స్వామివారి నైవేద్యాన్ని అపవిత్రం చేసిన ఈ ‘పంచ మహా పాతక బంధువుల’ చిట్టా ఇదే. చదివి తరించండి
స్వామివారి నైవేద్యంలో విషాన్ని నింపిన ఈ “రాక్షస” బంధుగణం చరిత్రలో క్షమార్హులు కాని నేరస్తులుగా మిగిలిపోతారు! పరమ పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడానికి ఈ రాక్షసులకు చేతులెలా వచ్చాయో!
రిపోర్టులను మింగేసిన మాయగాడు.. చెవిరెడ్డి గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న పల్లి ఈశ్వర్ రెడ్డి (A-25) గారికి సామాన్య భక్తుల నమ్మకం గుర్తురాలేదు కానీ, నెయ్యి కల్తీ అని చెప్పిన CFTRI ల్యాబ్ రిపోర్టులు మాత్రం భలేగా కనిపించాయి. ఆ రిపోర్టులను బయటపెడితే పైనున్న వారికి కోపం వస్తుందని కాబోలు, చకచకా ఫైళ్ల కింద తొక్కిపెట్టేశారు. ఒక జూనియర్ అసిస్టెంట్‌కి ఇంతటి “ధైర్యం” వచ్చిందంటే, వెనుక ఉన్న రాజకీయ ‘చెవి’ ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు!
సర్టిఫికెట్ల పంపిణీలో ‘భూమన’ మార్కు.. ఇక భూమన గారి బంధువుల సంగతి సరేసరి. పెరూరు జగదీశ్వర రెడ్డి (A-28) గారు తన ఇన్స్పెక్షన్ కమిటీలో ఉండి, పనికిరాని డైరీలకు కూడా “అద్భుతం.. అమోఘం” అంటూ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం చూస్తుంటే, ఆయనకి స్వామివారి మీద కంటే కాంట్రాక్టర్ల మీద ఉన్న మమకారం ఇట్టే అర్థమవుతోంది. అదే కోవలో మరో బంధువు కాసిరెడ్డి హరినాథ్ రెడ్డి (A-31) గారు గోసంరక్షణ శాల డైరెక్టర్‌గా ఉంటూనే, ఈ కల్తీ నెయ్యి కుట్రలో ‘గో’ప్యంగా భాగస్వామి అయ్యారు. ఆవుల సంరక్షణ కంటే, కల్తీ కమీషన్ల సంరక్షణే వీరికి ప్రాధాన్యమైనట్టుంది.
వైవీ గారి ‘ఎక్స్-పర్ట్’ విన్యాసాలు.. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారి సన్నిహితుల తెలివితేటలు ఇంకాస్త పైస్థాయిలో ఉన్నాయి. మద్ది విజయభాస్కర్ రెడ్డి (A-34) అనే నిపుణుడు, నెయ్యిలో కల్తీని పట్టేసే ‘బీటా సిటోస్టెరాల్’ పరీక్షే వద్దంటూ సెలవిచ్చారు. అంటే, దొంగకు తాళాలు ఇచ్చి గోడ దూకడానికి నిచ్చెన వేసినట్లు అన్నమాట. ఇక వైవీ గారి పీఏ కదురు చిన్నప్పన్న (A-24) గారి కక్కుర్తికి హద్దుల్లేవు. చైర్మన్ గారి పక్కనే ఉంటూ, కల్తీ కాంట్రాక్టర్ల దగ్గర కాసులు వసూలు చేస్తూ ‘పీఏ’ అంటే ‘పర్సనల్ ఏజెంట్’ అని కొత్త అర్థం చెప్పారు.
మొత్తానికి, తిరుమలలో ప్రసాదం కంటే బంధువుల ప్రయోజనాలే మిన్నగా సాగాయి. గాలిగోపురం ఎత్తులో ఉన్న అవినీతి కల్తీని కప్పిపుచ్చడానికి ఇన్ని రోజులు ప్రయత్నించినా, ‘సిట్’ నివేదికతో అసలు రంగు బయటపడింది. భక్తుల నమ్మకాన్ని కొవ్వుతో నింపిన ఈ నేతలు, వారి బంధుగణం ఆ న్యాయదేవత ముందు ఎన్ని కుప్పిగంతులు వేసినా.. కోనేటి రాయుడి ముందు వారి ఆటలు సాగవు! ఆ పాతకుల పాపాన్ని దులిపేస్తూ సమర్థించే మనుషులకు పుట్టగతులు ఉండవు.
-చాకిరేవు