(అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యం)
ఒకప్పుడు అంటే కమ్యూనిస్ట్ పాలన కంటే ముందు పశ్చిమ బంగాళం పారిశ్రామిక ప్రగతి 1970 లలో ఐరన్ ఫోర్జింగ్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింట్స్ జనపనార పరిశ్రమలు ఇలాంటివెన్నో ఉండేవి. ఆర్థికంగా దేశంలో మూడవ స్థానం లో ఉండేది. అప్పట్లో దేశ gdp లో 20-25శాతం ఉండేది. ఇప్పుడు 3శాతం ..,దేశ Gdp ,కి బాగానే ఇచ్చేది..
ఎప్పుడైతే కమ్యూనిస్టుల పాలన, వారి కార్మిక సంఘాల అతి జోక్యం, blackmail తో 35 ఏళ్ళ కమ్యూనిస్టుల పాలనలో, ఆ తర్వాత TMC పాలనలో మమతాదీదీ హయం, అక్కడ దాదాపు పదివేలకు పైగా పరిశ్రమలు అక్కడ నుండి వెళ్ళిపోయాయి. దానిపై కమ్యూనిస్టుల మేధావులు, అభిమానులు నోరు మెదపరు.
ఈ నికృష్ట కమ్యూనిస్టుల పాలసీతో దేశాలు, రాష్ట్రాలు ఆర్థికంగా ఎలా దివాళా తీశాయో చూస్తూనే ఉన్నారు కదా? అయితే మమతా.. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి గద్దె ఎక్కింది కానీ, ఆమె కూడా అంతకంటే ఘోరంగా పారిశ్రామిక వేత్తలని బెదిరించి, తమ కార్యకర్తలనబడే గూండాలతో అక్కడ పరిశ్రమలను మూయించింది.
గూండాయిజంతో మూతబడ్డాయి. కమ్యూనిస్టులు అడుగుపెట్టక ముందు, వారు అడుగు పెట్టాక పశ్చిమ బంగాళం ఎలా నాశనం అయ్యింది. కళ్ళార చూడవచ్చు.మనదేశంలోనే కాదు. ప్రపంచంలో ఎక్కడ వీరు పాలన చేతిలోకి తీసుకుంటే అక్కడ వినాశనం.
– జైహింద్