– మేము న్యాయ పోరాటానికి వెళ్తాము
– చంద్రబాబు రోజులు మళ్లీ వచ్చాయి.
– మాజీ మంత్రి వి . శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ఉమ్మడి పాలమూర్ జిల్లా కి ఎవరు వచ్చిన పాలమూర్ ని ఎండ బెట్టారని మాట్లాడు తున్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ప్రతి సందర్భంగా అలానే మాట్లాడుతున్నారు. నెట్టెంపాడు,బీమా ,కోయిల్ సాగర్ నుంచి నీళ్లు ఎలా వస్తున్నవి.
మేము ఏమి చేయక పోతే ఈ రెండేళ్ల ల్లో కాంగ్రెస్ పాలమూర్ కి ఏమి చేశారో చెప్పాలి. 90 శాతం పూర్తి అయిన పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు ని ఎందుకు మిగితా 10 శాతం పూర్తి చేయడం లేదు. ఇరిగేషన్ మంత్రి నీటి పై చిత్తశుద్ధి లేదు. Slbc లో ఇప్పటి వరకు శవాలు బయటకి తీయలేదు.
ప్రభుత్వం అసమర్థత.ఒక్క సమీక్ష అయిన చేస్తున్నారా? కొడంగల్ లో పనులు ప్రారంభం అయ్యవా? మేము చేసినా అభివృద్ధి కి ప్రతి రూపాయి లెక్క మా వద్ద ఉంది. 188 చెక్ డ్యామ్ కట్టం..వేల ఎకరాల్లో పంటలు పండుతున్నవి. కాంగ్రెస్ హయం లో ఇప్పటి ముఖ్యమంత్రి జలయజ్ఞం కాదు ధన యజ్ఞము అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇవ్వక ముందే లీక్ లు ఇస్తున్నారు. కేసీఆర్ పై కేసు అవుతాధి అని లీక్ ఇస్తున్నారు.
కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్. లక్ష కోట్లు తింటే మేడిగడ్డ, అన్నారం,సిందిళ్ల ఎక్కడ వి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అత్యధిక వరి పంట పండించింది. కేసీఆర్ హయాంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం కరెంట్ కోతలు.
కేసీఆర్ ఆలోచన అంత రైతుల గూర్చే..రైతు బాగుపడితే అన్ని కులాల వాళ్ళు బాగుపడుతారని ఆయన ఆలోచన. కాళేశ్వరం పియర్స్ రిపేర్ చేయకుండా కేసీఆర్ పై నెపం వేయాలని ప్రభుత్వం చూస్తోంది. కేసీఆర్ ని మీరు ఏమి చేయలేరు. మేము న్యాయ పోరాటానికి వెళ్తాము. కాళేశ్వరం పై లీక్ లు ఇచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు.
కాళేశ్వరం వద్ద నే హరీష్ రావు పడుకొని పనులను పరిశిలించి అక్కడే ఉండి కట్టించారు. హరీష్ రావు ప్రాజెక్టు ల పై దృష్టి పెట్టి కట్టించింది పాపం అయ్యిందా? గత ప్రభుత్వం లో ఏమి చేయనిదే 8.50 ఎకరాల్లో పంటలు పండయా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు గుండె ఆగి ఎంతో మంది చనిపోతున్నారు.
ప్రాజెక్టు లపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేయవద్దని కాంగ్రెస్ కి సూచన. ఏ కమిషన్ వేసిన కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్. కట్టుకథలకు బిఅరెస్ భయపడదు. కాళేశ్వరం ని కేంద్ర మంత్రులు అద్భుత ప్రాజెక్టులన్నారు. చాలా దేశాల్లో అనేక ప్రాజెక్టులు కూలి పోయాయి.
ఎన్నికల కోసం పిలర్ల క్రింద బాంబ్ పెట్టారు కావొచ్చు.మాకు అనుమానం ఉంది..మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేస్తాం.
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్. మక్తల్ నియోజకవర్గం లో బీమా ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాలకు కేసీఆర్ హయం లోనే నీళ్లు వచ్చాయి. కొడంగల్ నారాయణ పేట లిఫ్ట్ కు ఏ అనుమతులు లేవు. భూ సేకరణ అడ్డగోలుగా చేస్తున్నారు.
మా నియోజకవర్గం లో భూములకు ఓ రేటు ,కొడంగల్ లో ఓ రేటు ఇచ్చి వివక్షత చూపిస్తున్నారు.
యూరియా కోసం మళ్ళీ పాస్ బుక్కులు ఇచ్చి చెప్పులు లైన్లో పెట్టే చంద్రబాబు రోజులు మళ్లీ వచ్చాయి. తన గురువు చంద్రబాబు రోజులను రేవంత్ మళ్ళీ తెచ్చాడు. పాలమూరు బిడ్డని అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చేసిందేమి లేదు.
ఉత్తర కుమారుడిలా మాటలే తప్ప రేవంత్ దగ్గర చేతలు లేవు. పాలమూరు రంగారెడ్డి తో మక్తల్ లో 63 వేల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కొడంగల్ లిఫ్ట్ తో 13 వేల ఎకరాలకు కూడా నీళ్లు రావు ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయండి.ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి , సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు