Suryaa.co.in

Andhra Pradesh

అధికారి భార్య నీరజారాణిపై ఏం చర్యలు తీసుకున్నారు?

-గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బంగారంతో దొరికిన కీలక అధికారి భార్య నీరజారాణిపై ఏం చర్యలు తీసుకున్నారు?
-వైసీపీ పాలనలో పోలీసుల అరాచకాలు, ప్రభుత్వ దాడులు అధికమయ్యాయి
-సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా కొల్లు అంకబాబు అరెస్ట్
-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వైసీపీ పాలనలో పోలీసుల అరచకాలు, ప్రభుత్వ దాడులు అధికమయ్యాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…గతంలో పోలీసులు అంటే ప్రజలను కాపాడటానికి ఉన్నారని అనుకునే వారు. నేడు పోలీసులు, సిఐడి అంటే ప్రజలను హింసించడానికి ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో రోజుకు ఎన్ని కేసులు నమోదు చేశారు? సిఐడి, పోలీసులు ఎంత మందిపై కేసులు నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టులు చేశారు. ఎంత మంది మీద పీడి యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, 307 కేసులు పెట్టారనేదానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద 90శాతం అక్రమ కేసులుపెట్టారు. నేడు పాత్రికేయులను కూడ వదిలి పెట్టడం లేదు.

73ఏళ్ల వృద్ధుడు కొల్లు అంకబాబును కూడా వదలకుండా అరెస్టు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపీకి చెందిన ఓ ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగి భార్య వద్ద దుబాయ్ నుండి వచ్చిన బంగారం పట్టుబడిన వార్తను వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాడని ఆయనను అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు తీర్పును సీఐడీ పదేపదే ధిక్కరిస్తోంది. తాజాగా మరోసారి ధిక్కరించింది. సీనియర్ జర్నలిస్టును నిబంధనలకు విరుద్దంగా అన్యాయంగా అరెస్టు చేశారు. ఏ వ్యక్తినైనా అరెస్టు చేయాలంటే మొదటగా 41ఏ నోటీసులు ఇవ్వాలి. సుప్రీం కోర్టు పదే పదే ఈ విషయం చెప్పినా సీఐడీ పెడచెవిన పెడుతోంది. సెప్టెంబర్ 10న బంగారం అక్రమంగా తరలిస్తూ డిఆర్ఐకి పట్టుబడ్డ ఉన్నతాధికారి భార్య అనే వార్తను కొల్లు అంకబాబు ఫార్వర్డ్ చేశాడు. అదే ఆయన తప్పు అయింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సిఇఓ సతీమణి నీరజరాణి విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ డిఆర్ఐ కు పట్టుబడ్డారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఆవిడని బంగారంతో పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణకు కస్టమ్సకు అప్పగించారు. ఈ వార్తను సామాజికి మాధ్యమాలలో షేర్ చేశారు. నిజాలని పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా? జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదా? వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి వార్తలను పోస్టు చేయకూడదా?

అర్థరాత్రులు దౌర్జన్యంగా అరెస్టులు చేస్తారా. ఆడవాళ్ళుని నెట్టేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నిర్వీర్యం అయిపోయింది. అమరావతి పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంచేశారు. ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ప్రజలకు నిరసన తెలిపే స్వాతంత్ర్యం లేదా?

బంగారంతో పట్టుబడ్డ వారి గురించి విచారణ జరపాల్సిన ముఖ్యమంత్రి, సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేయిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రజలకున్న స్వాతంత్ర్యం మన రాష్ట్రంలో మాత్రం ప్రజలకు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారు. 175 సీట్లు వచ్చాయని ప్రతి విషయానికి డబ్బా కొట్టుకునే జగన్ రెడ్డి ఎందుకు తనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా భయపడుతున్నారు. శాసనసభలో కులాల గురించి మాట్లాడే పరిస్ధితిని తీసుకొచ్చారు.

ముఖ్యమంత్రి పర్యటనకు వెళుతుంటే ప్రజలను రోడ్లకు మీదకు రానివ్వకుండా బారికేడ్లు, షాపులని మూసివేయించడం నియంతృత్వ పోకడకు నిదర్శనం. జగన్ రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారు. ఆళ్ళగడ్డలో కొంత మంది నాయకులపై పిడి యాక్ట్, 307 పెట్టారని జగన్ రెడ్డి ప్రతి రోజూ సమీక్షలో తెలుసుకుంటూ ఉంటారు. ఆయన నేతృత్వంలో 90 శాతం అక్రమ కేసులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద పెట్టారు. అంతే కాకుండా ప్రజాసంఘాలు, సామన్య ప్రజలపై అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు ఆఖరికి నేడు పాత్రికేయులని సైతం వదిలి పెట్టడం లేదు. సుప్రీం కోర్టు తీర్పును సీఐడీ పదేపదే ధిక్కరిస్తోంది. ఏ వ్యక్తినైనా అరెస్టు చేయాలంటే మొదటగా 41ఏ నోటీసులు ఇవ్వాలని సుప్రీం కోర్టు పదే పదే చెప్పినా సీఐడీ పెడచెవిన పెట్టడం దేనికి నిదర్శనం?

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు చేసిన తప్పేంటి? సెప్టెంబర్ 10, 2022న ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సిఈఓ సతీమణి నీరజారాణి విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుంటే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రమ అధికారులు పట్టుకున్నారని సామాజిక మాధ్యామాల్లో వచ్చింది. దానిని ఆయన ఇతరులకు షేర్ చేశారు. నిజాలని పోస్ట్ చేస్తే అరెస్ట్ చేసేస్తారా? జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదా. వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి వార్తలను పోస్టు చేయకూడదా? అర్థరాత్రులు దౌర్జన్యంగా అరెస్టులు చేస్తారా? ఆడవాళ్ళుని నెట్టేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైపోయింది. అమరావతి పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నా అనే రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ప్రజలకు నిరసన తెలిపే స్వాతంత్ర్యం లేదా?

బంగారంతో పట్టుబడ్డ వారి గురించి విచారణ జరిపించాల్సిన జగన్ రెడ్డి, సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసిన అంకబాబును అరెస్టు చేయడం దుర్మార్గం. భారత దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్వేచ్ఛ దేశంలో భాగమైన మన రాష్ట్రంలో మాత్రం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారు. శాసన సభలో కులాల గురించి మాట్లాడే పరిస్ధితిని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళుతుంటే ప్రజలను రోడ్లకు మీదకు రానివ్వకుండా డబుల్ బార్ కేడ్లు పెడుతున్నారు, పరదాలతో కప్పేస్తున్నారు. షాపులని మూసివేయించడం నియంతృత్వ పోకడ. జగన్ రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారు.

అక్రమంగా అరెస్ట్ చేసిన అంకబాబును వెంటనే విడుదల చేయాలి. పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలి. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి విచారణ జరిపే మీరు, మీ కార్యాలయంలో భారీ దోపిడి జరుగుతుందంటే విచారణ జరిపించరా లేరా? జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదు చేశారనేది శ్వేత పత్రం విడుదల చేయాలి?

LEAVE A RESPONSE