Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశాడని జగన్ ని నమ్మాలి?

– సజ్జల మాటలు జగన్ ప్రభుత్వంపై ఆయనకున్న దింపుడుకళ్లం ఆశలే
– దళితులు, బీసీలు, మైనారిటీలను హింసిస్తూ, వారిమానప్రాణాలు తీస్తున్నందుకా, 3,200మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైనందుకా? జగన్ పాలనలో మహిళలపై 52,540 అఘాయిత్యాలు జరిగినందుకా?
• ‘జగనే మా దరిద్రం’ అని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తుంటే సజ్జలకు, ముఖ్యమంత్రికి వినిపించడం లేదా?
• సొంతతల్లి, చెల్లి, బావ, బాబాయ్ కూతురే జగన్ ని నమ్మకపోతే ప్రజలు ఎలానమ్ముతారు సజ్జల?
• జగన్ చెల్లిషర్మిల, మరోచెల్లి డాక్టర్ సునీత, వారి తల్లి గారే జగనే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటుంటే సజ్జల మాత్రమే ఆయనే ప్రజల నమ్మకం అనడం విడ్డూరంగా ఉంది.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా దింపుడుకళ్లం ఆశలు సన్నగిల్లలేదని, సజ్జల రామకృ ష్ణారెడ్డి జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ నినాదాలు రాష్ట్రమంతా మారు మోగాలని చెప్పడం దింపుడుకళ్లం ఆశలుకాక ఏమిటని, జగనే రాష్ట్రానికి పట్టినదరిద్రం అని ప్రజలంతా అనుకుంటున్నారనే నిజాన్ని పాలకులు అంగీకరించాల్సిం దేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …

52,540 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినందుకు, 21,750 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడినందుకు, 3,200మంది రైతుల ఉసురుతీసినందుకు జగన్ ని నమ్మి, జగనన్నే మా భవిష్యత్ అనాలా?
“ప్రజలు జగన్ పై ఎందుకు నమ్మకం పెట్టుకోవాలో సజ్జల చెప్పాలి. జగనన్నే మాభవిష్యత్ అని ఎందుకు జనం అనాలి? 4ఏళ్లపాలనలో 3,200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే లా చేసినందుకు జగన్ పై రైతులు నమ్మకం పెట్టుకోవాలా? ఇంకానమ్మి ఎంతమంది ప్రా ణాలు పోగోట్టుకోవాలి? 21,570 మంది నిరుద్యోగులు జగన్ ను నమ్మి బలవన్మరణాలకు పాల్పడ్డారు. జగన్ ను నమ్మబట్టే 52,540 మంది మహిళలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరిగాయి. ఇన్నిదారుణాలు జరిగాకకూడా మహిళలు జగనన్నే మా నమ్మకం అని ఏ ము ఖంపెట్టుకొని అంటారు? దళితులఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు వారికోసం అమలుచేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని రద్దు చేశాడు. ఎన్నికలు సమీ పిస్తున్నాయని అంబేద్కర్ పేరుతీసేసి తనతండ్రి వైఎస్సార్ పేరుతో పథకాన్ని తూతూమంత్రం గా పునరుద్ధరించాడు. పథకం పేరుమార్చినందుకు, దళితులపై ఎస్సీఎస్టీకేసులుపెట్టి, వారి ని వేధిస్తున్నందుకు, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ రద్దుచేసినందుకు ఆయావర్గాలు జగన్ ను నమ్మా లా? దళితవర్గాలు జగనే మా దరిద్రం అని ముక్తకంఠంతో నినదిస్తుంటే, జగన్ చెవికి ఎక్కడం లేదా? జగన్ రాష్ట్రంలో తనతండ్రి విగ్రహాలు పెట్టుకుంటూ, అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ వంటి వారి మహానీయుల విగ్రహాల్ని పెళ్లగిస్తున్నాడు. ఆ పనిచేసినందుకు దళితులు జగన్ ను నమ్మాలా?

పనికిమాలిన మద్యంపాలసీతో మహిళల పుస్తెలు తెంపుతున్నందుకు వారు జగన్ ని నమ్మాలా? ఆడబిడ్డల మానప్రాణాలు గాల్లోకలుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నందుకు వారు జగన్ ని నమ్మాలా?
జగన్ తీసుకొచ్చిన పనికిమాలినమద్యంపాలసీతో మహిళల పుస్తెలు తెగిపోతున్నందుకు వారు జగన్ ను నమ్మాలా? రుణమాఫీచేస్తానని డ్వాక్రామహిళలకు టోకరా వేసినందుకు వారు జగన్ ని నమ్మాలా? ఆడబిడ్డల మానప్రాణాలు గాల్లోకలుస్తున్నా నిమ్మకు నీరెత్తిన ట్టుగా వ్యవహరిస్తున్నందుకు వారు జగన్ ని నమ్మాలా? దేశ, విదేశీ ప్రజల ప్రశంసలు అందుకోవాల్సిన మహానగర అమరావతి నిర్మాణాన్ని నిలిపేసినందుకు ప్రజలు జగన్ పై నమ్మకం ఉంచాలా? సొంత బాబాయ్ హత్యకేసు ముద్దాయిలను పట్టుకోలేని చేతగాని సీఎంని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఆయనపై ప్రజలు ఎం దుకు విశ్వాసంచూపాలి? సొంతచెల్లి షర్మిల ఏంచెబుతుందో జగన్ కు వినపడుతోందా? తనఅన్న తనను స్వార్థానికి వాడుకొని వదిలేశాడని, అలాంటి వాడిని నమ్మకండి అని ఆమె అంటుంటే, రాష్ట్రప్రజలు మాత్రం మా నమ్మకం నువ్వే జగనన్నా అనాలా? జగన్ ను ఉద్దేశించి నా భవిష్యత్ నువ్వే నాయనా అని ఆయన తల్లి విజయమ్మ అంటోందా? వివేకాకూతురు డాక్టర్ సునీత జగనన్నే నా భవిష్యత్ అని అంటోందా? జగన్ బావ అనిల్ కుమార్ బైబిల్ ను కూడా విస్మరించి, తనబావను గెలిపించడానికి దేవుడి ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడిచారు. ఆయన జగన్ బావే నానమ్మకం అంటున్నాడా? వారెవరూ జగన్ ను నమ్మకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? మానమ్మకం నువ్వే జగనన్నా అని ఎలా అంటారు?

మాస్కులు అడినందుకు డాక్టర్ సుధాకర్ ని, ఇసుక, మద్యం మాఫియాలపై ప్రశ్నించారని వరప్రసాద్, ఓంప్రతాప్ లను బలితీసుకున్నందుకు, పులివెందులలో దళితమహిళ నాగమ్మ ను అత్యంతకిరాతకంగా హత్యాచారానికి గురిచేసినందుకు దళితులు జగన్ ని నమ్మాలా?
మాస్కులు అడిగాడన్న అక్కసుతో, తనను ప్రశ్నించారన్న అక్కసుతో మంచి డాక్టర్ సుధాక ర్ నిపిచ్చివాడిగా మార్చి, అతనిచావుకి కారుకుడు అయినందుకు జగన్ ని నమ్మాలా? ఇసుకమాఫియా వల్ల గ్రామాల్లో రోడ్లుపాడవుతున్నాయని ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే దళితయువకుడికి శిరోముండనం చేయించినందుకు దళితులు జగన్ పై నమ్మకం పెట్టుకోవాలా? దళితబిడ్డను గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ వద్దపడేస్తే, నిందితుల్ని శిక్షించలేని జగన్ ని దళితఆడబిడ్డలు నమ్మాలా? పులివెందులలో దళితమహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే, దుర్మార్గుల్ని శిక్షించలేని జగన్ ని, మానమ్మకం నువ్వే జగన్ అం టారా? ఓంప్రతాప్ అనే దళితుడు మద్యంఅమ్మకాలతో జగన్ దోచుకుంటున్న తీరుని ప్రశ్నిం చినందుకు అతన్నిచంపేశారు. రాజధాని దళితరైతులచేతులకు బేడీలువేసి, తప్పుడుకేసుల తో వారిని జైళ్లకు పంపినందుకు దళితులు జగన్ ను నమ్మాలా?

రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయని సాక్షాత్తూ ప్రధానే అంటుంటే, జగన్ ని ప్రజలు ఎలా నమ్ముతారు?
రాష్ట్రంలోని పరిస్థితులన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయని సాక్షాత్తూ ప్రధానమంత్రే అంటుంటే ఏపీ ప్రజలు మాత్రం మానమ్మకం జగనన్నే అంటారా? ప్రధాని అన్నమాటకు అర్థం జగనే మా దరిద్రం. సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రజల్ని మోసగించడానికే కొత్త నినాదాలతో ప్రజల్నివంచించడానికి సిద్ధమయ్యారు. మాయామశ్చీంద్ర మాటలుచెప్పడం మాని జగన్, అతనిప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు మంచిపాలన అందించాలి.” అని రామయ్య హితవు పలికారు.

LEAVE A RESPONSE