– ప్రతిపక్షనేతగా ఉన్నచంద్రబాబు విద్యార్థుల తరలింపునకు కృషిచేస్తూ, నిత్యంవారితో మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డేమో కమిటీవేశానంటూ చేతులు దులుపుకొని ఇంట్లో కూర్చున్నాడు
• టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం విద్యార్థులతో జూమ్ ద్వారా మాట్లాడుతూ, వారియోగక్షేమాలు విచారిస్తూ, వారు సురక్షితంగా స్వస్థలాలకు వచ్చేలా చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని వీడియో గేమ్ లు ఆడుకుంటున్నాడు
• ఈ ముఖ్యమంత్రికి విపత్తులు, అనుకోని ఉపద్రవాలు, ఊహించని సంఘటనలు ఎదురైతే ఏంచేయాలో, ఎలా చేయాలో తెలియదు
• ఇప్పుడు యుక్రెయిన్ లోని తెలుగువిద్యార్థులను కాపాడటంలోగానీ, గతంలో ఉత్తరాఖండ్ వరదలు, విశాఖనగరాన్ని హుద్ హుద్ తుఫాన్ ముంచెత్తినప్పుడు గానీ చంద్రబాబు ప్రజలకు బాసటగానిలిచి, వారిని కాపాడిన విధానం ఎప్పటికీ మర్చిపోలేనిది
– టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్
పేద, మధ్యతరగతికి చెందిన తెలుగువిద్యార్థులు ఉన్నత చదువు లకోసం యుక్రెయిన్ దేశానికి వెళ్లారని, అక్కడ ఇప్పుడు నెలకొ న్న భయానకపరిస్థితుల దృష్ట్యా, అన్నిరాష్ట్రాలు వెంటనే స్పందిం చి, యుద్ధప్రాతిపదికన వారిప్రాంతాలకు చెందిన వారిని ఆ దేశం నుంచి వెనక్కురప్పించడానికి కృషిచేస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం చేతులుకాలాక ఆకులుపట్టుకున్నతీరుగా, విద్యార్థుల తరలింపు లో నింపాదిగా వ్యవహరించిందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్య దర్శి బుచ్చిరామ్ ప్రసాద్ ఆక్షేపించారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఆపత్కాలంలో, విపత్తుల వేళ టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు ఎలాస్పందిస్తారో, ఎంత వేగంగా చర్యలకు ఉపక్రమిస్తారో మరోసారి యుక్రెయిన్ ఉదంతంలో బయటపడింది. రాష్ట్రానికి చెంది న విద్యార్థులు యుక్రెయిన్ లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ ప్రా ణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నతరుణంలో చంద్రబాబు గారుమరోసారి తన చాకచక్యంతో వారిని సురక్షితప్రాంతాలకు తర లిపోయేలా చేయగలిగారు. యుక్రెయిన్ లో చిక్కుకున్నతెలుగు విద్యార్థులతో నేరుగా మాట్లాడిన చంద్రబాబుగారు, వారికి అండగా ఉంటానని ధైర్యంచెప్పి, వారిని అక్కడి బంకర్లలో తలదాచుకోవాల ని సూచించారు.
5 రోజులనుంచి అక్కడి విద్యార్థులతో జూమ్ ద్వారా మాట్లాడుతున్న చంద్రబాబుగారు, అటువిద్యార్థులకు జాగ్ర త్తలుచెబుతూ, ఇటు వారి తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, మరోప క్క కేంద్రవిదేశాంగమంత్రి జైశంకర్ తో సంప్రదింపులుజరిపారు. ఇలా ప్రతిపక్షనేత ఏకకాలంలో తెలుగువిద్యార్థులను రక్షించడానికి తనశక్తివంచనలేకుండా కృషిచేస్తే, ముఖ్యమంత్రేమో తాడేపల్లి ప్యాలెస్ లో వీడియోగేమ్ లు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు.
విద్యార్థుల తరలింపు కోసం తూతూమంత్రంగా అధికారులతో ఒకకమిటీ వేసిన జగన్మోహన్ రెడ్డి తనపని అయిపోయిందన్నట్లు గా కూర్చున్నాడు. కానీ చంద్రబాబుగారు యుక్రెయిన్ చుట్టుపక్కల ఉన్నదేశాల్లోని తెలుగువారితో మాట్లాడి, యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగువిద్యార్థులకు అండగా ఉండా లని వారు, సురక్షితంగా తిరిగి రాష్ట్రానికివచ్చేవరకు, మీరంతా కూడా తగిన సహాయసహాకారాలు అందించాలని నిత్యంవిజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 650 మంది తెలుగువిద్యార్థులతోపాటు, ఇతరరాష్ట్రాలకుచెందిన 750 మంది విద్యార్థులు యుక్రెయిన్ నుం చి, రైళ్లద్వారా సురక్షితంగా ఆదేశందాటిబయటకు వచ్చేలా చంద్ర బాబు అహర్నిశలుశ్రమించారు.
1500మంది విద్యార్థులు ఈ రోజురాత్రికి యుక్రెయిన్ సరిహద్దుల్లోకి చేరుకున్నాక, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అధికారులతో కలిసి వారంద రినీ సురక్షితంగా వారివారి ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరు గుతున్నాయి. చంద్రబాబు ఆదేశాలతో ఎన్ఆర్ఐ టీడీపీ విభా గానికి చెందిన అనేకమంది ప్రతినిధులు ఎప్పటికప్పుడు యుక్రె యిన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతూ, ఆదేశసరిహద్దు దేశా లతో మంతనాలుజరుపుతున్నారు.
ఈరాత్రికి యుక్రెయిన్ సరిహద్దులకు చేరుకొనే `1500మంది విద్యార్థుల యోగక్షేమాలపై అక్కడి టీడీపీఎన్ఆర్ఐ విభాగం దృష్టిపెట్టింది. అలానే మరో 100 మంది విద్యార్థులు ఈ సాయంత్రం యుక్రెయిన్ నుంచి బయలుదే రబోతున్నారు. వారిని కూడా సురక్షితంగా తెలుగురాష్ట్రాలకు వచ్చేలా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తగినఏర్పాట్లుచేసింది. అనేక మంది విద్యార్థులు చంద్రబాబుగారితో మాట్లాడినప్పుడు వారంతా భయపడుతున్నామని ఆయనతోచెప్పుకొని బావురుమన్నారు.
వారిలో కొందరు బంకర్లలో ఉన్నామని, తినడానికి తిండి, డబ్బు లేక అవస్థలుపడుతున్నామనిచెప్పగానే చంద్రబాబు వారికి ధైర్యంచెప్పి, స్థానికంగా ఉండే టీడీపీఎన్ఆర్ఐ విభాగంవారితో, ఇతర దేశాల్లోనిఏపీ వారితో మాట్లాడి, యుక్రెయిన్ లో చిక్కుకు న్న విద్యార్థులకు సాయంఅందేలా చూశారు.
ప్రతిపక్షనేతగా ఉన్నవ్యక్తి రోజూ యుక్రెయిన్ లోఉన్న విద్యార్థులతో 5 నుంచి 6 గంటలపాటు మాట్లాడుతూ, వారికి ధైర్యం చెబుతుం టే, ముఖ్యమంత్రిమాత్రం తాడేపల్లి ప్యాలెస్ దాటి కాలుబయట పెట్ట డంలేదు. ముఖ్యమంత్రి వైఖరి, నిర్లక్ష్యం యుక్రెయిన్ లోని ఏపీ వి ద్యార్థులకుశాపంగా మారాయి. చంద్రబాబుగారు ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వంతో, కేంద్రవిదేశాంగమంత్రితో మాట్లాడుతూ, ఏపీతో ఇతరరాష్ట్రాల విద్యార్థులు సురక్షితంగా యుక్రెయిన్ నుంచి బయ టకు వచ్చేలా చేస్తున్నారని చెప్పడానికి గర్వపడుతున్నాం.
ఉన్న త చదువులకోసం యుక్రెయిన్ వెళ్లినవారంతా పేద, మధ్యతరగతి విద్యార్థులేనని భావించిన చంద్రబాబుగారు, వారిప్రాణాలుకాపాడ టంకోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి యుక్రెయి న్ లోని విద్యార్థులతో నేరుగా ఎందుకు మాట్లాడి, వారికి ధైర్యం చెప్పలేకపోయారని తాముప్రశ్నిస్తున్నాం. కమిటీవేశాము.. కేంద్ర మంత్రితో మాట్లాడామని చెప్పి, ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి చేతులుదులుపుకుంటే సరిపోతుందా?
విపత్తులు, ఆపత్కాలంలో ఎలాపనిచేయాలో,పరిస్థితులను ఎలాఎదుర్కోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. చంద్రబాబు గారు అలాంటి పరిస్థితుల్ని సమర్థం గా ఎదుర్కొంటారనిచెప్పడానికి అనేకఉదంతాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ వరదలసమయంలోగానీ, విశాఖనగరాన్ని హుద్ హుద్ ముంచెత్తినప్పడుగానీ ఆయనస్పందించిన తీరు, ప్రజలకు బాసటగా నిలిచిన విధానం ఎప్పటికీ మర్చిపోలేనిది.
యుక్రెయిన్ లోని తెలుగువిద్యార్థులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని , చంద్రబాబుగారు మిమ్మల్ని సురక్షితంగా తరలిస్తారని విద్యార్థులకు తెలియచేస్తున్నాం. అలానే సైనికులదాడిలో మరణించిన కర్ణాటకకు చెందిన నవీన్ అనేవిద్యార్థి కుటుంబానికి చంద్రబా బు తరపున, టీడీపీ ఎన్ఆర్ ఐ విభాగం తరుపున సానుభూతి తెలియచేస్తున్నాం.