Suryaa.co.in

Andhra Pradesh

గుడి అయితే నాకేంటి….నా వ్యాపారం నాదే

– కబేలా వద్దంటుంది….కార్పొరేషన్ కాదంటుంది
విజయవాడ కొత్త పేట బ్రాహ్మణ వీధిలోని దేవాలయాలు ఉన్న ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మాంసం దుకాణం వ్యవహారం రగులుతుంది. మున్సిపల్ ఆఫీస్ లోని ఒక అధికారి అండ దండలతో , మాంసం షాప్ యజమాని బిల్డింగ్ ఓనర్ సహకారంతో స్థానికంగా నివాసం ఉండే ప్రజలతో మళ్ళీ సంతకాల సేకరణ షురూ చేసిండ్రు.ఇంకేముంది రంగంలోకి దిగిన ఆ అధికారి, ఏకంగా బినామీ పేర్లతో కబేలా నుండి ఏవిధంగా అయినా మాంసం ను తెచ్చి అమ్మకాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
మటన్ షాప్ యజమాని యధావిధంగానే మాంసం షాపులోకి, మాంసం అమ్ముకోవటానికి కబేలా కు నాలుగు మేకలని కటింగ్ కోసం తీసుకెళ్తే పాపం చేదు అనుభవం ఎదురైంది.ఉన్నత అధికారులు అనుమతి లేనిదే, మీకు కబేలా నుండి ఎటువంటి సహకారం ఉండదు అని తేల్చి చెప్పినట్టు సమాచారం.అగ్రహించిన మటన్ షాప్ యజమాని ప్రతిపక్షం, అధికార పక్షం నాయకులతో మున్సిపల్ వెటర్నరీ డాక్టర్ పై వత్తిడి తెస్తున్నట్టు వినికిడి.
అసలు ఇంతలా ఆ మాంసం కొట్టు విషయం లో రాజకీయ ప్రలోబాలకు, అధికారులపై వత్తిడి తెస్తూ పైరవీలు చేయటానికి, అక్కడే మాంసం కొట్టు పెట్టటానికి గల కారణం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.ఒక వేళ ఆ మాంసం దుకాణం యజమానికి ఏమైనా హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులపై, ఏమైనా కోపం ఉందా అన్న కోణం కూడా ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఉన్న మాంసం దుకాణం కు కూత వేటు దూరంలో ఉన్న మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాంసం మార్కెట్ లో షాపుని మార్చవలసిందిగా అధికారులు ఎన్నిసార్లు చెప్పినా , అతని మొండి పట్టుదల విడకుండ స్థానిక నాయకులు అండ దండ లతో మరింత ఉదృతుంగ మున్సిపల్ అధికారులపై వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది.
ఎన్ని దేవాలయాలు ఉన్నా నా మాంసం కొట్టు ని విశంతైనా కదల్చలేరు నన్ను కూడా ఏమి చేయలేరు అని బహిరంగంగానే అంటున్నాడు అంటేనే అర్ధమవుతుంది ఇక హిందూ దేవాలయాలకు, హిందూ సంప్రదాయానికి ఎంతలా గౌరవిస్తున్నారో మన అధికారులు తెలుస్తుంది.నేను షాపు తెరుస్తాను ఎవరేమి చేసుకుంటారో చేసుకోండి నా దమ్మెంటో నేను చూపిస్తాను అని అంటున్న షాప్ యజమాని.
మరి మున్సిపల్ అధికారులు మటన్ షాప్ యజమానికి బయపడతారా లేక హిందూ సంప్రదాయాన్ని గౌరవించి భక్తుల మనోభావాలకు గౌరవిస్తారా చూద్దాం.

LEAVE A RESPONSE