• హెరిటేజ్ డాక్యుమెంట్లను ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది?
• సిట్ కార్యాలయం బయట హెరిటేజ్ ఫైల్స్ ను కట్టలు కట్టలు తగలబెడుతూ అధికారుల అడ్డంగా దొరికారు
• బాబాయి గొడ్డలివేటు రక్తపు మరకలను మాయం చేసినట్లు… చంద్రబాబు, లోకేష్ లపై మోపబడిన తప్పుడు కేసుల ఫైల్స్ ను మాయం చేసేందుకు జగన్ కుట్ర
• కూటమి అధికారంలోకి వస్తే తప్పుడు కేసులకు సంబంధించి తాము సృష్టించిన ఫేక్ డాక్యూమెంట్లపై విచారణ జరుగుతుందన్న భయంతోనే నేడు వాటిని తగలబెట్టారు
• జిరాక్స్ మిషన్ లో పేపర్లు ఇరుక్కున్నాయంటూ సీఐడీ డొల్ల సమాధానం
• తాడేపల్లి ప్యాలెస్ కు ఊడిగంచేస్తూ రెడ్ బుక్ లో తమ పేర్లు నమోదు చేయించుకున్న అధికారులపై చర్యలు తప్పవు
• నేడు సిట్ కార్యాలయం వద్ద ఫైళ్లు తగలబడినట్టే సెక్రటేరియట్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో తగలబడవని గ్యారెంటీ ఏంటీ ?
• కేంద్ర ఎన్నిలక కమిషన్ సెక్రటేరియట్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి
డీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్
హెరిటేజ్ ఫైల్స్ దగ్ధంపై పట్టాభిరామ్ మాట్లాడుతూ… సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ ఫైల్స్ ను కట్టలు కట్టలు తగలబెడుతూ నేడు అధికారులు అడ్డంగా దొరికారు. తాము నమోదు చేసిన తప్పుడు కేసులకు సంబంధించి సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్లను ఎలా తగలబెట్టింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు హెరిటేజ్ డాక్యుమెంట్లను ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? గతంలో నారా చంద్రబాబునాయు మొదలక్కొని లోకేష్ , అచ్చెం నాయుడు , దూళిపాళ్ల నరేంద్ర , దేవినేని ఉమా తదితరులపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఆ కేసులకు సంబంధించి తాము చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు బలపర్చడానికి అనేక ఫేక్ డాక్యూమెంట్లను సైతం సిట్ , సీఐడీ అధికారులు సృష్టించారు.
అటువంటి ఫేక్ డాక్యుమెంట్లను నేడు సిట్ కార్యాలయం వద్ద తగలబెట్టడం జరిగింది. గతంలో నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులు కాబట్టే అవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఈ ఫేక్ ప్రభుత్వం కింద రఘురామ రెడ్డి వంటి కొంత మంది అధికారులు ఊడిగం చేస్తూ.. ఇటువంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. నేటి ఈ తప్పుడు ప్రభుత్వానికి ప్రజల చేతిలో ఘోర ఓటమి తప్పదని తెలిసి తాము చేసిన చట్ట వ్యతిరేక పనులకు సంబంధించిన సాక్ష్యాలను రూపు మాకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు, లోకేష్ తదితరు లపై మోపబడిన తప్పుడు కేసులు, ఫేక్ డాక్యుమెంట్ల పై విచారణ జరుగుతందని భయం ఏర్పడింది. అందుకే ఫేక్ డాక్యుమెంట్లను లేకుండా చేసేందుకు సిట్ అధిపతి కొల్లి రఘురామ రెడ్డి, పోలీసులు అధికారులు కుట్ర పన్నారు.
డాక్యుమెంట్ల దగ్ధంపై సీఐడీ, సిట్ అధికారుల వివరణ హాస్యాస్పదంగా ఉంది. జిరాక్స్ మిషన్ లో పేపర్లు ఇరుక్కు పోయాయని, ప్రింటర్ లో ఇంక్ అయిపోయిందని రకరకాల కారణాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. జిరాక్స్ మిషన్ లో పేపర్లు ఇరుక్కుపోతే వాటిని తక్షణం చెత్త బుట్టలో వేస్తాం కాని.. ఎవరైనా నెలలపాటు భద్రపరిచి ఆ తరువాత తగులబెడతారా ? ఇంతకంటే విడ్డూరమైన వాదన మరొకటి ఉంటుందా ? చంద్రబాబు, లోకేష్ లపై తప్పుడుగా మోపబడిన కేసులకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ బయట పడితే మూల్యం చెల్లించుకోక తప్పదనే జగన్ సేవలో తరిస్తున్న అధికారులు వాటిని తగులబెట్టించారు. ఫెక్ డాక్యుమెంట్ల దగ్ధాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టకి తీసుకెళ్తాం. డాక్యుమెంట్ల దగ్ధంపై ఈసీ లోతైన విచారణ చేయాలి.
సైకో పాలనలో సెక్రటేరియట్ లో ఉన్న ఫైళ్లకు కూడా నేడు భద్రత లేదు. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఇదే విధంగా ఫైళ్లు దగ్ధం కావని గ్యారెంటీ ఏంటి? అందుకే తక్షణం కేంద్ర ఎన్నిలక కమిషన్ సెక్రటేరియట్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి. బాబాయి గొడ్డలివేటు రక్తపు మరకలను రూపుమాపి సాక్ష్యాలను చెరిపి వేయించిన జగన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా పెట్టించిన తప్పుడు కేసుల ఫేక్ డాక్యుమెంట్లను ఇతర సాక్ష్యాధారాలను నేడు రూపుమాపుతున్నాడు.
సాక్ష్యాలను రూపు మాపడంలో తాడేపల్లి సైకో గతంలోనే పీహెడీ తీసుకున్న విషయం మనకు తెలిసిందే ఆ ప్రావిణ్యం తోనే ఈ ఐదు సంవత్సరాలకాలంలో మద్యం, ఇసుక, మైనింగ్ తదితర వ్యవహారాల్లో తాను దోచుకున్న లక్షల కోట్లకు సంబంధించిన అనేక సాక్ష్యాలను సెక్రటేరియట్ మరియు ప్రభుత్వ కార్యలయాల్లో రూపు మాపే కార్యక్రమానికి తెరలేపాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లి కఠిన చర్యలకు పట్టు బడతాం. లక్షల కోట్ల దోపిడీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్ల ను మాయం చేసేందుకు జరుగుతోన్న ఈ కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని భావిస్తున్నాం.
జరుగుతున్న ఈ కుట్రకు ఒక ప్రత్యక్ష ఉదాహరణే సిట్ కార్యాయం వద్ద ఫైళ్ల దగ్ధం. హెరిటేజ్ ఫైళ్ల దగ్ధంపై ఎన్నికల సంఘం లోతైన విచారణ చేపట్టాలి. వైసీపీ కోసం తప్పుడు పనులు చేస్తున్న అధికారులకు కచ్చితంగా శిక్ష తప్పదు. ఇకనైనా అధికారులు పద్దతి మార్చుకోవాలి. రెడ్ బుక్ లో పేరు ఉన్న ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయని పట్టాభి హెచ్చరించారు.