Suryaa.co.in

Telangana

ఒకటో తేదీనే అందరికీ వేతనాలు ఏమయ్యాయి రేవంత్?

– బకాయిపడిన వేతనాలు వెంటనే విడుదల చేయాలి
– ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ పంచాయతీ ఉద్యోగి ఏడు నెలలుగా జీతాలు లేక.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం చాలా బాధాకరం. ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనానికి సిగ్గుతో తలదించుకోవాలి. ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలి.

ఒకటో తేదీనే అందరికీ వేతనాలు అని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊదరగొట్టి, అధికారంలోకి రాగానే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయపడింది. గత నెలలో సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వసీం 3 నెలలుగా జీతాల్లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆరు నెలలుగా వేతనాలు లేవని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గేట్ ఆపరేటర్ జీతాల ఇప్పించాలని వేడుకుంటూ మంత్రి శ్రీధర్ బాబు కాళ్లపై పడ్డాడు. ఈ వరుస ఘటనలన్నీ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనాలు. ఇప్పటికైనా బకాయిపడిన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.

LEAVE A RESPONSE