కాలప్రవాహంలో మరో ఏడాది చరిత్ర పుటల్లో కలవనుంది. కొన్ని సంవత్సరాలు మాత్రం చరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట 2025 ఒక అరుదైన, మరపురాని సంవత్సరం. భావోద్వేగాలు, సవాలుతో కూడిన పరిస్థితులు, మరియు ఊహించని ప్రకృతి కరుణ కలబోసిన ఈ ఏడాది.. ఒక రాష్ట్రం తన అస్తిత్వాన్ని ఎలా వెతుక్కుంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది.
చరిత్రలో తొలిసారి: భానుడి భగభగలు లేని ఏడాది
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 2025 ఒక మైలురాయి. సాధారణంగా రోహిణి కార్తె వచ్చిందంటే నిప్పులు కురిసే ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడిపోయేవారు. కానీ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది ఎండల తీవ్రత ఊసే లేదు. సమృద్ధిగా కురిసిన వర్షాలు రాష్ట్రమంతటా ప్రకృతి అందించిన సహకారంలా నిలిచాయి. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ వర్షాల వల్ల భూగర్భ జలాలు ఏకంగా 6.08 మీటర్లకు పెరగడం, భానుడి భగభగలు లేని ఈ ఏడాది ఒక అద్భుతమైన ‘ప్రకృతి సానుకూల’ సంవత్సరంగా మిగిలిపోతుంది.
పెట్టుబడుల పునరుద్ధరణ & అమరావతి పునర్వైభవం
గతంలో రాష్ట్రానికి రావాల్సిన పెద్ద సంస్థలు వెనకడుగు వేయడం చూశాం. కానీ 2025 ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది.
అమరావతి నిర్మాణం: రాజధాని అమరావతి పనులు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం పనులు వేగవంతం కావడమే కాకుండా, ఒక ఆశయ నగరం మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది.
పరిశ్రమల నమ్మకం: దేశంలోనే తొలిసారిగా పరిశ్రమల రాయితీలకు ఎస్క్యూ (Escrow) ఖాతాలను ఏర్పాటు చేశారు.
భారీ ఒప్పందాలు: CII సమ్మిట్ ద్వారా ₹13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో రాష్ట్రం 11.28% డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది.
భవిష్యత్తు వైపు అడుగులు: క్వాంటం శిక్షణ
రేపటి తరం సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ వెనకబడకూడదనే లక్ష్యంతో క్వాంటం వ్యాలీ (Quantum Valley) కు తొలి అడుగులు పడ్డాయి. మన యువతకు అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ మరియు ఫ్యూచర్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై మన యువతను విజేతలుగా నిలిపే ప్రయత్నం.
నిరుద్యోగ యువతకు ‘మెగా’ భరోసా
మెగా డీఎస్సీ: 15,941 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి.
పోలీస్ నియామకాలు: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను ₹4,500 నుండి ₹12,500కు పెంపు.
ప్రజా క్షేత్రంలో ‘సూపర్ సిక్స్’ విజయకేతనం
తల్లికి వందనం: 67.27 లక్షల మంది విద్యార్థుల కోసం ₹10,090 కోట్లు అందజేత.
స్త్రీ శక్తి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 3.25 కోట్ల ప్రయాణాలు.
అన్నదాత సుఖీభవ: 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹6,310 కోట్లు. ధాన్యం సొమ్ము 24 గంటల్లోనే జమ.
ఎన్టీఆర్ భరోసా: ఏడాదిలో ₹33,000 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ.
2026 వైపు ఆశావహ అడుగులు
2025లో వేసిన సుస్థిరమైన పునాదులతో మనం 2026 లోకి అడుగు పెడుతున్నాం. మన ముందున్న లక్ష్యాలు:
పూర్తికావాల్సిన పోలవరం కల & వెలిగొండ ప్రాజెక్ట్.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడం.ఒప్పందం చేసుకున్న పెట్టుబడులను గ్రౌండ్ చేయడం ద్వారా యువతకు 16 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడం.
ప్రతి ఇంటికి ‘అమరజీవి జలధార’ ద్వారా మంచినీటి కనెక్షన్లు.
బై బై 2025.. నీవు మిగిల్చిన చల్లని జ్ఞాపకాలు పదిలం. స్వాగతం 2026.. నవశకానికి నువ్వే వారధివి కావాలి!