– జగన్ కు పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?
యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
ఇది వెంకటగిరి నియోజకర్గం ఆకిలవలసలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద గత టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సోలార్ పంపు సెట్. బీళ్లుగా మారిన పేదల భూముల్లో సాగునీటి వసతిని కల్పించేందుకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటుచేసే ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద రూ.55వేల విలువైన సోలార్ పంపు సెట్ ను సాధారణ రైతులకైతే రూ.25వేలకు, ఎస్సీ,ఎస్టీలకు రూ.6వేలకే అందించాం. దీనిని స్టిక్కర్ సిఎం జగన్…వైఎస్సార్ జలకళగా మార్చాడు. ఏడాదికి నియోజకవర్గానికి 500 బోర్లు వేయిస్తానని చెప్పి, 50నెలల్లో ఒక్క బోరు వేసిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి జగన్ కు పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?