇళ్ల నుండి బయటకు రావడానికి వణుకుతున్నారు. స్వతంత్ర దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఒక పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి కుట్ర చేస్తున్నాడు. రెచ్చగొట్టే చర్యలకు దిగిన వారిని వదిలి.. టీడీపీ నేతలపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. 200 రోజుల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు లోకేశ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అదే సమయంలో సంఘీభావంగా నియోజకవర్గాల్లో 3కి.మీల పాదయత్ర చేయాల్సిందిగా సూచిస్తున్నా. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఏకం చేద్దాం. వారికి భరోసాగా నిలుద్దాం.బాబు ష్యురిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం 45 రోజుల పాటు దిగ్విజయంగా చేద్దాం.
రాష్ట్రంలోని కోటిన్నర కుటుంబాలను కలుద్దాం.. వారి సమస్యలకు మనం భరోసాగా నిలుద్దాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలి.ప్రతీ 5 వేలు జనాభా ఒక యూనిట్‌గా ఒక సమావేశం పెట్టాలని నిర్ణయించాం.ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 10 కమ్యునిటీ అవుట్ రీచ్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం.సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టి ఆయా వర్గాలకు పార్టీని చేరువ చేస్తాం. 45 రోజుల కమ్యునిటీ అవుట్ రీచ్ ప్రోగాలలో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 30 నియోజకవర్గాలలో పర్యటిస్తారు.
బాదుడే-బాదుడే, ఇదేం ఖర్మ, భవిష్యత్తుకు గ్యాంరెంటీ కార్యక్రమాలకు వెళ్లని నియోజకవర్గాలలో జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. రాయలసీమ నుంచి పర్యటన ప్రారంభిస్తారు.
వాలంటీర్ల సహాయంతో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. దొంగే దొంగ, దొంగ అన్నట్లు అధికారపార్టీ వైకాపా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. తెదేపావారు వైకాపా ఓట్లు తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నెల ఆగష్టు 28 న చంద్రబాబునాయుడు గారు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అధికారపార్టీ ఓట్ల అక్రమాలపై పిర్యాదు చేస్తారు.
దీనికి పోటీగా వైకాపా వారు కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి తప్పుడు పిర్యాదులు చేయాలని చూస్తున్నారు.వైకాపా వారు అధికారాన్ని చేతిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ వారు ఓట్లు తొలగిస్తున్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఇది వైకాపా నీచరాజకీయాలకు పరాకాష్ట. జగన్ రెడ్డి అవలక్షణాలను ఇతరులకు రుద్దడమే ఆయన నైజం, స్వభావం.
గన్నవరం, నూజివీడులలో యువగళం పాదయాత్రపై వైకాపా వారే దాడులు చేసి తెదేపా వారిపై కేసులు పెట్టారు. కేసులకు బయపడాల్సిన అవసరం లేదు. నాలుగన్నరేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ కొద్ది నెలలు కూడా కష్టపడుదాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మీకు అండగా ఉంటుంది.ఇసుక సత్యాగ్రహం, యువగళం పాదయాత్రకు సంఘీభావం, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను జయపద్రం చేయాలని కోరుతున్నా.