– రైతు నుదిటి మీద మరణ శాసనం రాస్తున్నారా ?
– ఎప్పుడు కూడా ఇలాంటి దరిద్రపు పాలన ను చూడలేదు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెంట్లాం గ్రామం లో రైతు గోస దీక్ష లో వైఎస్ షర్మిల
తెలంగాణ లో రైతు సంపాదించేది నెలకు రెండు వేలు మాత్రమే.తెలంగాణ కో రైతు ఆగమయ్యాడు. మేము బ్రతకాలా… చావాలా అని రైతులు అంటున్నారు. ఒక్కరూ కూడా బరోసా ఇచ్చే వారు లేరు. కేసీఆర్ కి ఆయన కుటుంభానికి అయ్యింది బంగారు తెలంగాణ.రైతులకు మిగిలింది అప్పులే.
రుణమాఫీ చేయకుండా రైతుబంధు ఇస్తే వడ్డీ కే పోతుంది. రైతు కూలీల గోస ఇక వర్ణనాతీతం.
పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలని దిక్కుమాలిన పాలన చేస్తున్నారు.ఎప్పుడు కూడా ఇలాంటి దరిద్రపు పాలన ను చూడలేదు.పంట నష్టపోతే ఆదుకుంటాం అని ఎప్పుడు చెప్పలేదు. రాష్ట్రంలో ప్రతి రైతు అప్పులపాలు అయ్యాడు.
60 ఏళ్లు దాటితే రైతు బీమా కూడా ఇవ్వడు. బీమా కావాలి అంతే 59 ఏళ్లకే చనిపోవాలా..? రైతు నుదిటి మీద మరణ శాసనం రాస్తున్నారా ? కేసీఆర్ గారు మీకు ఎన్నేళ్లో చెప్పాలి. 60 ఏళ్లు దాటిన రైతు పంట సాగు చేస్తే అది వ్యవసాయం కదా…ఆ పంట మనం తింటలేమా?ఇదెక్కడి విచిత్రం…ఇదెక్కడి చోద్యం?
ఒక చేత్తో ఇవ్వడం..మరో చేత్తో వెనక్కు తీసుకోవడం కేసీఆర్ గారడీ.5 వేలు ఇస్తూ..25 వేల సబ్సిడీ పథకాలను బంద్ పెట్టారు.5 వేలతో రైతు బాగుపడి పోయాడా?వైఎస్సార్ రైతు పక్షపాతి అనిపించుకున్నాడు.కేసీఆర్ రైతులను నిండా ముంచారు.
రైతు వైపు చూడటం లేదు..గ్రామాల వైపు చూసిన దిక్కే లేదు.మద్దతు ధర ఉన్న పంట ను వేయొద్దు అని చెప్పే హక్కే లేదు.రి వెయద్దు అని చెప్తే… 17 లక్షల ఎకరాల్లో పంట సాగుబడి చేయలేదు.వారంతా కేసీఆర్ మాటలతో నష్టపోయారు.వడగండ్ల వాన వచ్చి గడ్డి తప్పా ఎం మిగలలేదు.వరి పండించిన రైతులు కూడా ఆగం అయ్యారు.7 వేల కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనేది కేవలం వంద సెంటర్లు మాత్రమే.ఇంత నష్టం జరుగుతుంటే రైతును ఆదుకోవాలన్న కనికరం కూడా లేదు.
వైఎస్సార్ ఇచ్చిన ఇళ్ళల్లో నే ఇప్పటి వరకు ఉంటున్నారు.కరువు పని 200 రోజులు ఉండే..150 రూపాయలు ఇచ్చారు.ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వడం గగనం గా మారింది.ఓట్లు అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ గారడి మాటలు చెప్తారు.ఇచ్చిన హామీలలో ఒకటైనా కేసీఆర్ అమలు చేశారా?వైఎస్సార్ బిడ్డగా నేను ఇక్కడకు వచ్చా.ఆఖరి నిమిషం వరకు సేవ చేస్తూ చనిపోయారు.
వైఎస్సార్ ప్రేమించిన ఈ ప్రజలకు ఆయన పాలన అందించడం కోసమే వచ్చా. వైఎస్సార్ సంక్షేమ పాలన అందించడం కోసమే పార్టీ పెట్టా. తెలంగాణ లో ప్రతిపక్షం లేకుండా అందరినీ కొనేశారు. ప్రశ్నించే వారు లేకుండా చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి..ప్రజల పక్షాన నిలబడటానికి వైఎస్సార్ పార్టీ పుట్టింది.