– బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ
– తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు, ఇతర బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికీ అమలు చేయమని చెప్పడమే.. ఇదే విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు?
బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత బీసీలను వంచించాలనే చూస్తోన్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడతాం. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కంటితుడుపు చర్య మాత్రమే. ఎందుకు ప్రధాని దగ్గరకు అఖిలపక్షం తీసుకెళ్లడం లేదు
ప్రధాని తో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న లాలూచీ ఏంటి? బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తాం