Suryaa.co.in

Andhra Pradesh

నేరాలు, అవినీతి తప్ప జగన్ కు ఏం తెలుసు?

– తన క్రిమినల్ మైండ్ తో 4 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 31 కేసులున్న జగన్, 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడా?
• నా వెంట్రుక పీకలేరు అని విర్రవీగిన జగన్ వెంట్రుకలు 108 నియోజవర్గాల ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీకేశారు.
• అహంకారికి అధికారమిచ్చిన ఫలితాన్ని ప్రజలు, రాష్ట్రం అనుభవిస్తున్నాయి
– సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి), కాలవ శ్రీనివాసులు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి), నిమ్మల రామానాయుడు (టీడీపీ శాసనసభ్యులు), కొనకళ్ల నారాయణరావు (మాజీఎంపీ), వంగలపూడి అనిత (తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు), డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ శాసనసభ్యులు), గుమ్మడి సంధ్యారాణి (మాజీఎమ్మెల్సీ) దేవినేని ఉమామహేశ్వరరావు (మాజీమంత్రి)

క్రైమ్, కరెప్షన్ తో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, ఏపీ కంటే బీహార్ నయమనుకునే పరిస్థితి ఏర్పడిందని, బీహార్లో పాలన మెరుగుపడితే, రాష్ట్రంలో దురదృష్టకరపాలన సాగుతోం దని, ఒకవైపు మీ బిడ్డనుఅంటూనే, మరోపక్క దుష్టచతుష్టయం అని ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఇతర టీడీపీనేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …

31కేసులున్న జగన్, రాష్ట్రాన్ని 30ఏళ్లు పరిపాలిస్తానని చెప్పడం సిగ్గుచేటు – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
“జగన్ బరితెగించి మాట్లాడుతున్నాడు. 11 సీబీఐకేసులు, 7ఈడీకేసులు, కిందకోర్టుల్లో 13కే సులు మొత్తంకలిపి 31కేసులున్న జగన్, తాను రాష్ట్రాన్ని 30ఏళ్లపాటు పాలిస్తాననిచెప్పడం సిగ్గుచేటు. సింగిల్ గా వస్తాను.. మీరు సింగిల్ గా రావాలంటున్న జగన్ నిజంగానే సింగిల్ అయ్యాడు. అమ్మ వెళ్లిపోయింది. చెల్లి లేదు. మరోచెల్లి జగన్ పైన, అతనిబృందంపైనే కేసులు పెట్టి, న్యాయస్థానాల్లో పోరాడుతోంది. తమ్ముడు సొంతబాబాయ్ ని చంపిన కేసులో ఇరుకు న్నాడు.మరో బాబాయ్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. ఇలా అందర్నీ పోగొట్టుకున్న జగన్ నిజం గానే ఒంటరివాడు అయ్యాడు. ఇప్పటికే జగన్ సింగిల్ కాదని 108 నియోజకవర్గాల ఓటర్లు తేల్చేశారు.

గూగుల్ లో 6093 అని కొడితే జగన్ నిజస్వరూపం తెలుస్తుంది
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని తప్పుడు కేసులు టీడీపీనేతలు, కార్యకర్తలపై పెట్టాడో చెప్పాల్సిన పనిలేదు. సొంతపార్టీ ఎమ్మెల్సీ దళితయువకుడిని చంపి, జైలుకెళ్లి తిరిగొస్తే అత నికి ఘనస్వాగతం పలికారు. కోడికత్తి డ్రామాలో భాగస్వామి అయిన శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీ అభిమాని అని ఎన్.ఐ.ఏ తేల్చింది. ఆకేసులో కోర్టువాయిదాలకు కూడా హాజరుకాని స్థితిలో జగన్ ఉన్నాడు. తాను పెట్టినకేసుల్లో తానే కోర్టులకు వెళ్లకుండా ముఖంచాటేస్తున్నాడు. గూ గుల్ లో 6093 అని కొడితే, జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిపోతోంది. జగన్ తాతయ్యది హత్య, బాబాయ్ ది హత్య, మామయ్యది అనుమానాస్పద మృతి, చిన్నాయన భాస్కర్ రెడ్డి అరెస్ట్, రేపోమాపో తమ్ముడి అరెస్ట్, జగన్ ప్రియశిష్యుడు శంకర్ రెడ్డి 22నెలలుగా జైల్లోనే ఉన్నాడు. అదీ జగన్ పరిస్థితి.

 31 క్రిమినల్ కేసులున్నాయని, 16నెలలు జైల్లో ఉండివచ్చాడని పొగడాలా?
మా పరిస్థితి ఎలా ఉందో తలైవా రజనీకాంత్ గారే చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భం గా రాష్ట్రానికి వచ్చిన రజనీకాంత్ గారు, చంద్రబాబుగారిని, ఆయనపాలనని మెచ్చుకుంటే, జగన్ తనమంత్రులతో ఇష్టమొచ్చినట్టు తిట్టించాడు. జగన్ ను పొగిడేవాడు లేడు. పొగడటా నికి ఏమైనా ఉంటేకదా! 31కేసులు, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప జగన్ కు ఏముంది? 31 కేసులు పెట్టుకొని, 16నెలలు జైల్లో ఉండొచ్చి, 30ఏళ్లు పరిపాలిస్తానని సిగ్గు, శరంలేకుండా మాట్లాడుతున్నాడు. నా వెంట్రుక పెరకలేరు అన్నాడు. 108 నియోజకవర్గాలప్రజలు ఇప్ప టికే పెరికి చూపించారు.

రాష్ట్రంలో మైనింగ్ చట్టం జగన్ కాళ్లకింద నలిగిపోతోంది
రాష్ట్రంలో మైనింగ్ చట్టం జగన్ కాళ్లకింది నలిగిపోతోంది. సిలికా, గ్రానైట్, ఇతరఖనిజాల దోపి డిలో జగన్ మునిగితేలుతున్నాడు. ఈ విధంగా అడ్డగోలుగా ప్రజలసొమ్ము, రాష్ట్రసంపద దిగ మింగుతున్నాడు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ , ఈవిధంగా డబ్బుదోచేసి ఏంచేసుకుంటాడు? రూ.43వేలకోట్లను జగన్ దోచుకున్నాడని సీబీఐ ఛార్జ్ షీట్ వేసినా, సిగ్గులేకుండా పంచతం త్రం కథలు చెబుతున్నాడు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకపోయినా, రాజ్యాంగానికి విలువలేకున్నా కేంద్రం ఎందుకు స్పందించదు?
తాడేపల్లి ఫైల్స్ అని సినిమాతీస్తే, తాడేపల్లి ఫైల్స్ -1, 2, 3, 4 అని తీసినా జగన్ చరిత్ర, మరీ ముఖ్యంగా ఆయన రక్తచరిత్ర చెప్పడానికి సరిపోవు. దర్శకులు ఎవరూ సరిపోరు. మా పార్టీ వారిపై దాడిచేస్తూ తిరిగివారిపైనే తప్పుడుకేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికిబట్టకట్టడంలేదు. రాజ్యాంగానికి విలువలేదు. రాష్ట్రంలో ఇంతజరుగుతున్నా కేంద్రం స్పందించదు. రాష్ట్రంలో దేనికి విలువ ఉందో కేంద్రంచెప్పాలి. 14వ, 15వ ఆర్థికసంఘానికి విలువలేదు. సర్పంచ్ లు మేం ఎందుకు పనికిరాని వాళ్లమై పోయామని మొత్తుకుంటున్నా రు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ పాపాలు పండాయని గుర్తుంచుకోండి. మా పెద్దాయన శతజయంతి ఉత్సవాలు ముగిసేసమయానికి మీకు, మీప్రభుత్వానికి మూడుతుంది. ప్రజలు మీకు తగినగుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ రౌడీయిజం, అరాచకాలు, కిరాతకం ఇంకసాగదు. జగనన్నే మా నమ్మకం అనేస్టిక్కర్లు ఇళ్లగోడలపై అతి కించడం కాదు. ఆస్టిక్కర్లను జగన్ చెల్లెళ్లు షర్మిల, సునీతలు వారిఇంటిగోడలపై అతింకిం చుకుంటే, అప్పుడు అతన్ని నమ్మాలో లేదో ప్రజలుకూడా ఆలోచిస్తారు.”

4ఏళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రూ.లక్షా27వేలకోట్లు కొట్టేసిన, అసలు సిసలు ఆర్థిక ఉగ్రవాది జగన్ – కాలవ శ్రీనివాసులు
“జగన్ ఒక ఆర్థికనేరస్తుడు. కొందరు ఆర్థికఉగ్రవాది అంటారు. మరికొందరు తండ్రి అధికా రా న్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు సంపాదించాడంటున్నారు. సీబీఐ స్వయంగా రూ.43వేలకోట్లు జగన్ దోచేశాడని నిగ్గుతేల్చింది. అహంకారికి అధికారమిస్తే ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం. ఈ విషయం పెద్దలు ఎప్పుడో చెప్పారు. అహంకారి, ఆర్థికఉగ్రవాది అయిన జగన్ రాష్ట్ర దుర దృష్టంకొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు. వ్యవస్థలను సర్వనాశనంచేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కు సంబంధించే రూ.లక్షా27వేలకోట్ల దోపిడీ జరిగింది. అవికాక 13 అంశాల్లో జగన్, అతని అనుచరులు, మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోచేశారు. జగన్ తీసుకొచ్చిన సెంటుపట్టాపంపిణీ పథకమే పెద్దకుంభకోణం. దానిలో రూ.7వేలకోట్లు దోచేశారు. అవికాక రాష్ట్రంలోని భూముల్ని, విశాఖపట్నంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని కొల్లగొట్టారు. వేలఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇవన్నీ కలిపితే కేవలం భూములద్వా రానే జగన్, అతనిప్రభుత్వం రూ.40వేలకోట్లు దోచేసింది. 4ఏళ్లలో ఇసుకమాఫియాతో రూ.10వేలకోట్లు కాజేశారు. మైన్స్ దోపిడీకి అంతేలేదు. జగన్మో హన్ రెడ్డి తమ్ముడినుంచి వై.వీ.సుబ్బారెడ్డి వరకు ఎన్నో పెద్దతలకాయలు మైనింగ్ మాఫి యాలో ఉన్నాయి. అటవీచట్టాలు, గిరిజన చట్టాలను ఉల్లంఘించి యథేచ్ఛగా సాగించిన మైనింగ్ దోపిడీలో రూ.35వేలకోట్లు కొల్లగొట్టారు. మద్యం కుంభకోణం ద్వారా జగన్ , అతని ప్రభుత్వంలోని వారు రూ.40వేలకోట్లు దిగమింగా రు. ఈ నాలుగువిభాగాల్లోనే రూ.లక్షా27వేలకోట్లు కొట్టేసిన జగన్ ఆర్థికఉగ్రవాది కాదా?

జగన్ అవినీతికేసులవిచారణ సందర్భాల్లో సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు చేసినవ్యాఖ్యలే జగన్ దోపిడీకి నిలువెత్తు నిదర్శనం
జగన్ కేసులు విచారణకు వచ్చినసందర్భాల్లో గానీ, 2012లో బెయిల్ కోసం జగన్ పిటిషన్లు వేసిన సందర్భంలోగానీ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు జగన్ ఆర్థికనేరాలకు నిదర్శనాలుగా నిలిచాయి. “ఒకవ్యక్తి కేవలం 10సంవత్సరాల్లో వేలకోట్లు ఎలాసంపాదించాడు.. దర్యాప్తు పూర్తయ్యేవరకు బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదు”అని 2012 అక్టోబర్ 5న సుప్రీంకోర్టు వ్యా ఖ్యానించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆఫ్తాబ్ ఆలం గారు, 2012 సెప్టెంబర్ 14న “ఇంత తక్కువ వ్యవధిలో రూ.43వేలకోట్లు ఎలా వచ్చాయి.” అని వ్యాఖ్యానించారు. అలానే “ఆర్థిక నేరాలు దేశఆర్థిక ఆరోగ్యానికి పెనుప్రమాదంగా పరిణమించాయి.” అని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు ఇన్నివ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే 2013 సెప్టెంబ ర్ 23న బెయిల్ పై విడుదలైన ఒకవ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.

లక్షా27వేలకోట్ల జగన్ దోపిడీ నిజం. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా టీడీపీ మాట్లాడదు
తన మనస్తత్వాన్ని, ఆలోచనల్ని, నేరగ్రస్త వ్యవహారాల్ని ఎక్కడా మానుకోకుండా, వాటన్నిం టినీ విస్తృతంచేసి ఇప్పుడు రాష్ట్రాన్ని లూఠీచేస్తున్నాడు. గతంలో జగన్ రూ.లక్షకోట్లుకొట్టేశా డనిచెప్పాము. సీబీఐ అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రూ.43వేలకోట్లు కొట్టేశాడు అని తేల్చింది. ఈనాడు జగన్ రూ.లక్షా27వేలకోట్లు కొట్టేశాడు అని చెబుతున్నది కూడా వా స్తవం. మేం ఆధారాలులేకుండా మాట్లాడం. జరుగుతున్నదోపిడీ, మార్కెట్ రేట్లకు విక్రయిస్తు న్నధరలకు మధ్యవ్యత్యాసం గమనిస్తే మేంచెప్పిన నాలుగుఅంశాల్లో రూ.లక్షా27వేలకోట్ల దోపిడీ జరిగింది.

విచ్చలవిడిగా ప్రజాధనం దోచేస్తూ, ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ కు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలోకూర్చునే అర్హతలేదు
సరస్వతి పవర్ కు ముఖ్యమంత్రి హోదాలో జగన్ నీళ్లు కేటాయించుకున్నాడు. జీవితకాలం నీటిసరఫరా జరిగేలా, స్వీయప్రయోజనాలకోసం ఆర్డర్లు ఇచ్చాడు. సరస్వతి పవర్ లోజరిగిన వ్యవహా రమే జగన్ దోపిడీ కి పెద్దసాక్ష్యం. జగన్ఇప్పటికే దర్యాప్తుసంస్థల విచారణలో దోషిగా నిలిచాడు. న్యాయస్థానాలు అతన్ని దోషిగా తేల్చడానికి ఎక్కువ సమయం పట్టదు. అడుగ డుగునా ఆర్థికనేరాలకు పాల్పడుతూ, విచ్చలవిడిగా ప్రజాధనందోచేస్తూ, ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కక్షణంకూడా ముఖ్యమంత్రి కుర్చీలోకూర్చునే అర్హతలేదు. జగనాసుర రక్త చరిత్రతోపాటు, జగనాసుర అవినీతిచరిత్రను కూడా ప్రజల్లోకి ప్రబ లంగా తీసుకెళ్లి, వారిని చైతన్యవంతుల్ని చేసి, ప్రజాస్వామిక శక్తుల్నికూడగట్టి, తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటంచేస్తుంది.”

తన చేతికి మట్టి అంటకుండా నేరాలు, అవినీతిచేయడంలో జగన్ దిట్ట – నిమ్మల రామానాయుడు
“ప్రపంచంలోనే అత్యంత చాకచక్యమైన క్రిమినల్ జగన్. అతని చరిత్ర, అతని అవినీతి అంతా మిక్కిలి ఆసక్తికరం. తనచేతికి మట్టిఅంటకుండా నేరాలు, దోపిడీచేయడంలో జగన్ దిట్ట. తన కుటుంబ సభ్యుల్నికూడా అలానే వాడుకొని వదిలేశాడు. క్రిమినల్, కరప్షన్ చేసేవారికి జగన్ పెద్దకేస్ స్టడీ. ఆయనక్రిమినల్ చరిత్రకు పెద్ద ఉదాహరణ సొంతబాబాయ్ ని అత్యంతకిరాతకం గా చంపి, శవరాజకీయాల్లో తానే నేర్పరినని రుజువు చేసుకున్నుడు. మృతదేహాంపై ఉన్న గాయాలకు కట్లుకట్టించి, కుట్లువేయించి, శవాన్ని ఫ్రీజర్ బాక్స్ లోపెట్టిం చి, పూలదండలతో అలంకరించి, గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చిన వ్యక్తి రాష్ట్రానికి ము ఖ్యమంత్రిగా అవసరమా అని ప్రజలు ఆలోచించాలి. బాబాయ్ ని హత్యచేశారని ప్రజలంతా అనుకుంటుంటే, దానికిమసిపూసి మారేడుకాయచేసి, నారాసుర రక్తచరిత్ర అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నంచేశాడు. వివేకాను హత్యచేసినప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్ , ముఖ్యమంత్రి అయ్యాక కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కుతీసుకున్నాడు. చంద్రబాబు హత్యకేసుదర్యాప్తుకోసం నియమించిన సిట్ ను నీరుగార్చాడు.

సిట్ కు నేత్రత్వం వహి స్తున్న డీఐజీస్థాయి అధికారిని తప్పించి, ఎస్పీస్థాయి అధికారిని నియమించాడు. కేసువిచా రిస్తున్న సీబీఐ అధికారిపైనే తప్పుడుకేసులు పెట్టించాడు. వివేకాహత్యకేసువిచారణలో సీబీ ఐ రోజురోజుకో హంతకుడిని ప్రజలముందు పెడుతూ విచారణ సాగిస్తోంది. సీబీఐ అవినాశ్ రెడ్డి అనే తీగలాగితే తాడేపల్లి డొంక కదిలింది. తనను తాను కాపాడుకోవడాని కి చనిపోయిన సొంతబాబాయ్ వ్యక్తిత్వాన్ని కూడా మంటగలిపేందుకు వెనుకాడని స్వభావ మున్న జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? సీబీఐ అవినాశ్ రెడ్డి తీగలాగితే, తాడేపల్లి డొంక కదిలింది. జగన్ రెడ్డి, ఆయనసతీమణి భారతి రెడ్డికి హత్యజరిగిననాటి రాత్రి అవినాశ్ రెడ్డి ఫోన్లుచేసి మాట్లాడాడని సీబీఐ తేల్చింది. దాంతో జగన్, అవినాశ్ రెడ్డిని రక్షించే కుట్రకు తెరలేపాడు. అందుకే ఆఘమేఘాలమీద ప్రత్యేకవిమా నంలో ఢిల్లీకి పరుగులుపెట్టాడు.

వివేకాహత్యకేసునుంచి తాను బయటపడటంకోసం ఆఖరికి జగన్, చనిపోయినవ్యక్తి క్యారెక్టర్ ను దిగజారుస్తున్నాడు. సునీల్ యాదవ్ తల్లితో వివేకాకు అక్రమసంబంధం ఉందని, ఉమాశంకర్ రెడ్డి భార్యతో అక్రమసంబంధం ఉందని అఫిడవిట్లు వేయించే దుస్థితికి జగన్ వచ్చాడు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిల కుటుంబంలోని వా రితో వివేకాకు అక్రమసంబంధముంటే, వారినే కాపాడటానికి జగన్ కోర్టుల్లో తప్పడు పిటిషన్లు వేయిస్తూ, నిమిషానికి లక్షలు తీసుకునేన్యాయవాదుల్ని ఎందుకు నియమించాడు ? ఆఖరికి వివేకాకుమార్తె డాక్టర్ సునీతే ఆస్తికోసం తనతండ్రిని చంపింది అనేంత నీచస్థితికి జగన్ వచ్చాడు. జగన్ వ్యాఖ్యల్ని ఆయనసొంతచెల్లి షర్మిలే తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి.

కేవలం మద్యం అమ్మకాలతోనే జగన్ 4ఏళ్లలో రూ.40వేలకోట్లు కొట్టేశాడు
నేరాలే కాదు..కరప్షన్ (అవినీతి)లో కూడా జగన్ తనకుతానే సాటి. 2019 జూన్ నుంచి 2023 మార్చివరకు రాష్ట్రంలో రూ.92,240కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కానీ అనధికా ర లెక్కలప్రకారం రూ.లక్షా 22వేలకోట్ల విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. మద్యం విక్రయా ల్లోనే జగన్ దాదాపు రూ.30వేలకోట్లు జగన్ కొట్టేశాడు. వాటికి అదనంగా కమీషన్ల రూపంలో మరో రూ.10వేలకోట్లుకలిపి మొత్తంగా జగన్ మద్యం అమ్మకాలతోనే రూ.40వేలకోట్లు కాజేశాడు. పేదల జేబులతోపాటు, వారిప్రాణాలు కూడా జగన్ కొట్టేస్తున్నాడు. ఇలాంటి మోసకారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? మద్యం ఆదాయాన్ని 15ఏళ్లపాటు తాకట్టుపెట్టి రూ.25 వేలకోట్ల అప్పులుతెచ్చాడు. మహిళల మాంగల్యాలు తాకట్టుపెట్టి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మహిళాద్రోహి జగన్. మద్యంపై వచ్చే ఆదాయంతోనే అమ్మఒడి, ఆసరా, పింఛన్ పథ కాల్ని జగన్ అమలుచేస్తున్నాడు. దానికి సంబంధించి ఏకంగా అసెంబ్లీలోనే బిల్లుపెట్టాడు.

జగన్ కు నెలనెలా ఇసుక దోపిడీ కప్పంకట్టలేక ప్రేమరాజ్ అనేవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా డు. జగన్ ఇసుకదోపిడీ వందలాది భవననిర్మాణ కార్మికులు ఉసురుతీసింది
ఇళ్లస్థలాల ముసుగులో ఎందుకూపనికిరాని సెంటుపట్టాలు, ముంపుప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చి, వైసీపీనేతలు కొండంత దోపిడీచేసి, పేదలకు గోరంతన్యాయం చేశారు. నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చి, దాన్నికూడా ఆదాయవనరుగా మార్చి వందలాది భవననిర్మాణ కార్మికు ల ఉసురుతీశాడు. తనబినామీ సంస్థ జేపీ పవర్ వెంచర్స్ కు రాష్ట్రంలోని 384 ఇసుక ర్యాం పుల్ని కట్టబెట్టిన జగన్, యథేచ్ఛగా ఇసుకదోపిడీకి పాల్పడుతున్నాడు. 4ఏళ్లలో ఇసుక ద్వారానే వేలకోట్లు కొట్టేశాడు. రాష్ట్రంనుంచి రోజుకి 2వేలలారీలఇసుక ఇతరరాష్ట్రాలకు తరలి పోతోంది. గోదావరిజిల్లాల్లో నెలనెలా జగన్ కు ఒక్కోఇసుకరీచ్ నుంచి నెలకు రూ.22కోట్లు కప్పంకట్టాలి. 1వ తేదీన ఠంఛన్ గా కప్పంకట్టాల్సిందే. ఆ విధంగా సరైనసమయంలో రూ.22 కోట్లుకట్టలేక, అధికారపార్టీ వేధింపులు భరించలేక ప్రేమరాజ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 16నెలలు జైల్లో ఉన్నవ్యక్తి, 11 ఛార్జ్ షీట్లలో ఏ1గా ఉన్నవ్యక్తి, 10 సంవత్సరాలనుంచి బెయిల్ పై బయటున్న వ్యక్తి, 29రాష్ట్రాలముఖ్యమంత్రులకంటే అత్యంతధనవంతుడైన వ్యక్తి.. ఇన్ని గొప్పతనాలు జగన్ రెడ్డికే సాధ్యం. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్ర పంచానికి ఎలాంటి సంకేతాలువెళతాయో ప్రజలే ఆలోచించాలి.”

అభివృద్ధిలో ముందుండాల్సిన రాష్ట్రాన్ని, అవినీతి, నేరాల్లో ముందుఉంచిన ఘనుడు జగన్ – కొనకళ్ల నారాయణరావు
“జగన్ ముఖ్యమంత్రికాకముందే ఆర్థికనేరస్థుడిగా 16నెలులు జైల్లో ఉండివచ్చాడు. దానికం టే ముందు పరిటాలరవి హత్యకేసులో ముద్దాయి. అతన్ని కాపాడటానికి చాలాశ్రమపడాల్సి వచ్చిందని గతంలో ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఒకసందర్భంలో చెప్పారు. ప్రజాస్వామాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే, నియంత్రత్వ పాలనతో, క్రిమినల్ మనస్తత్వంతో ప్రశ్నించేవారిని బలిచేస్తూ, రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు. రాష్ట్రపరువు ప్రతిష్టల్ని ది గజార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధిలో ముందుండాల్సిన రాష్ట్రాన్ని, అవినీతి, అరాచకా ల్లో ముందుంచిన ఘనుడు జగన్. అలాంటి వ్యక్తిని మరలా ప్రజలు ఎన్నుకోవాలా?

సొంత బాబాయ్ ని చంపేసి గుండెపోటు అనిచెప్పాడు. వివేకానందరెడ్డి హత్యజరిగినప్పుడు సీబీఐ విచారణకోరిన జగన్, ముఖ్యమంత్రికాగానే వద్దనుకున్నాడు. ఇప్పటికీ వివేకాహత్య కేసునుంచి తనతమ్ముడిని కాపాడుకోవడానికి ఎన్నోప్రయత్నాలుచేస్తున్నాడు. నేరాలు, అవి నీతే జగన్ ధ్యేయం. ఆరెండే అతన్నినడిపించే ఇంధనాలు. అలాంటి వాడిని ముఖ్యమంత్రిని చేస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలావరకు ప్రజలకు అర్థమైంది. నేరసామ్రాజ్యాన్ని నెలకొల్పి దాని ముసుగులో రాష్ట్రాన్నిదోచుకుంటున్న జగన్, అతని ప్రభుత్వం, పార్టీవారిని ప్రజలే తరి మికొట్టాలి. రాష్ట్రాన్ని, ప్రజాస్వామాన్ని కాపాడుకోవడానికి ప్రజలు నడుంబిగించాల్సిన సమ యం వచ్చింది.”

అక్కచెల్లెమ్మలకు అండగా ఉండటమంటే వారిసొమ్ము తినడమా జగన్ రెడ్డి?, డ్వాక్రా మహిళల సొమ్ముతింటున్న జగన్ బతికి బట్టకడతాడా? : వంగలపూడి అనిత
“జగనాసుర రక్తచరిత్ర గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు, గ్రంథాలు వేయాల్సిందే. జగన్ ను నమ్మి ఒక్కఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రంలోని ఆడబిడ్డల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇంట్లో బతకలేక, బయటకురాలేక, కుటుంబాన్ని పోషించు కోలేక, బిడ్డల్ని పెంచలేక నానాఅవస్థలుపడుతున్నారు. భర్తలు కళ్లముందే కల్తీమద్యం తాగు తుంటే, ఉపాధి, ఉద్యోగాలులేక బిడ్డలు గంజాయికి బానిసలైతే ఆడబిడ్డలు ఎలా సంతోషంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. మద్యపాననిషేధం చేస్తానని చెప్పి మహిళల జీవితాల్ని నాశనంచేసిన జగన్ ను మించిన రాక్షసుడు, కీచకుడు ఎక్కడా ఉండడు.

మద్యపాననిషేధం అనిచెప్పి జగన్ మహిళల్ని మోసగించాడు. మహిళల్ని మోసగించడం జగన్ ఇప్పటివరకు చేసిననేరాల్లోనే అతిపెద్దనేరం. వారిని అడ్డంపెట్టుకొనే జగన్ తన రాజకీయాలు చేస్తున్నాడు. జగన్ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలపై మహిళ లపై దురాగతాలకుపాల్పడిన కేసులున్నాయి. అలాంటి వారిని ప్రోత్సహిస్తున్న జగన్ మహిళల్ని ఉద్ధిరిస్తాననడం సిగ్గుచేటు. జగన్ కీచకపాలనలో మహిళలపై రోజుకి 3 అఘాయిత్యా లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి8గంటలకు మహిళలు, చిన్నారులపై ఒక అఘాయిత్యం జరుగుతోంది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారమే ఈ వాస్తవాలు చెబుతున్నాం. పార్లమెంట్ సాక్షి గా కేంద్రమే ఈ వాస్తవాలు బయటపెట్టింది. జగన్ కేబినెట్ లోని మంత్రులే మహిళల్ని అసభ్యకరంగా దూషిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళల్ని అవమానిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ ను మహిళలు నమ్మాలా?

మద్యపాననిషేధం అమలు చేస్తా ననిచెప్పిన జగన్, నవరత్నాల లోగోలో దానికి స్థానమే లేకుండా చేశాడు. ఒకరోజు రాష్ట్రంలో మద్యం అమ్మితే తాడేపల్లిలోని భారతిఖాతాకు రూ.28కోట్లు పోతున్నాయి. మద్యం అమ్మకా లను బడ్డీకొట్లలోకూడా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగనే. కొన్నాళ్లలో ఇంటింటికీ మద్యం పథకాన్ని అమలుచేసినా చేస్తాడు. మద్యం అమ్మకాలపై రోజుకి రూ.28కోట్లు కొట్టేస్తూ, ఆడబిడ్డల మానప్రాణాలు హరిస్తున్న జగన్ కంటే కీచకుడు, దుర్మార్గుడు, రాక్షసుడు ఎవరైనా ఉంటారా? జగనాసుర రక్తచరిత్రే జగన్ ఎలాంటి వాడో చెబుతుంది. ఆసరా పథకం కింద మహిళల అకౌంట్లలో డబ్బులువేశానంటున్నాడు. ఆయన బటన్ నొక్కి న తర్వాత మహిళల అకౌంట్లలో రూపాయి పడలేదు. డ్వాక్రామహిళల సొమ్మునికూడా కొ ట్టేస్తున్న ఏకైకముఖ్యమంత్రి జగన్ ఒక్కడే. ఆడిటింగ్ పేరుతో ప్రతిడ్వాక్రాగ్రూప్ నుంచి జగన్ రూ.1000కొట్టేస్తున్నాడు. టీడీపీప్రభుత్వంలో ప్రభుత్వసొమ్ముతోనే డ్వాక్రాసంఘాలఆడిటింగ్ నిర్వహించారు. సభ్యులనుంచి డబ్బుతీసుకోలేదు.

మహిళామార్ట్ లు పెట్టడానికి కూడా జగన్ ప్రతి డ్వాక్రాసభ్యురాలి నుంచి రూ.300లు తీసు కుంటున్నాడు. ఆ విధంగా మహిళలనుంచే రూ.300కోట్లు కొట్టేసేందుకు జగన్ సిద్ధమయ్యా డు. ఆడబిడ్డల సొమ్ముతో మార్ట్ లు నువ్వుపెట్టేదేంటి జగన్ రెడ్డి? నువ్వుచెప్పే మార్ట్ లలోనే సరుకులు కొనాలని మహిళల్ని బెదిరించడం ఏమిటి? ఆ మార్ట్ లలో సరుకులు ఎక్కువధర లకు అమ్మినా అక్కడే కొనాలనడం ఏమిటి? డ్వాక్రా మహిళలకు రూ.3లక్షల వడ్డీలేని రుణా లిస్తానన్నహామీ ఏమైందో జగన్ చెప్పాలి. డ్వాక్రామహిళలకు చేస్తానన్న రుణమాఫీ ఊసే లేదు. ఆడవాళ్ల సొమ్ము తింటున్న జగన్ బతికి బట్టకడతాడా? ఆడబిడ్డల సొమ్ము తినడంతప్ప…. వారి రక్షణగురించి జగన్ ఏమాత్రం పట్టించుకోడు. మహిళల రక్షణలో విఫలమైన జగన్ ను నిలదీయడానికిముందు, ఆడబిడ్డలంతా ఆయన భార్య శ్రీమతిభారతిని నిలదీయాలి. ఆమెతన భర్త చొక్కాపట్టుకొని మహిళల్ని ఎందుకిలా వేధిస్తున్నావు అని నిలదీయాలి. జగన్ అరాచకపాలనకు ముగింపు పలకాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది.”

దళితుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులుకేటాయించడం తప్ప, రూపాయి ఖర్చుచేయని ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే. చంద్రబాబు దళితులకోసం అమలుచేసిన పథకాల్ని రద్దుచేసిన జగన్ ను మించిన దళితద్రోహి ఎవరుంటారు? – డోలా బాలవీరాంజనేయస్వామి
“దళితుల్ని నమ్మించి, వంచించి అధికారంలోకి వచ్చిన జగన్, అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వారిని హింసిస్తూనే ఉన్నాడు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరునికూడా తీసేసి విదేశీ విద్య పథకానికి జగన్ తనపేరుపెట్టుకోవడం అత్యంతదారుణం. రాజధాని అమరావతిలో చంద్రబాబునాయుడుగారు 125అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేయాలని భావిస్తే, జగన్ అధికారంలోకి రాగానే దాన్ని విజయవాడలోపెడతాననిచెప్పి, దళితుల్ని వంచించాడు . రూ.33వేలకోట్ల ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లించిన దళితద్రోహ జగన్ రెడ్డి. 2014-18 మధ్యలో టీడీపీప్రభుత్వం రూ.40,252కోట్లు దళితులసంక్షేమానికి కేటాయించి, రూ.37, 173కోట్లు ఖర్చుచేసింది.

అంటే సుమారుగా 92శాతం ఖర్చుచేసింది. జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దళితులకోసం రూ.60,207కోట్లు కేటాయించి, కేవలం రూ.30,008కోట్లు మాత్ర మే ఖర్చుపెట్టింది. పేరుకే బడ్జెట్లో నిధులు కేటాయించడం తప్ప, జగన్ వారికోసం ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుచేయలేదు. జగన్ కావాలనే చంద్రబాబు, లోకేశ్ లపై విషప్రచారంచేస్తున్నాడు. దళితుల్ని టీడీపీకి దూరంచేయడానికే జగన్, మంత్రి ఆదిమూలపుసురేశ్ లు యర్రగొండపా లెంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడిచేయించారు.

చంద్రబాబు దళితవిద్యార్థులకోసం అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను జగన్ రద్దు చేశాడు. జగన్ నిర్వాకంతో 16లక్షలమంది దళితబిడ్డలు కార్పొరేట్ విద్యకు దూరమయ్యారు. ఎన్టీఆర్ దళితవిద్యార్థులకోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తే, చంద్రబాబు వాటిసంఖ్య ను మరింత పెంచాడు. జగన్ రాగానే 4వేలమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యేలా గురు కులపాఠశాల వ్యవస్థను నీరుగార్చాడు. ఎస్సీ కార్పొరేషన్ ను మూడుముక్కలుచేసిన జగన్ 4ఏళ్లలో దళితులకు రూపాయి ఇవ్వకుండా వారిని వంచించాడు. జగన్ ప్రభుత్వంలో పేదల బతుకులు దినదినగండంగా మారాయి. రోజుకి 7గురునిరుపేదలు ఆత్మహత్యలుచేసుకుంటున్నారు అన్న ఎన్.సీ.ఆర్.బీ నివేదికపై ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతాడు? సలహాదారుల్లో దళితులు, గిరిజనుల్ని నియమించకుండా, మేథావులు, సమర్థుల్నే నియమించామన్న జగన్ వ్యాఖ్యలు ఎస్సీఎస్టీలను ఘోరంగా అవమానించడమే.

ఎస్సీల్లో సమర్థులు, మేథావులు అని జగన్ అసెంబ్లీలో మాట్లాడి, దళితుల్ని దారుణంగా అవ మానించాడు. ప్రభుత్వసలహాదారుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు అవకాశమివ్వలేదని అసెంబ్లీ లో ప్రశ్నిస్తే, సమర్థులు, మేథావుల్నే సలహాదారులుగా నియమించామని జగన్ అనడం దళితుల్ని, గిరిజనుల్ని అవమానించడం కాదా? దీనిపై ప్రతిదళితుడు, గిరిజనుడు ఆలోచన చేయాలని కోరుతున్నాను. కపటప్రేమతో, కనిపించని సంక్షేమంతో జగన్ ఎస్సీఎస్టీలను ఎ క్కువకాలం మోసగించలేడు. చంద్రబాబు దళితుల్ని పారిశ్రామికవేత్తల్నిచేయడంకోసం తీసు కొచ్చిన నూతన పారిశ్రామికపాలసీని కూడా జగన్ రద్దుచేశాడు.
కల్తీమద్యంతో దళితుల ఆరో గ్యంతో ఆటలాడుతూ, వారిప్రాణాలు తీస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే. నాలుగేళ్లలో జగన్ ఒక్కదళితవాడలో ఒక్కసిమెంట్ రోడ్డు వేశాడా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తనపార్టీ వారు కాదని జగన్ అన్నాడు. ఆ ఓటర్లలో ఎక్కువమంది దళితులే ఉన్నారని జగన్ గ్రహిస్తే మంచిది. దళితులే జగన్ పతనానికి నాంది పలకబోతున్నారు.”

గిరిజనులకు తల్లిలాంటి ఐ.టీ.డీ.ఏ. ను జగన్ నాశనంచేశాడు. జగన్ ను మించిన క్రూయల్ సీఎం మరొకరు ఉండరు – గుమ్మడి సంధ్యారాణి
“జగన్మోహన్ రెడ్డిని మించిన క్రూయల్ సీఎం మరొకరు ఉండరు. నా గిరిజనులు, నా దళితు లు అంటూనే జగన్ వారికి తీరని ద్రోహంచేస్తున్నాడు. అతనికి ఉపయోగపడితేనే ఏపథకం అయినా జగన్ అమలుచేస్తాడు తప్ప, ప్రజలకోసం చేయడు. తండ్రి చనిపోయినప్పుడు హెలి కాఫ్టర్ ప్రమాదంలో చనిపోయాడు.. చంపేశారని దీనాతిదీనంగా ఏడ్చిన జగన్, 2019లో అధికారంకోసం సొంతబాబాయ్ ని చంపించాడు. అలానే తనఅభిమానితో కోడికత్తి డ్రామా ఆడి ప్రజల్లో సానుభూతి పొందాడు. ఇప్పుడు సొంతబాబాయ్ హత్యకేసు కంపనాలు ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ ను తాకుతాయన్నభయంతో, అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు.

జగన్ ప్రజలకు ఉపయోగపడే ఐ.టీ.డీ.ఏ వ్యవస్థనునాశనం చేశాడు. గిరిజనులకు తల్లి లాంటిఐ.టీ.డీ.ఏకు వెళితే అక్కడ ఏమీ లేకుండా చేశాడు. కొండప్రాంతాల్లో గిరిజనతండాలను అను సంధానిస్తూ జగన్ ఈ నాలుగేళ్లలో ఒక్కరోడ్డువేసిందిలేదు. గిరిజనమహిళల్ని డోలీల్లో మోసు కొస్తున్న దృశ్యాలుచూస్తూ జగన్ శునకానందం పొందుతున్నాడు. అంబేద్కర్ ఓవర్సీస్ వి ద్య పథకం పేరుమార్చి, తనపేరు పెట్టుకోవడం జగన్ క్రూరత్వానికి పరాకాష్ట. గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని విస్మరించిన జగన్, గిరిజనులకు మంచిచేస్తానంటూ వారి సంపద దోచుకుంటున్నాడు. తనదోపిడీకి గిరిజనులు అడ్డుగా ఉన్నారన్నఅక్కసుతో వారిలో వారికి కలహాలుపెడుతూ, గిరిజనజాతిని నిర్మూలించేందుకు కుట్రలు పన్నుతున్నా డు.”

జగన్ పదితలల రావణాసురుడు. భూమాఫియా, లిక్కర్ , మైనింగ్ కుంభకోణాలు, మహిళలు, దళితులపై దాడులే అతని తలలు – దేవినేని ఉమామహేశ్వరరావు
“జగనాసురుడు.. అవినీతి నేరాల రాక్షసుడు. పదితలల రావణాసురుడు. బాబాయ్ హత్య కేసుకు సంబంధించిఅన్ని వేళ్లు జగన్ కు ఉన్న ఒకతలవైపు చూపిస్తున్నాయి. భూకుంభకో ణాలు చేస్తున్నది జగన్ రెండోతలకాయ. ఇసుకమాఫియా మూడోతల. లిక్కర్ మాఫియా 4వ తల. మైనింగ్ మాఫియా 5వ తల. రైతుల్ని నాశనంచేస్తూ, వ్యవసాయశాఖకు తాళాలే సింది జగన్ 6వతల. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోర్టులో ఫైళ్లు మాయంచేసి, కోర్టులచుట్టూ తిరుగుతున్నాడు. మహిళల్నివేధిస్తూ, వారిమానప్రాణాలు తీస్తున్నది జగన్ 7వ తల. దళితుల్ని హింసిస్తూ, వారిపై దారుణాలకుతెగబడుతున్నది జగన్ 8వ తలకాయ. భస్మాసు రుడిలా రాష్ట్రాన్ని నాశనంచేస్తున్నది జగన్ 9వ తల. పేదలపై పన్నులభారంవేస్తూ, వారిరక్తాన్ని తాగుతున్నది జగన్ 10వ తల. జగన్ దరిద్రపు పాదంపెట్టాకే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది.

సుప్రీంకోర్టు 09-03-2013న చెప్పిన మాటలు, ఈ నాలుగేళ్లలో జగన్ మనస్తత్వాన్ని, అతని దుర్మార్గాలను ప్రజల కళ్లముందు ఉంచాయి. “దేశఆర్థికవ్యవస్థను నాశనంచేసిన ఆర్థిక నేర గాళ్లను శిక్షించకపోతే, సమాజమే నాశనమవుతుంది. హత్యలు ఆవేశకావేశాలతో జరగవ చ్చు..కానీ ఆర్థికనేరాలు మాత్రం నిర్దిష్టలెక్కలు, ఉద్దేశపూర్వకప్రణాళిక, వ్యక్తిగత లాభాల్ని దృష్టిలో ఉంచుకొనే చేస్తారు.” అన్నసుప్రీంకోర్టు వ్యాఖ్యలు జగన్ కు, అతని మనస్తత్వానికి అతికినట్టు సరిపోతాయి. సుప్రీంకోర్టు ఆనాడుచెప్పిందే ఏపీప్రజలు ఈ 4ఏళ్లలో అనుభవించారు.

జగన్ దరిద్రపుపాదంతో రాష్ట్ర ఇరిగేషన్ రంగం సర్వనాశనమైంది. ఇరిగేషన్ రంగానికి రూ.68వేలకోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు ఎక్కడ.. పోలవరంప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేసి న జగన్ ఎక్కడ? రివర్స్ టెండరింగ్ డ్రామాతో పోలవరాన్ని నాశనంచేసిన జగన్, రాష్ట్ర రైతాం గాన్ని దారుణంగా మోసగించాడు. జగన్ తన నాలుగేళ్లపాలనలో ఒక్కఎకరాకైనా నీళ్లిచ్చా డా? కృష్ణానీళ్లు మావేనని పక్కరాష్ట్రం వాదిస్తుంటే, రూ.100కోట్లు ఎన్నికలకోసం తీసుకున్న జగన్ నోరెత్తడంలేదు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులపై మనరాష్ట్రానికి ఉన్న నీటిహక్కుల్ని జగన్ పొరుగురాష్ట్రాలకు ధారాధత్తంచేశాడు.”

LEAVE A RESPONSE