– మీ అంచనాలకు ఏమిటి ప్రాతిపదిక?
– ప్రజాభిప్రాయం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలా?
– జీహెచ్ఎంసీ కమిషనర్‌పై మాజీ మంత్రి తలసాని ఫైర్
హైదరాబాద్: ఒక స్పష్టమైన విధానం లేకుండా డీ లిమిటేషన్ పేరుతో జీహెచ్ఎంసీ లో డివిజన్ లను ఇష్టమొచ్చినట్లు గా ఏర్పాటు చేశారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ ల ఏర్పాటు లో జరిగిన తప్పిదాలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ లతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ కర్ణన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళం గా ఉందని ఆయన కమిషనర్ కు వివరించారు. కార్పొరేటర్ ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకోవడానికే మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు. అనంతరం మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ,, అంత హరిబరిగా ORR లోపల ఉన్న మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ లను జీహెచ్ఎంసీ లో విలీనం చేసి 150 ఉన్న డివిజన్ లను 300 కు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆఫీసులలో కూర్చొని వారికి తోచినట్లు డివిజన్ లను ఏర్పాటు చేశారని అన్నారు. డివిజన్ ల సరిహద్దులలో కూడా పారదర్శకత లేదన్నారు. మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశం లో ఈ అంశంపై గట్టిగా మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడున్న 150.డివిజన్లకు సరియైన అధికారులు, మ్యాన్ పవర్. లేని పరిస్థితుల్లో.. నూతనంగా మరో150 డివిజన్ లను ఏ విధంగా పెంచారని ప్రశ్నించారు.
కార్పొరేటర్లకు గుడ్ న్యూస్…డివిజన్ కు 2 కోట్ల రూపాయలు చొప్పున నిధులు ఇస్తామని చెప్పి హడావిడి చేసి ఇంచార్జి మంత్రులకు అప్పగించడం ఎంత వరకు సబబు అన్నారు. నగరంలో ని వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ లలో కూడా, కేవలం తమ పార్టీకి చెందినవి మాత్రమే తొలగిస్తున్నారని అన్నారు. తొలగిస్తే అన్ని ఫ్లెక్సీ లను తొలగించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ లో ఈ అంశంపై కూడా నిలదీస్తామని హెచ్చరించారు. కమిషనర్ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.