– ఆహుతులను మంత్రముగ్ధులను చేసి.. అద్భుతంగా జాతీయ గీతాన్ని ఆలపించి..
– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా జిల్లా కలెక్టర్
– ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం ఆలపించి.. ఆహుతులను మంత్రముగ్ధులను చేసిన పమేలా సత్పతి
– ఆద్యంతం ఆసక్తిగా విన్న మంత్రి, అధికారులు
– ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కితాబు.
కరీంనగర్: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. డిఫరెంట్ గా ఆలోచన చేస్తూ పేదలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. స్వతంత్ర దినోత్సవం వేళ మరో అరుదైన ఘనత సాధించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పేరెంట్ గ్రౌండ్లో మంత్రి.. అధికారులు.. ఆహుతులను జిల్లా కలెక్టర్ మంత్రముగ్ధులను చేసింది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం ఆలపించి ఔరా అనిపించారు. ఒక జిల్లా కలెక్టర్ స్వయంగా ఇండియన్ సైన్ లాంగ్వేజి లో జాతీయ గీతం ఆలపించడంతో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన వారంతా అధ్యంతం ఆసక్తిగా విన్నారు.
దీంతో ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ ప్రతిభను ప్రశంసించారు. శభాష్ కలెక్టర్ మీరు ఆలపించిన ఇండియన్ సైన్ లాంగ్వేజిలో జాతీయగీతం అద్భుతంగా ఉంది.. అని కితాబు ఇచ్చారు. ఒక జిల్లా కలెక్టర్ స్వయంగా జాతీయ గీతం ఆలపించిన తీరు పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్ సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాన్ని ఆలపించారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో దివ్యాంగుల సమస్యల్ని, భావాన్ని అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కరీంనగర్ జిల్లాలోని అధికారులకు ఇండియన్ సైన్ లాంగ్వేజీ బేసిక్స్ పై కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఏడు రోజులపాటు ఇచ్చిన ఈ శిక్షణ లో అధికారులు సైన్ లాంగ్వేజిలో బేసిక్స్ నేర్చుకున్నారు. తద్వారా బధిరుల విన్నపాలు సులభంగా అర్థం చేసుకొని వారి సమస్య పరిష్కరించాలన్నది ఈ శిక్షణ ఉద్దేశం.
ఇందులో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు, బధిరులు ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి సైన్ లాంగ్వేజి లో జాతీయగీతం ఆలపించారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. శభాష్ కలెక్టర్ అని కితాబు ఇచ్చారు.