Suryaa.co.in

Telangana

రైతు డిక్లరేషన్ ఏమైంది?

– రైతు డిక్లరేషన్ లో తొమ్మిది హామీలు ఏమయ్యాయి
– కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు వెళ్లడం లేదు?
– మార్కెట్ ధర కంటే ఎమ్మెస్పీ ధర తక్కువగా ఉంది
– బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి

హైదరాబాద్: సమైక్య పాలనలో తెలంగాణ బీడు భూమిలా మారింది. రైతు బంధు,రైతు భీమా, 24 గంటల కరెంటు, కేసీఆర్ ఇచ్చారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నేడు 4,598 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారు.

ఇప్పటి వరకు క్వింటా ధాన్యం కొనుగోలు చేయలేదు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడుస్తోంది. రైతులు 1800 రూపాయలకే ధాన్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు మిల్లర్లు గుర్తుకు వచ్చారు. రైతుల ధాన్యాన్ని ఏపీ మిల్లర్లు కొనుక్కుంటున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధాన్యం కేంద్రాలు ప్రారంభించి రీల్ లీడర్లుగా మిగిలారు. పత్తి క్వింటాలుకు 5 వేల రూపాయలకు మాత్రమే కొంటున్నారు. రైతులను దళారులు మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు వెళ్లడం లేదు?కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్లకు పరిమితం అయ్యారు. సీసీఐ ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు.

రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైంది? రైతు డిక్లరేషన్ లో తొమ్మిది హామీలు ఏమయ్యాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వరంగల్ డిక్లరేషన్ కాదు వంచన డిక్లరేషన్. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల గుండెల్లో ఉన్నారు

భయం రూపంలో కాంగ్రెస్ నేతల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. గ్రామాల్లో కేసీఆర్ పధకాల లిస్టు- రేవంత్ రెడ్డిపై తిట్లు ఇదే నడుస్తోంది. తెలంగాణలో 2023 నాటికి 2 కోట్ల 20 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం పెరిగింది. మార్కెట్ ధర కంటే ఎమ్మెస్పీ ధర తక్కువగా ఉంది.

దొడ్డు వడ్లకు ప్రభుత్వం బోనస్ ప్రకటించాలి. కేసీఆర్ విధానాలు రూపొందించారు. కేసీఆర్ ను ఎందుకు తిడుతున్నారో
సమాధానం చెప్పాలి వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించింది కేసీఆర్.

డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే, జనవరిలో
సివిల్ సప్లైస్ స్కామ్ చేశారు. సివిల్ సప్లైస్ స్కామ్ లో హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి రైతులను,పోలీసులను రియల్ ఎస్టేట్ ను ఆగం చేశారు కాంగ్రెస్ కమీషన్లు ఒకవైపు, ప్రజల కన్నీళ్లు ఒకవైపు అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన ఉంది.

LEAVE A RESPONSE