Suryaa.co.in

Telangana

సినిమాల్లో ఏమిటీ అశ్లీలం?

– తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ లో మహిళలతో అసభ్యకరంగా పాటలు చిత్రీకరించడంపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ఇటీవల విడుదలైన కొన్ని పాటలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.

సినిమాల్లో మహిళల గౌరవాన్ని కాపాడేలా అన్ని విభాగాలు చొరవ చూపాలని కమిషన్ కోరింది. మహిళలను హీనంగా చిత్రించేలా ఉండే పాటలు, దృశ్యాలకు తగిన నియంత్రణలు ఉండాలంటూ కమిషన్ పిలుపునిచ్చింది.

ఈ పాటల్లో మహిళలను హీనంగా చూపిస్తూ, అభ్యంతరకర దృశ్యాలతో ప్రదర్శించారని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, సినిమా నిర్మాతలు, దర్శకులు, కొరియోగ్రాఫర్ల ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకూడదని హెచ్చరిక జారీ చేసింది.

మహిళలను అవమానించే విధంగా పాటలు చిత్రీకరించడం మహిళల హక్కులకు భంగం కలిగించే చర్య అని కమిషన్ పేర్కొంది.”ఇలాంటివి మళ్లీ కొనసాగితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము,” అని నేరెళ్ల శారద హెచ్చరించారు.

LEAVE A RESPONSE