– ఉన్నవే ఇక్కడనుండి పీక్కపోతున్నాయి
– ఈయన సక్కదనానికి వాడు వచ్చి పెడతాడా ?
– రేవంత్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మరో మాట మాట్లాడుతున్నారు.వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైక్ ముందు ట్రిపుల్ ఆర్ రోడ్డు వెంటనే పూర్తి చేస్తామని అంటాడు.. బాధితులు వెళ్తే అది ఇప్పట్లో అవ్వదు వెళ్ళిపొండి అని అంటాడు.
సినిమాలకు ముందు రోజు టికెట్ రేట్లు పెంచితే, తనకు తెలియకుండా పెంచారు అని అంటాడు. జూపల్లి కృష్ణారావు లిక్కర్ బ్రాండ్లను తనకు తెలియకుండా మార్చారు, తనకు తెలియకుండా నోటిఫికేషన్లు ఇచ్చారు అని అంటాడు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసింది అంటాడు. మళ్ళీ పొద్దుగాల రేవంత్ రెడ్డికి, నాకు మధ్య గ్యాప్ ఏమి లేదని అంటాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కమిషన్ల దందా నడుస్తుంది.. పొల్యూషన్ చేస్తున్న కంపెనీలను తగలబెడుతా అని అంటాడు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నా నియోజకవర్గంలో వరదలు వచ్చాయి. మా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశాడు. ప్రపంచ బ్యాంకు కేంద్రం అనుమతి లేకుంటే, రాష్ట్ర ప్రభుత్వానికే అప్పు ఇవ్వదు, ఆయన తన నియోజకవర్గానికి అప్పు ఇవ్వాలని లేఖ రాశాడు.
చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసలు రిజర్వేషన్లే సరిగ్గా చేయలేదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుంది?
ట్రంప్ బాగా చేస్తలేడు ఇక్కడికి రండి అవకాశాలు ఇస్తానని మాట్లాడే మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూశారా? ఇప్పటివరకు ట్రంప్ మీద మోడీనే ఒక్కమాట మాట్లాడలేదు. ఊర్లో బజారులో కూర్చున్న వాడు ఎవరిని అయినా తిట్టొచ్చు.. కానీ ఒక ముఖ్యమంత్రి లాగా ఉండి ఏం మాట్లాడాలో సోయి ఉండాలి కదా?
కనీసం 10 సార్లు అమెరికా పోయిన మీ రాహుల్ గాంధీ కూడా ట్రంప్ మీద మాట్లాడలేదు. ఉన్నవే ఇక్కడనుండి పీక్కపోతున్నాయి.. ఈయన సక్కదనానికి వాడు వచ్చి పెడతాడా?