– ప్రజాస్వామ్యాన్ని రేవంత్ హత్య చేశారు
– డ్రోన్లు మోహరించామన్నారు… ఏం పీకారు?
– బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ ,బీహార్ ఎన్నికలను తలపించే రీతిలో జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో అక్రమాలు జరిగాయి. రేవంత్ రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తేర తీశారు. ఇంత గుండాయిజం ,రౌడీ ఇజం ఎపుడూ చూడలేదు. ఇంత భీభత్సంగా ఎపుడూ ఎన్నికలు జరగలేదు. ఓటుకు పదివేల దాకా పంచారు. చీరలు కూడా లక్ష మందికి పంచారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. ప్రజల పై రేవంత్ రెడ్డి కి విశ్వాసం పోయింది .అందుకే అంతులేని అక్రమాలకు తెరలేపారు. ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పండ్లు తోమినట్టు వ్యవహరించింది. 20 ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదు. బోగస్ ఓటింగ్ ఇంతగా ఎపుడూ జరగలేదు. సబ్బండ వర్గాలు కేసీఆర్ కు ఓటేస్తామని చెప్పాయి. బీ ఆర్ ఎస్ గెలుస్తుందని తెలిసే రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
మా ఎంపీ వద్దిరాజు , ఎమ్మెల్సీ పోచం పల్లి , మాజీ చైర్మన్ ఎర్రోళ్ల పై కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. పాతబస్తీ నుంచి ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారు .ఎం ఐ ఎం ఇందుకు సహకరించింది. మా నేత హరీష్ రావు సమస్యాత్మక పోలింగ్ బూతుల జాబితా సీ ఈ ఓ కు ఇచ్చారు .అయినా చర్యలు లేవు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయించారు. మంత్రుల కో రూలు ,బీ ఆర్ ఎస్ నేతల కో రూల్ అన్నట్టు వ్యవహరించారు. డ్రోన్లు మోహరించామన్నారు. ఏం పీకారు? కాంగ్రెస్ ఏజెంట్లు బూతు ల నుంచే మంత్రులకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. .మంత్రులు పోలింగ్ సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చారు. సజ్జనార్ ,శివధర్ రెడ్డి ఏం చేశారు ? ఎన్నికల కమిషన్ అధికారులు గుండె మీద చేయి పెట్టుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్ని దాష్టీకాలు చేసినా ప్రజలు ఓటింగ్ కు వచ్చారు. ధర్మమే గెలుస్తుందని భావిస్తున్నాం.. దైర్యంగా పని చేసిన బీ ఆర్ ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు.. అక్రమాలకు సహకరించిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదు.
ఏజెంట్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరించారు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
నా రాజకీయ జీవితం లో ఏన్నొ ఎన్నికలు చూశాను .ఈ రోజు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లో జరిగిన అక్రమాలు గతం లో ఎపుడూ జరగలేదు. దొంగ ఓట్లకు పొలీసు అధికారులు ,ఎన్నికల సిబ్బంది సహకరించారు. బీ ఆర్ ఎస్ పై పోలీసులతో దౌర్జన్యం చేయించారు. కాంగ్రెస్ బీజేపీ లు కలిసి బీ ఆర్ ఎస్ ను టార్గెట్ చేశాయి. అన్ని నిబంధనలను కాంగ్రెస్ నేతలు అతిక్రమించారు. అపార్ట్ మెంట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ బూతు ఏజెంట్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరించారు. మంత్రులు గస్తీ లు తిరుగుతూ ఓటర్ల ను ప్రలోభ పెట్టారు. ఎన్నికల కమిషన్ కండ్లు మూసుకుని చెవులు మూసుకుని కాంగ్రెస్ కు సహకరించింది. కేసీఆర్ హయం లో కూడా ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి ..ఇంత దారుణం గా ఎపుడూ జరగ లేదు. ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు ఈ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఓటు వేశారని భావిస్తున్నాం.
ధర్మమే గెలుస్తుంది అని నమ్ముతున్నాం:బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్ రెడ్డి తెర తీశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ 20 వేల దొంగ ఓటర్ల ను ఓటర్ల జాబితా లో చేర్చారని ఆధారాలతో సహా నిరూపించినా చర్యలు తీసుకోలేదు. సీ విజిల్ ఆప్ పని చేయలేదు .ఇంత కన్నా ఘోరం ఉంటుందా ? 13 సంవత్సరాల అమ్మాయితో కూడా కాంగ్రెస్ నేతలు ఓటు వేయించారు. రేవంత్ రెడ్డి తో ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కైంది. దొంగ ఓట్లకు పోలీసులు సహకరించారు. దొంగ ఓటర్ల ను బీ ఆర్ ఎస్ పట్టిస్తే చర్యలు లేవు.ప్రజాస్వామ్యాన్ని రేవంత్ హత్య చేశారు. రేవంత్ ఎన్ని అక్రమాలు చేసినా కేసీఆర్ వైపే ప్రజలు ఉన్నారు బైండ్ ఓవర్ చేసిన చిన్న శ్రీశైలం యాదవ్ యథేచ్ఛగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు మా నేతల మీద చిన్న శ్రీశైలం దాడులు చేసినా ఆయన పై చర్యలు తీసుకోలేదు.
సైలెంట్ ఓటు బీ ఆర్ ఎస్ కే: మాజీ మంత్రి సి .లక్ష్మా రెడ్డి …
మొత్తం యంత్రాంగాన్ని రేవంత్ దుర్వినియోగం చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఎం ఐ ఎం ఈ ఉప ఎన్నికలో కలిసి పని చేయడం విచిత్రం. ఎవరు ఎన్ని మాట్లాడినా బీ ఆర్ ఎస్ పది వేల ఓట్ల మెజారిటీ తోగెలవ బోతోంది. సైలెంట్ ఓటు బీ ఆర్ ఎస్ కే పడింది. కేసీఆర్ వైపు నిలబడ్డ జూబ్లీ హిల్స్ ఓటర్ల కు కృతజ్ఞతలు.
ఓట్ ఖరీదు జరిగింది: మాజీ ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి .రాహుల్ ఓట్ చోరి అని తిరిగారు. ఇక్కడ ఓట్ చోరీ తో పాటు ఓట్ ఖరీదు జరిగింది. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అపుడు ఎమ్మెల్యే ను కొనాలని ప్రయత్నించాడు. 5 వేల దాకా ఒక్కో ఓటుకు తన అవినీతి సొమ్ము ను పంచి పెట్టాడు. ఎన్నికల కమిషన్ అస్సలు పని చేయలేదు. రేవంత్ రెడ్డి అక్రమాలను తెలంగాణ సమాజం మరచిపోదు. ఎన్ని అక్రమాలు చేసినా జూబ్లీ హిల్స్ లో బీ ఆర్ ఎస్ దే విజయం